కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
అధిక వేతనాలపై పింఛనుకు సంబంధించి దరఖాస్తులను సమర్పించే తేదీని పొడిగించిన ఇపిఎఫ్ఒ
Posted On:
02 MAY 2023 9:09PM by PIB Hyderabad
గౌరవ సుప్రీం కోర్టు 04.11. 2022న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పింఛనుదారులు/ పింఛనుదారుల సంయుక్త ఎంపిక/ సభ్యుల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను పొందేందుకు ఇపిఎఫ్ఒ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు, ఆన్‌లైన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు. నేటివరకూ 12 లక్షల దరఖాస్తులు అందాయి. ఈ ఆన్‌లైన్ సౌకర్యం 03.05.2023వరకు అందుబాటులో ఉండనుంది.
ఇదిలా ఉండగా, వివిధ వర్గాల నుంచి సమయాన్ని పొడిగించమని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రాలు కూడా అందాయి. ఈ అంశాన్ని పరిగణించి, విస్త్రతమైన అవకాశాన్ని కల్పించేందుకు, అర్హులైన వ్యక్తులందరూ తమ దరఖాస్తులను నింపడానికి తోడ్పడేందుకు, దరఖాస్తులను దాఖలు చేసేందుకు ఆఖరు తేదీని 26 జూన్ 2023గా నిర్ణయించారు.
పింఛనర్లకు/ సభ్యులకు మరింత అవకాశాన్ని కల్పించడం ద్వారా వారు ఎదుర్కొనే ఎటువంటి సమస్యను అయినా పరిష్కరించేందుకు సమయాన్ని పొడిగించడం జరిగింది. ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి అసోసియేషన్ల నుంచి అందుకున్న పలు డిమాండ్లను సానుభూతితో పరిగణించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
***
(Release ID: 1921671)
Visitor Counter : 458