జౌళి మంత్రిత్వ శాఖ
పత్తికి విలువను పెంచే వివిధ అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షించేందుకు రాజ్‌కోట్‌లో టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్‌తో ఆరవ పరస్పరిక సంభాషణ సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
"కస్తూరి కాటన్ ఇండియా" ట్రేసిబిలిటీ, సర్టిఫికేషన్, బ్రాండింగ్‌పై ప్రాజెక్ట్ ప్రారంభం
కేంద్రం నిధులతో పత్తి ఉత్పాదకతను పెంపొందించే సమగ్ర ప్రణాళికకు తుది ఆమోదం ఎన్ఎఫ్ఎస్ఎం కింద రూ. 41.87 కోట్లు మంజూరు
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో సేంద్రీయ పత్తి ఉత్పత్తిని పెంచాలి
Posted On:
22 APR 2023 7:04PM by PIB Hyderabad
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద నిర్వహిస్తున్న సౌరాష్ట్ర తమిళ సంగమంలో భాగంగా పత్తి విలువను పెంచే వివిధ అంశాలపై కేంద్ర జౌళి, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ఈ మేరకు 2023 ఏప్రిల్ 22వ తేదీన టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్ (టాగ్)తో ఆరవ ఇంటరాక్టివ్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
శ్రీ పీయూష్ గోయల్ కస్తూరి కాటన్ ఇండియా ట్రేసిబిలిటీ, సర్టిఫికేషన్, బ్రాండింగ్ ప్రాజెక్ట్‌లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భారతీయ పత్తి బ్రాండింగ్ మొత్తం పత్తి విలువ గొలుసుకు రైతుల నుండి తుది వినియోగదారుల వరకు గొప్ప విలువను జోడిస్తుందని ప్రశంసించారు. భారతీయ నాణ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పత్తి రైతులకు, పరిశ్రమలకు ఈ నాణ్యత అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిపై స్టీరింగ్ కమిటీ, అపెక్స్ కమిటీ సమావేశాలు జరిగాయి. ప్రాజెక్ట్ కోసం నిధులు విడుదల అయ్యాయి. కస్తూరి ఇండియా కాటన్ ట్రేసిబిలిటీ, సర్టిఫికేషన్, బ్రాండింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
కస్తూరి పత్తిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియం పత్తిగా బ్రాండ్ చేయడానికి టెక్సప్రోసిల్ మరింత చురుకుగా ప్రయత్నాలు చేయాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
హెచ్‌డిపిఎస్, క్లోజర్ స్పేసింగ్, ఇఎల్‌ఎస్ సాంకేతికతను లక్ష్యంగా చేసుకుని పత్తి ఉత్పాదకతను పెంపొందించే హోలిస్టిక్ ప్లాన్‌కు ఎన్ఎఫ్ఎస్ఎం కింద ఎంఓఏ ఎఫ్ డబ్ల్యూ నుండి రూ. 4186.85 లక్షల రూపాయల తుది ఆమోదం పొందారు. రాజస్థాన్‌లో గ్రామాలు/రైతుల క్లస్టర్‌ల వారీ గుర్తింపు ఖరారు అయింది. 2023-24 పత్తి సీజన్‌లో విత్తనాలు వేసే మిగిలిన అన్ని పత్తి పండించే రాష్ట్రాల్లో ఇదే పురోగతి ఉంది.
సేంద్రీయ పత్తికి ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ నొక్కిచెప్పారు. పత్తి రైతులలో సేంద్రీయ పత్తి ఉత్పత్తిని ప్రోత్సహించడంలో చురుకైన భాగస్వామ్యం కోసం పరిశ్రమను అభ్యర్థించారు. క్లస్టర్ ఆధారిత విధానంలో సేంద్రియ పత్తి ఉత్పత్తిని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు నిపుణుల, పరిశ్రమల ప్రతినిధి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఇతర వాటాదారులతో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి సూచించారు. టెక్స్‌టైల్స్, రైల్వేల శాఖ మంత్రి దర్శన వి. జర్దోష్, టాగ్ చైర్మన్ శ్రీ సురేష్ కోటక్ కూడా సమావేశంలో మార్గనిర్దేశం చేశారు.
కాటన్ టెక్స్‌టైల్ వాల్యూ చైన్‌లో ఫామ్ నుండి ఫారిన్ వరకు అన్ని స్థాయిల్లోనూ గౌరవ ప్రధానమంత్రి కలలను సాధించడానికి, పత్తిలో ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి కాటన్ వాల్యూ చైన్ వాటాదారులందరూ కలిసికట్టుగా పని చేయాలని జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా విజ్ఞప్తి చేశారు. ఉత్పత్తిదారులకు విలువ రాబడిని పెంచడానికి. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, సీసీఐ,అపేడా,బిఐఎస్ నుండి ప్రతినిధులు, సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి ఇతర సీనియర్ అధికారులు, మొత్తం పత్తి విలువ గొలుసు నుండి వాటాదారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1919014)
Visitor Counter : 192