నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

“యూపిఏజే:ఎ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్ట్స్”ని ప్రారంభించిన స్టార్టప్20, అటల్ ఇన్నోవేషన్ మిషన్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ మరియు పండిట్ జస్‌రాజ్ కల్చరల్ ఫౌండేషన్

Posted On: 03 MAY 2023 11:49AM by PIB Hyderabad


ప్రపంచ ఐపీ దినోత్సవం సందర్భంగా జీ20 స్టార్టప్‌20 చైర్‌ డాక్టర్ చింతన్ వైష్ణవ్, పండిట్ జస్‌రాజ్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి దుర్గా జస్‌రాజ్‌తో కలిసి ఏప్రిల్ 26, 2023 న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్‌లో “యూపిఏజే:ఎ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్ట్స్”ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం పేటెంట్స్, డిజైన్స్ మరియు ట్రేడ్‌మార్క్‌ల కంట్రోలర్ జనరల్ కార్యాలయం ద్వారా నిర్వహించబడిన ఐపీ దినోత్సవ వేడుకల కార్యక్రమం.జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్  వీడియో సందేశంతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలయింది. "ఈ కార్యక్రమ భారతదేశ సాంస్కృతిక వారసత్వం కోసం ఐపీ మరియు కాపీరైట్‌ల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహనను కలిగిస్తుంది." అని తన వీడియో సందేశంలో శ్రీ అమితాంబ్‌ కాంత్‌ తెలిపారు.

అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్‌లో ఇన్నోవేషన్‌ను రక్షించడం మరియు దాని ప్రాముఖ్యత మరియు సవాళ్లపై ప్యానెల్ చర్చను నిర్వహించింది. కళాకారులు, ఆవిష్కర్తలు, మేధో సంపత్తి హక్కుల నిపుణులు, పర్యావరణ వ్యవస్థ బిల్డర్లు మరియు విధాన రూపకర్తల నుండి ఈ అంశానికి సంబంధించిన పలు రంగాలలో పనిచేస్తున్న  వాటాదారులు చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చను డాక్టర్ చింతన్ వైష్ణవ్ మోడరేట్ చేసారు. ఈ కార్యక్రమలో శ్రీమతి దుర్గా జస్రాజ్, పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు; శ్రీ నీరజ్ జైట్లీ, పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు; మాస్ట్రో నీలాద్రి కుమార్, సంగీతకారుడు, సితార్ మరియు జితార్; డా. దినేష్ పాటిల్, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ మరియు హెడ్ ఆఫ్ ఆఫీస్ (టెక్నికల్); డా. పృథ్పాల్ కౌర్ సిద్ధు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ మరియు జీ.ఐ, హెడ్ - కాపీరైట్స్ ఆఫీస్, ఢిల్లీ; ప్రొ. అమోఘ్ దేవ్ రాయ్, సంరచన ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్; మరియు న్యాయవాది సవీనా బేడీ సచార్, వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ పార్టనర్ – లావ్ అసోసియేట్స్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో డాక్టర్ చింతన్ మాట్లాడుతూ “కళ మరియు సంస్కృతి విషయానికి వస్తే భారతదేశం ఒక పవర్‌హౌస్. ఈ రోజు మనం ప్రారంభించిన ప్లాట్‌ఫారమ్ కళాత్మక వ్యక్తీకరణను జరుపుకునే ఉద్దేశ్యంతో పుట్టింది మరియు కళా రంగంలో ఆవిష్కరణలు చేస్తున్న వారికి మద్దతుగా ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కార్యక్రమ లక్ష్యమన్నారు.

ఆయన ఈ ఉత్సవాన్ని పరిచయం చేస్తూ "కళలు ఉనికిలో ఉండటానికి ఒక స్థాయిలో వాస్తవికత మరియు సృజనాత్మకత అస్తిత్వం కారణం. మరొక స్థాయిలో స్వచ్ఛత మరియు ప్రామాణికతను మనం కళారూపాలకు విలువ ఇస్తాం" అనే అర్ధాన్ని కూడా ఆయన సూచించారు. అలాగే “ఈ రంగం సమయం మరియు ప్రయోగాలతో అభివృద్ధి చెందుతోంది మరియు ఇతర రంగాల మాదిరిగానే, కళలు కూడా సాంకేతిక పరిణామం ద్వారా రూపాంతరం చెందాయి. ఇలాంటి ఫోరమ్ తమ ఆవిష్కరణలతో ఈ రంగంలో ముందుకు సాగుతున్న వ్యక్తులను జరుపుకోవాలని భావిస్తోంది." అని చెప్పారు.

పానెల్ డిస్కషన్‌లో శ్రీమతి దుర్గా జస్‌రాజ్ మాట్లాడుతూ “ఇన్నోవేషన్ కళతో కలిసి వెళ్తుంది. సాంకేతికత కారణంగానే దేశంలోని నలుమూలల ఉన్న కళాకారులు తమ స్వరాన్ని కనుగొనగలుగుతున్నారు. మరిన్ని డిజిటల్ ఫోరమ్‌లు కళను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని చెప్పారు.

మేస్ట్రో నీలాద్రి కుమార్ తన జితార్‌కు జన్మనిచ్చారు.తన అభిప్రాయాలను పంచుకుంటూ “మేధో సంపత్తి హక్కులు కళాకారుల పని యొక్క వాస్తవికతను గుర్తించడమే కాకుండా, కళాకారులకు రక్షణ కల్పించడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం ద్వారా పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి" అని చెప్పారు.

పేటెంట్స్ అండ్ డిజైన్స్ డిప్యూటీ కంట్రోలర్ డా. దినేష్ పాటిల్ మేధో సంపత్తి కోణం గురించి చర్చిస్తూ "కళాకారుడు కళను కాపాడుకోవాలనుకుంటే కళ నేరుగా కాపీరైట్‌లకు అనుసంధానించబడి ఉంటుంది మరియు గరిష్ట రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి" అని వ్యక్తపరిచారు.

జీ20 స్టార్టప్‌20 సమ్మిట్ సమావేశం ప్రణాళిక చేయబడినప్పుడు యూపిఏజే కార్యక్రమం జూలై మొదటి వారంలో ప్లాన్ చేయబడింది.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) గురించి:

ఎయిమ్‌ అనేది ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కేంద్రాలు, గొప్ప సవాళ్లు, ప్రారంభ వ్యాపారాలు మరియు ఇతర స్వయం ఉపాధి కార్యకలాపాలు ముఖ్యంగా సాంకేతికతతో నడిచే ప్రాంతాల్లో ప్రమోషన్ కోసం ఒక వేదికగా పనిచేయడం దీని లక్ష్యం.
 


 

***


(Release ID: 1921670) Visitor Counter : 238


Read this release in: English , Urdu , Hindi , Tamil