వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ పరికరాల సాంకేతిక సదస్సును ప్రారంభించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
దేశంలో సన్నకారు రైతులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రయోజనం పొందాలి.. శ్రీ తోమర్
Posted On:
27 APR 2023 3:32PM by PIB Hyderabad
వ్యవసాయ పరికరాల సాంకేతిక పరిజ్ఞానంపై భారత పరిశ్రమల సమాఖ్య( సీఐఐ), ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (టిఎంఏ) ఏర్పాటు చేసిన సదస్సును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. సదస్సులో మాట్లాడిన శ్రీ తోమర్ దేశంలో దాదాపు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగం ద్వారా ప్రయోజనం పొందడానికి రైతులు కృషి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాదని తెలిపిన శ్రీ తోమర్ రైతులు సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగించడానికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. శిక్షణ, పరీక్షలు, సిహెచ్‌సిలు, హైటెక్ హబ్‌లు , ఫార్మ్ మెషినరీ బ్యాంకులు (ఎఫ్‌ఎమ్‌బి) ఏర్పాటు వంటి వివిధ కార్యకలాపాల కోసం 2014-15 నుంచి 2022-23 వరకు రాష్ట్రాలకు కేంద్రం .6120.85 కోట్ల రూపాయలు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ సబ్ మిషన్ కింద ఈ నిధులు విడుదల అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ట్రాక్టర్లు, నాగళ్లు, ఆటోమేటెడ్ యంత్రాలు లాంటి 15.24 లక్షల వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ధరలకు రైతులకు అందజేశామన్నారు.
బుద్ని (మధ్యప్రదేశ్)సెంట్రల్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ (CFMTTI)లో నూతన విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్ పరీక్షను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని గరిష్ఠంగా తగ్గించిందని తెలిపారు. నూతన విధానం వల్ల 75 పని దినాల్లో పరీక్ష పూర్తి అవుతుందని అన్నారు. నాలుగు ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ల ద్వారా 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో 1.64 లక్షల మంది కార్మికులకు శిక్షణ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ని ప్రారంభించి రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 14,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కిసాన్ డ్రోన్ల వినియోగాన్నిప్రోత్సహిస్తున్నామన్నారు. కిసాన్ డ్రోన్లు జాతీయ డ్రోన్ విధానంలో భగంగా ఉంటాయన్నారు. రైతులు, ఎస్సీ-ఎస్టీ కేటగిరీ, మహిళా రైతులతో సహా వివిధ వర్గాలకు సబ్సిడీలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం , డ్రోన్‌లతో పురుగుమందులు జల్లడానికి పంటలవారీగా అనుమతులు ఇస్తుందన్నారు.
వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాదని శ్రీ తోమర్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎవరు నాశనం చేయలేరు అని శ్రీ తోమర్ స్పష్టం చేశారు. . వ్యవసాయ ఉత్పత్తుల పరంగా, భారతదేశం నేడు ప్రపంచంలో ఒకటి లేదా రెండవ స్థానంలో ఉందన్నారు. రైతుల కృషి, శాస్త్రవేత్తలు,పరిశ్రమల సహకారం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు స్నేహపూర్వక విధానాల వల్ల వ్యవసాయ రంగం ప్రగతిపథంలో సాగుతున్నదని అన్నారు. అయితే సాధించిన ప్రగతితో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి ఎక్కువ చేయడానికి కృషి జరగాలన్నారు. 2050 నాటి జనాభా అవసరాలు,మారుతున్న రాజకీయ పరిస్థితులు ప్రపంచంలో భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కావాలన్నారు. దేశ అవసరాలతో పాటు ఇతర దేశాల అవసరాలు తీర్చే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి సిద్హం కాలనీ శ్రీ తోమర్ అన్నారు. 2014 తర్వాత ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో దేశంలో భిన్నమైన పని సంస్కృతి ప్రారంభమైందన్నారు. 2014 నుంచి దేశంలో వస్తున్న మార్పులు దేశమంతా, ప్రపంచమంతా ఆశాజనక పరిస్థితి సృష్టించాయన్నారు. సమర్థ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసినప్పుడు లక్ష్య సాధన తేలికగా ఉంటుందన్నారు. నేడు నగదు రహిత లావాదేవీల్లో అమెరికా, జపాన్, జర్మనీల కంటే భారత్ ముందుందని తెలిపిన శ్రీ తోమర్ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమన్నారు.
ఉత్పత్తి పోటీలో ఉన్నప్పుడు దేశంలో గత సంవత్సరాల గణాంకాలతో కాకుండా విదేశాల ఉత్పత్తితో పోల్చి చూసి ఉత్పత్తి పెంచాలని కేంద్ర మంత్రి అన్నారు. భూమి తక్కువగా ఉన్నప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలన్నారు. ఈ అంశంలో . వ్యవసాయ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాలతో సహా సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత కూడా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. బంజరు భూములను కూడా సాగుకు యోగ్యంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం చేపట్టేలా నూతన తరాన్ని ప్రోత్సహించాలని శ్రీ తోమర్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తోందన్నారు. ఈ-నామ్ మండీల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న రైతుల సంఖ్య పెరిగిందని తెలిపిన మంత్రి మరియు వ్యవసాయ రంగంలో ఖాళీలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 1.5 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీలను కేంద్రం ఆమోదించిందన్నారు. . నీటిని పొదుపు చేస్తూ మైక్రో ఇరిగేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యధిక సంఖ్యలో రైతులు ఉపయోగించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో శ్రీ భర్తేందు కపూర్, శ్రీ ముకుల్ వర్షిణి, శ్రీ కృష్ణకాంత్ తివారీ, శ్రీ ఆంటోని చెరుకర ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పరికరాల తయారీదారులు, విధాన నిర్ణేతలు , సరఫరాదారులు, ఉత్పత్తి అభివృద్ధి, డిజైన్ సంస్థల సహా ప్రతినిధులు హాజరయ్యారు.
***
(Release ID: 1920575)
Visitor Counter : 331