నౌకారవాణా మంత్రిత్వ శాఖ
చెన్నైలో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్‌వేస్ & కోస్ట్స్, ఐఐటీ ఎం – డిస్కవరీ క్యాంపస్‌ను ప్రారంభించనున్న శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
23 APR 2023 12:31PM by PIB Hyderabad
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు & ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ 24 ఏప్రిల్ 2023న తమిళనాడులోని చెన్నైలో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్‌వేస్ అండ్ కోస్ట్స్ (ఎన్టీసీడబ్ల్యుపీసీ), ఐఐటీ ఎం - డిస్కవరీ క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. సాగరమాల కార్యక్రమం కింద, ఎన్టీసీడబ్ల్యుపీసీని చెన్నై ఐఐటీలో రూ. 77 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ మంత్రిత్వ శాఖ యొక్క సాంకేతిక విభాగంగా పనిచేస్తుంది. పోర్ట్స్ & షిప్పింగ్ సెక్టార్ ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లకు పరిష్కారాలను అందించడానికి అత్యాధునిక సాంకేతికతలు మరియు అప్లికేషన్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది. ఓడరేవులు, తీర ప్రాంతం, జలమార్గాలకు సంబంధించి అన్ని విభాగాల్లో పరిశోధన మరియు కన్సల్టెన్సీ స్వభావం యొక్క 2డీ & 3డీ పరిశోధనలను చేపట్టేందుకు ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను కలిగి ఉంది. సముద్రం యొక్క మోడలింగ్, తీర మరియు నదీముఖ ప్రవాహాలను నిర్ణయించడం, అవక్షేప రవాణా మరియు స్వరూప డైనమిక్స్, నావిగేషన్ మరియు యుక్తిని ప్రణాళిక చేయడం, డ్రెడ్జింగ్ & సిల్టేషన్ అంచనా, పోర్ట్ మరియు తీర ఇంజినీరింగ్‌లో కన్సల్టెన్సీ - నిర్మాణాలు మరియు బ్రేక్ వాటర్‌ల రూపకల్పన, స్వయం ప్రతిపత్త ప్లాట్‌ఫారమ్‌లు & ఎఫ్‌డిడి వాహనాలు, మోడలింగ్ ఆఫ్ ఫ్లో & హల్ ఇంటరాక్షన్, హైడ్రోడైనమిక్స్ ఆఫ్ మల్టిపుల్ హల్స్, ఓషన్ రిన్యూవబుల్ ఎనర్జీతో పాటు ఓడరేవు సౌకర్యాలు దేశ ప్రయోజనాల కోసం ఇప్పటికే కొన్ని రంగాలకు అభివృద్ధి చేయబడిన నైపుణ్యాన్ని అంశాలలో కూడా సంస్థ పని చేస్తుంది. పైన పేర్కొన్న వివిధ రంగాలలో దేశంలోని మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఈ సంస్థ అధికారం ఇస్తుంది.
******
(Release ID: 1919091)
Visitor Counter : 145