విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ రంగంలో ‘డే-ఎహెడ్ నేషనల్ లెవల్ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ మెకానిజం’ యొక్క సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చే’సిన ప్రభుత్వం


- సవరించిన విధానం వినియోగదారులకు పొదుపునకు మేలు చేస్తుంది; తక్కువ కార్బన్ పాదముద్రతో తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో రాష్ట్రాలకు దోహదం చేస్తుంది

Posted On: 26 APR 2023 4:05PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ‘డే-ఎహెడ్ నేషనల్ లెవల్ మెరిట్ ఆర్డర్ డెస్పాచ్ మెకానిజం’ సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసింది. ఇది వినియోగదారులకు తక్కువ ధరలకు విద్యుత్తును అందించేందుకు దోహదం చేస్తుంది. సవరించిన యంత్రాంగం ప్రకారం సిస్టమ్ డిమాండ్‌ను తీర్చడానికి.. దేశవ్యాప్తంగా చౌకగా ఉత్పత్తి చేసే వనరుల మెరిట్ ఆర్డర్ను అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ఇది 1.5 గంటల ముందు అందిస్తుండగా తాజా విధానం ఒక రోజు ముందుగానే దీనిని ఖరారు చేసి అందిస్తుంది.  ఇది మరిన్ని యూనిట్‌లను ఉత్పత్తి చేయడానికి మరియు ఖర్చు ఆప్టిమైజేషన్‌కు మెరుగైన ప్రణాళికను అందిస్తుంది. అంతేకాకుండా, సవరించిన యంత్రాంగం అన్ని ప్రాంతీయ అస్తిత్వ థర్మల్ పవర్ ప్లాంట్‌లను మరియు తదనంతరం అన్ని అంతర్రాష్ట్ర థర్మల్ జనరేటర్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుత యంత్రాంగం యొక్క పరిధిని కూడా విస్తరిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో, ఎన్టీపీసీ థర్మల్ స్టేషన్లు మాత్రమే మెరిట్ ఆర్డర్ డెస్పాచ్‌లో భాగంగా ఉన్నాయి. రియల్ టైమ్‌లో మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ యొక్క ప్రస్తుత మెకానిజం ఏప్రిల్ 2019లో అమలులోకి వచ్చింది. ఇది సాంకేతిక మరియు గ్రిడ్ భద్రతా పరిమితులను ఎదుర్కొంటూనే, ఉత్పత్తిలో పాన్-ఇండియా యొక్క మొత్తం వేరియబుల్ ధరను ఆప్టిమైజ్ చేసింది. ప్రస్తుత యంత్రాంగం ఫలితంగా పాన్-ఇండియా ప్రాతిపదికన వేరియబుల్ ధర ₹ 2300 కోట్లకు తగ్గింది. ఈ ప్రయోజనాలను విద్యుత్ ఉత్పత్తిదారులతో పంచుకోబడ్డాయి. దీనికి తోడు లబ్ధిదారులతో చివరికి వినియోగదారులకు విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. ప్రతిపాదిత డే-ఎహెడ్ నేషనల్ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ మెకానిజం నుండి వచ్చే లాభాలు ఉత్పాదక స్టేషన్లు మరియు వారి వినియోగదారుల మధ్య పంచుకోబడతాయి. దీని వల్ల విద్యుత్ వినియోగదారులకు వార్షిక ఆదా పెరుగుతుంది. ఇది తక్కువ కార్బన్ పాదముద్రలతో ఖర్చులతో కూడుకున్న పద్ధతిలో వనరుల సమృద్ధిని కొనసాగించడంలో రాష్ట్రాలకు సహాయపడుతుంది. డే-ఎహెడ్ నేషనల్ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ మెకానిజం అవసరమైన నియంత్రణ ప్రక్రియ ద్వారా సీఈఆర్సీ ద్వారా అమలు చేయబడుతుంది. ఇది జాతీయ స్థాయిలో గ్రిడ్-ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది. 2014 నుండి, ప్రభుత్వం 184.6 గిగావాట్ల అదనపు ఉత్పాదక సామర్థ్యాన్ని మరియు 1,78,000 సీసీసీ కి.మీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్‌ను జోడించింది. ఇది మొత్తం దేశాన్ని ఒకే గ్రిడ్‌గా అనుసంధానం చేసింది, ఇది మొత్తం దేశాన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌గా మార్చింది. వినియోగదారులకు విద్యుత్ ధరను తగ్గించే లక్ష్యంతో ఈ రంగంలో పోటీని పెంచేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది.

*****



(Release ID: 1920283) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi , Punjabi