సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 5న ఐబిసి సహకారంతో పవిత్ర వైశాఖ పౌర్ణమి కార్యక్రమాలు నిర్వహించనున్న సాంస్కృతిక శాఖ


మే 5వ తేదీని ఐక్యరాజ్య సమితి వైశాఖ దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాల నిర్వహణ

Posted On: 04 MAY 2023 1:47PM by PIB Hyderabad

అంతర్జాతీయ బుద్ధ సమాఖ్య (ఐబిసి) సహకారంతో మే 5న వైశాఖ పౌర్ణమి భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబిసి) హిమాలయన్ బౌద్ధ సంస్కృతి సంఘం (హెచ్‌బిసిఎ) సమన్వయంతో న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కార్యక్రమం జరుగుతుంది. 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి గల వివిధ బౌద్ధ సంస్థలు, అనుమతి పొందిన  సంస్థలు ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. 

.లెహ్‌లోని పోలో గ్రౌండ్‌లో లడఖ్ బౌద్ధ సంఘం (ఎల్బిఏ),లడఖ్ గొంపా అసోసియేషన్ (ఎల్జీఏ) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో  లేహ్‌లోని కేంద్ర బౌద్ధ అధ్యయనాల సంస్థ (సిఐబిఎస్) సిబ్బంది, సంస్థలో చదువుతున్న  600 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఈ సందర్భంగా లెహ్‌లోని సీఐబీఎస్‌ విద్యార్థులు ‘మంగళాచరణ్‌’ (ఆవాహన ప్రార్థన) నిర్వహిస్తారు.  సీఐబీఎస్‌ లేహ్( కేంద్రపాలిత ప్రాంతం) విద్యార్థులు బుద్ధుని జననం, బుద్ధుని మొదటి ఉపన్యాసం  వర్ణించే విధంగా రూపొందించిన రెండు శకటాల  ప్రదర్శన ఉంటుంది. 

ఉదయం 6:00 గంటలకు ‘బుద్ధ జయంతి సమరోహ్’నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం   సారనాథ్  సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్  రూపొందించిన పరిశోధన మ్యాగజైన్ “DHIH” 63వ ఎడిషన్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. 

బిహార్‌లోని నలందలోని నవ నలంద మహావిహార  సన్యాసి-విద్యార్థులు బుద్ధ దేవాలయంలో సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.  తర్వాత 'బౌద్ధమతం- బీహార్' అనే అంశంపై ఒక రోజు జాతీయ సెమినార్ జరుగుతుంది. 

బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని దహంగ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ కల్చర్ స్టడీస్ సాంప్రదాయ ఆచారం ప్రకారం  పూజ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సంస్థ  వకృత్వ పోటీలు నిర్వహిస్తుంది. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని జెంట్సే గాడెన్ రాబ్‌గేల్ లింగ్ (GRL) మొనాస్టరీ  సన్యాసి విద్యార్థులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు నిర్వహించిన 'మంగళాచరణ్'ని నిర్వహిస్తారు. 

బుద్ధ పౌర్ణమి సందర్భంగా  టిబెట్ హౌస్‌లో ఆకాంక్ష బోధిసత్వ ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది.

  “బుద్ధుని ప్రబోధాలు, శాంతి , ప్రశాంతత” అనే అంశంపై తవాంగ్ మొనాస్టరీ, అరుణాచల్ ప్రదేశ్ వకృత్వ పోటీలు నిర్వహించనుంది.

లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ & ఆర్కైవ్స్ (LTWA), ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్ ఆధ్వర్యంలో  మే 1 నుంచి మే 5, 2023 వరకు ‘యానిమల్ కాన్షియస్‌నెస్ కాన్ఫరెన్స్  నిర్వహిస్తుంది.

వైశాఖ బుద్ధ పూర్ణిమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజు.   బుద్ధ భగవానుడి జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలు- బుద్ధుని  జననం, జ్ఞానోదయం, మహా పరి నిర్వాణం  సూచిస్తుంది.  బౌద్ధమతం భారతదేశంలో ఉద్భవించింది. దీంతో వైశాఖ బుద్ధ పూర్ణిమ భారతదేశంలో  ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1999 నుంచి వైశాఖ బుద్ధ పూర్ణిమ ను  ఐక్యరాజ్యసమితి వైశాఖ బుద్ధ పూర్ణిమ గా పాటిస్తోంది.  ఈ సంవత్సరం వైశాఖ బుద్ధ పూర్ణిమ మే 5న జరుగుతుంది. 

ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన  మొదటి గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సమావేశం  (20-21 ఏప్రిల్)లో   30 దేశాలకు చెందిన  500 మందికి పైగా పాల్గొన్నారు.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశాన్ని ప్రారంభించారు.  మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన సంస్థలు,  అంతర్జాతీయ బౌద్ధ సంస్థగా గుర్తింపు పొంది న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఐబిసి సహకారంతో  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ   14 నుంచి 15 వరకు "షేర్డ్ బౌద్ధ వారసత్వం" అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల నిపుణులు పాల్గొని విజయవంతం చేశారు.   సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది.  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పటిష్టం చేయాలని లక్ష్యంగా సదస్సు జరిగింది.  

***


(Release ID: 1921973) Visitor Counter : 186