ఉక్కు మంత్రిత్వ శాఖ
ఇస్పాట్ రాజ్‌భాషా సమ్మాన్ మొదటి బహుమతిని కైవసం చేసుకుని- తిరిగి కీర్తిని దక్కించుకున్న ఆర్ఐఎన్ఎల్
Posted On:
26 APR 2023 3:49PM by PIB Hyderabad
ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహించే ఇస్పాట్ రాజ్‌భాషా సమ్మాన్ మొదటి బహుమతిని 2021-22 సంవత్సరానికి ఆర్ఐఎన్ఎల్ గెలుచుకుంది. సోమవారం శ్రీనగర్‌లో నిర్వహించిన హిందీ సలాహ్‌కార్ సమితి సమావేశంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ఆర్ఐఎన్ఎల్ సిఎండి శ్రీ అతుల్ భట్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఉక్కుశాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్రనాథ్ సిన్హా, అధికార భాషా విభాగం కార్యదర్శి శ్రీమతి అన్సులి ఆర్య, ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రుచికా చౌధరి గోవిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఐఎన్ఎల్ ప్రచురించే సంస్థాగత హిందీ పత్రిక రాష్ట్రీయ ఇస్పాత్ సుగంధ్ మార్చి నెల సంచికను కూడా శ్రీ కులాస్తే విడుదల చేశారు. సంస్థలో హిందీ భాషను సమర్ధవంతంగా అమలయ్యేలా చూసేందుకు ప్రత్యేక కృషి చేసిన ఆర్ఐఎన్ఎల్ - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జిఎం (రాజభాష), అడ్మిన్ ఇన్‌ఛార్జి శ్రీ లలన్ కుమార్ సింగ్ కు కూడా మొదటి బహుమతిని అందించారు. ఇ- టూల్స్, ఇ- ఆఫీస్, శిక్షణ, ప్రచురణలు తదితర పలు కార్యకలాపాలు చేపట్టినందుకు ఆర్ఐఎన్ఎల్‌ను హిందీ సలహాకార్ సమితి సభ్యులు ప్రశంసించారు.
***
(Release ID: 1920285)
Visitor Counter : 166