నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కేవలం 22 గంటల (0.9 రోజులకు సమానం) టర్న్-అరౌండ్ టైమ్‌తో భారత్‌ను అత్యుత్తమ కార్గో నిర్వహణ దేశాల్లో ఒకటిగా నిలిపిన జేఎన్‌పీఏ
Posted On:
04 MAY 2023 4:22PM by PIB Hyderabad
భారతదేశ ప్రధాన కంటైనర్ పోర్ట్ అయిన 'జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ' (జేఎన్‌పీఏ), గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి నిర్వహణ పనితీరును కనబరిచింది. ఆ ఘనత సాధించిన కేవలం ఒక నెల తర్వాత, కంటైనర్ కార్గో నిర్వహణలో ప్రపంచ స్థాయి కొలమానాన్ని నెలకొల్పి మరో మైలురాయి సాధించింది. ప్రపంచ బ్యాంక్ ప్రచురించిన లాజిస్టిక్స్ పనితీరు సూచీ (ఎల్‌పీఐ) నివేదిక - 2023 ప్రకారం, జేఎన్‌పీఏ కేవలం 22 గంటల (0.9 రోజులకు సమానం) అద్భుతమైన టర్న్‌అరౌండ్ టైమ్‌ను (టాట్) కలిగి ఉంది, భారతదేశాన్ని అత్యుత్తమ నిర్వహణ దేశాల్లో ఒకటిగా నిలిపింది.

నౌకలను నిలిపివుంచే సమయాన్ని తగ్గించడంలో తీసుకున్న వివిధ చర్యల కారణంగా జేఎన్‌పీఏ ఈ ఘనత సాధించింది. మెరుగైన రైలు-రోడ్డు అనుసంధానం, కేంద్రీకృత పార్కింగ్ ప్లాజా (సీపీపీ), పనుల డిజిటలీకరణ, నౌకల నిలుపుదల & తిరిగి పంపడంలో క్రమబద్ధీకణ, నౌకను సజావుగా తీసుకురావడానికి మరిన్ని టగ్‌లను మోహరించడంతో తో పాటు టెర్మినల్ నిర్వాహకుల కార్యాచరణ సామర్థ్యం కూడా అతి పెద్ద సహకారంగా నిలిచింది. నౌకాశ్రయం సమర్థవంతంగా పని చేసేలా జేఎన్‌పీఏ చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఇవి.
“జేఎన్‌పీఏ గురించి మనందరికీ ఇది ఒక ఉత్సాహభరిత వార్త. 2022-23లో 6.05 మిలియన్ టీఈయూలను నిర్వహించి నెల క్రితమే రికార్డ్ సాధించాం. ఎల్‌పీఐ 2023 నివేదిక ప్రకారం, మన సామర్థ్యం అనేక దేశాల కంటే మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంక్ సమాచారం స్పష్టం చేసింది. ఎగ్జిమ్ వాణిజ్యం కోసం లాజిస్టిక్స్ ధరను మరింత తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం" అని జేఎన్‌పీఏ చైర్మన్ శ్రీ సంజయ్ సేథీ చెప్పారు.
ఈ అద్భుత విజయం పట్ల జేఎన్‌పీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు నౌకశ్రయ బృందాన్ని అభినందించారు.
*****
(Release ID: 1921995)
Visitor Counter : 191