నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోని అత్యుత్తమ రేవులతో పోటీ పడేందుకు దూసుకుపోతున్న భారతీయ సముద్ర రంగం
Posted On:
28 APR 2023 5:08PM by PIB Hyderabad
వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఐ-పిఐ -ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచీ) నివేదిక-2023 ప్రకారం కంటైనర్ నిరీక్షించే సగటు కాలం 3 రోజుల స్థాయిని భారత్ సాధించింది. కాగా, యుఎఇలో , దక్షిణాఫ్రికాలో 4 రోజులు కాగా, యుఎస్‌లో 7రోజులు, జర్మనీలో 10 రోజులుగా అది ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం కింద 2014 నుంచి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు దేశంలోని ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఓడరేవులు ఉత్పాదకతను, డిజిటలీకరణ ద్వారా సరఫరా లంకె దృగ్గోచరతను మెరుగుపరిచేందుకు దేశం చేపట్టిన సంస్కరణల ఫలితంగా భారతీయ సముద్ర రేవుల వద్ద అతి తక్కువ కాలం నిరీక్షణ ఉంటుంది.
పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద సమన్వయ ప్రణాళిక, అమలు ద్వారా లోతట్టు ప్రాంతాలకు అనుసంధానతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం, సముద్రయాన రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టడం వల్ల అంతర్జాతీయ షిప్‌మెంట్స్ విభాగం ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతదేశం 22వ స్థానానికి ఎదిగింది. దేశపు లాజిస్టిక్స్ పనితీరు సూచీ స్కోర్ ప్రకారం 38వ స్థానంలో నిలిచింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం కింద విధాన సంస్కరణలు, నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడం, అధిక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా రేవు సామర్ధ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టి, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. టర్న్ అరౌండ్ టైమ్ (ఓడలు రేవులో సరుకును దించే ప్రక్రియకు పట్టే సమయం) విషయంలో భారతీయ రేవులు భారీ మెరుగుదలను నమోదు చేశాయి.
ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచీ (ఐ-పిఐ) నివేదిక- 2023లో ప్రచురించిన టర్న్ అరౌండ్ టైమ్ కొలమానంపై భారతీయ రేవులను ప్రపంచ స్థాయిలో పోల్చి చూస్తే, యుఎస్ఎ (1.5 రోజులు) , ఆస్ట్రేలియా (1.7 రోజులు), బెల్జియం (1.3 రోజులు) కెనడా (2.0 రోజులు), జర్మనీ (1.3 రోజులు), యుఎఇ (1.1 రోజు) సింగపూర్ (1.0 రోజు) రష్యన్ సమాఖ్య (1.8రోజులు), మలేషియా (1.0 రోజులు) ఐర్లాండ్ (1.2 రోజులు), ఇండొనేషియా (1.1రోజు) న్యూజిల్యాండ్ (1.1రోజు), దక్షిణాఫ్రికా (2.8 రోజులు) కంటే మెరుగ్గా భారతీయ రేవుల టర్న్ అరౌండ్ టైమ్ 0.9 రోజులుగా ఉంది.
***
(Release ID: 1920921)
Visitor Counter : 182