పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

Posted On: 22 APR 2023 4:02PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో 2023 ఏప్రిల్ 24 న జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని (ఎన్ పి ఆర్ డి )  పురస్కరించుకుని మధ్యప్రదేశ్ లోని రేవాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎకెఎమ్) - సమవేషి వికాస్ (సమ్మిళిత అభివృద్ధి) లో భాగంగా మొత్తం ప్రభుత్వ విధాన కార్యక్రమంగా ఒక ప్రధాన ఈవెంట్ నిర్వహిస్తోంది.  మధ్యప్రదేశ్ లోని రేవాలోని స్పెషల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ జాతీయ కార్యక్రమానికి ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రత్యేక గ్రామసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

 

పంచాయితీ స్థాయిలో పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ కోసం  ఇంటిగ్రేటెడ్ ఈ-గ్రామస్వరాజ్  జి ఇ ఎమ్ పోర్టల్ ను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. గ్రామపంచాయతీలు తమ వస్తువులు , సేవలను జి ఇఎమ్ ద్వారా ఇ గ్రామ్ స్వరాజ్ ప్లాట్ ఫామ్ ద్వారా పొందడానికి వీలు కల్పించడమే ఇ గ్రామ్ స్వరాజ్-జిఈఎమ్ ఇంటిగ్రేషన్ లక్ష్యం.

 

ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఇగ్రామ్ స్వరాజ్ – జిఈఎమ్ ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం ద్వారా పంచాయతీలు సులభంగా ఉపయోగించగల సేకరణ, చెల్లింపు ప్లాట్ ఫామ్ కు ప్రాప్యతను కలిగి ఉన్న డిజిటల్ విప్లవానికి నాంది పలకడానికి ప్రోత్సహిస్తుంది. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ చొరవ పంచాయతీలు , స్థానిక అమ్మకందారులను ప్రోత్సహిస్తుంది, ఇది మొత్తం కొనుగోలుదారు-అమ్మకందారు పర్యావరణ వ్యవస్థ వృద్ధి చెందడానికి సహాయపడుతుంది, తద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవస్థాపకతకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

 

దేశంలో స్వమిత్వా పథకం కింద పంపిణీ చేసిన 1.25 కోట్ల ప్రాపర్టీ కార్డుల మైలురాయిని చేరుకోవడానికి గుర్తుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్వమిత్వ ప్రాపర్టీ కార్డును ప్రధాని అంద జేయనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎ.ఎ.ఎం) "సమ్మిళిత అభివృద్ధి" - "సమవేషి వికాస్" అనే థీమ్ కోసం ప్రచారాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - సమవేశి వికాస్ - సమ్మిళిత అభివృద్ధి థీమ్ కింద స్వమిత్వా – మేరీ సంపతి, మేరా హక్ క్యాంపెయిన్ 2023 ఆగస్టు నాటికి స్వమిత్వా పథకం కింద 1.50 కోట్ల "రికార్డ్స్ ఆఫ్ రైట్స్"/ ప్రాపర్టీ కార్డులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ""అభివృద్ధి దిశగా సమిష్టి అడుగులు" అనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్ కింద చివరిలో ఎం ఒ ఆర్ డి , ఎం ఒ పి ఆర్,  ఎం ఒ ఎ అండ్ ఎఫ్ డబ్ల్యూ , ఎం ఒ హెచ్ అండ్ ఎఫ్ బ్ల్యు, ఎంఓఎఫ్ఏహెచ్ అండ్ డీ అనే ఐదు మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలుపుకొని ప్రజాకర్షక పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు..తొమ్మిది ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. 

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద 4 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 'గృహ ప్రవేశ్' (కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నిర్వహించే కార్యక్రమం) ను ప్రధాన మంత్రి నిర్వహిస్తారు. గృహ ప్రవేశ్ కార్యక్రమానికి ప్రస్తుతం 4.11 లక్షల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా రేవా జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద వివిధ పనులకు భూమి పూజ చేయనున్నారు. రేవా – ఇట్వారీ రైలును ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు కొన్ని ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, మధ్యప్రదేశ్ పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ మహేంద్ర సింగ్ సిసోడియా.  మధ్యప్రదేశ్ పంచాయితీ ,  గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి,

శ్రీ రామ్ ఖేలవాన్ పటేల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శ్రీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్, పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ మలయ్ శ్రీ వాస్తవ, మధ్యప్రదేశ్ ప్రభుత్వ, భారత ప్రభుత్వ  ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పంచాయితీరాజ్ సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు, స్థానిక నివాసితులు/ గ్రామీణ ప్రజలతో సహా లక్ష మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నారు.

 

సాధారణ ప్రజల ప్రయోజనం, అవగాహన కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్ (ఎస్ బి ఎం-జి), అమృత్ సరోవర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్, రూరల్ టూరిజం డెవలప్మెంట్ (హోమ్ స్టే), స్వమిత్వా, జల్ జీవన్ మిషన్ తదితర పథకాలను,విజయాలను ప్రదర్శించే వివిధ థీమ్ స్టాల్స్ తో కూడిన ఎగ్జిబిషన్ ను ఎన్ పి ఆర్ డి - 2023 జాతీయ ఫంక్షన్ వేదికపై ఏర్పాటు చేయనున్నారు.

 

India@2047 వేగం పెంచడానికి, అవగాహన కల్పించడానికి , 2030 నాటికి స్థానిక నేపధ్యంలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండాను సాధించడానికి, సంస్థాగత, వ్యక్తిగత, సంస్థాగత, క్రాస్-ఆర్గనైజేషన్ ,ఆపరేషనల్ సామర్థ్యాలను నిర్మించడానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఒక ముఖ్యమైన సందర్భంగా ఉపయోగపడుతుంది

 

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 ఏప్రిల్ 24న ప్రత్యేక గ్రామసభను నిర్వహించాలని, 2023 ఏప్రిల్ 24న జరిగే గ్రామసభ సమావేశాల్లో పాల్గొనే వారు ప్రధానమంత్రి పాల్గొనే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (ఎన్ పి ఆర్ డి ) కార్యక్రమాలను వీక్షించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పంచాయతీరాజ్ శాఖలను కోరింది. మధ్యప్రదేశ్ లోని రేవాలో జరిగే జరిగిన ఎన్ పీఆర్ డీ-2023 కార్యక్రమాన్ని దూరదర్శన్ 2023 ఏప్రిల్ 24న ఉదయం 11.30 గంటల నుంచి డి డి న్యూస్, డి డి నేషనల్, డిడి ఇండియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం  చేస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ వెబ్ లింక్: https://webcast.gov.in

 

నేపథ్యం

 

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ (73వ సవరణ) చట్టం 1992 ద్వారా పంచాయతీరాజ్ సంస్థాగతీకరణతో అట్టడుగు వర్గాలకు అధికార వికేంద్రీకరణ చరిత్రలో ఏప్రిల్ 24 ఒక కీలక ఘట్టం.

జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు సాధారణంగా ఈ వేడుకను దేశ రాజధాని వెలుపల నిర్వహిస్తారు.

 

భారతదేశంలో పంచాయితీ రాజ్ కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచాయతీలకు సంబంధించి తొమ్మిదవ భాగాన్ని ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ సవరణ చట్టం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో సమర్థవంతమైన స్థానిక పాలనకు నాంది పలికింది.

 

2014 నుంచి పంచాయతీరాజ్ మౌలిక లక్ష్యాలను నిజమైన స్ఫూర్తితో సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలను (పీఆర్ ఐ) సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ఆదుకోవడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ మౌలిక సదుపాయాల అవసరాలు ,అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి పంచాయితీరాజ్ సంస్థలకు ఆర్థిక వనరుల కేటాయింపులో భారతదేశం గణనీయమైన పురోగతిని చూసింది.

పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం , సాధికారత కల్పించడం, పిఆర్ఐల ప్రతినిధుల సామర్థ్యాన్ని పెంచడం ,వారి పాత్ర - బాధ్యతలను నెరవేర్చడానికి ,సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి ,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డిజి) సాధించడానికి దోహదపడే పిఆర్ఐల సమర్థత, పనితీరు పారదర్శకత , జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకుంటోంది.

వాటిలో 1) పేదరిక రహితం- మెరుగైన జీవనోపాధి గ్రామం, (2) ఆరోగ్యకరమైన గ్రామం, (3) పిల్లల స్నేహపూర్వక గ్రామం, (4) నీరు తగినంత కలిగిన గ్రామం, (5) పరిశుభ్రమైన ,హరిత గ్రామం, (6) స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం, (7) సామాజికంగా న్యాయమైన, సామాజికంగా సురక్షితమైన గ్రామం, (8) సుపరిపాలన కలిగిన గ్రామం (9) మహిళా స్నేహపూర్వక గ్రామం మొదలైన ఇతివృత్తాలతో పని చేస్తోంది.

 

ఇ- గ్రామ్ స్వరాజ్ - ప్రభుత్వ ఇ- మార్కెట్ ప్లేస్ అనుసంధానం

 

2020 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ గ్రామస్వరాజ్ (ఈజీఎస్)ను ప్రారంభించారు, ఇది ప్రణాళిక నుండి ఆన్ లైన్ చెల్లింపుల వరకు పంచాయతీల రోజువారీ కార్యకలాపాలకు సింగిల్ విండో పరిష్కారంగా పనిచేయడానికి రూపొందించబడింది. 2020 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దరఖాస్తు స్వీకరణ వేగవంతమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ గ్రామస్వరాజ్ 100% వినియోగం లో ఉంది. 2.3 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు ఆన్లైన్ చెల్లింపుల కోసం ఈ గ్రామస్వరాజ్ ను అన్వయింప చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా రూ.1.35 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు ఆన్ లైన్ లో జరిగాయి.

ఈ విధానం ద్వారా ఖర్చు చేసే గ్రాంట్లు ప్రధానంగా కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు.  15 వ ఆర్థిక సంఘం అన్ని నిధులు (రూ. 2.5 లక్షల కోట్లు) ఈ గ్రామ స్వరాజ్ అప్లికేషన్ ద్వారా మాత్రమే ఖర్చు చేయబడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం అంతటా పంచాయతీలు దాదాపు రూ .50,000 కోట్ల నిధులను ఆన్ లైన్ లో ఖర్చు చేశాయి. చెల్లింపులు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్) ద్వారా నేరుగా వెండర్ ఖాతాలకు జరుగుతున్నాయి. పంచాయతీల వారీగా..

ఖర్చును ఆన్ లైన్ లో చేస్తుండగా, ఆఫ్ లైన్ టెండర్ల సంప్రదాయ పద్ధతుల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అందువల్ల, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఒపిఆర్) ఉద్దేశం, దేశవ్యాప్తంగా అనేక పంచాయతీల అభ్యర్థన మేరకు, సేకరణ ప్రక్రియ కూడా ఇగ్రామ్ స్వరాజ్ అంశం గా మార్చాలని నిర్ణయించారు. 

అందువల్ల, ఎం ఒ పి ఆర్ ,  జి ఇ ఎమ్ లు ఇగ్రామ్ స్వరాజ్ ,జిఈఎమ్ లను ఏకీకృతం చేయడానికి సహకరించాయి ఇగ్రామ్ స్వరాజ్  , గవర్నమెంట్ ఇమార్కెట్ ప్లేస్ (జిఈఎమ్) అప్లికేషన్ ల మధ్య సాంకేతిక ఏకీకరణ చొరవను చేపట్టారు.

గ్రామపంచాయతీలు తమ వస్తువులను, సేవలను జి ఇ ఎమ్ ద్వారా నేరుగా ఇ-గ్రామ్ స్వరాజ్ ప్లాట్ ఫామ్ ద్వారా పొందేలా చేయడమే దీని లక్ష్యం. ఈ చొరవ జి ఇ ఎమ్ ద్వారా ఆన్ లైన్ సేకరణ ప్రయోజనాలను కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ,విభాగాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిపాలన అట్టడుగు స్థాయి వరకు తీసుకు వెళుతుంది. పంచాయతీలు ఇప్పటికే ఈ-గ్రామస్వరాజ్ ను ఉపయోగించడానికి అలవాటు పడినందున, జిఈఎమ్ ద్వారా సేకరణ వారి ఆన్ లైన్ పనులకు,  నిధుల నిర్వహణకు పొడిగింపు అవుతుంది.

 

ఇ- గ్రామ్ స్వరాజ్ - ప్రభుత్వ ఇ- మార్కెట్ ప్లేస్ అనుసంధానం ముఖ్యాంశాలు

 

ప్రస్తుతం 60,000 మంది ఉన్న జిఈఎమ్ యూజర్ల సంఖ్యను దశలవారీగా 3 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు.

 

ఈ ప్రక్రియను డిజిటల్ చేయడం ద్వారా పంచాయతీల ద్వారా సేకరణలో పారదర్శకత తీసుకురావడం: ఇది పంచాయతీలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్

 

గ్రామపంచాయతీలు ఎక్కువగా అటువంటి విక్రేతల నుండి కొనుగోలు చేస్తున్నందున జిఈఎమ్ లో నమోదు చేసుకోవడానికి స్థానిక విక్రేతలను (యజమానులు, స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు మొదలైనవి) ప్రోత్సహించడం. అటువంటి వారి నుంచే పంచాయతీల సేకరణ అధికం గా ఉంటుంది.  అలాగే, అటువంటి విక్రేతలు ఆన్ లైన్ లో విక్రయించడం వల్ల తమకు కొత్త మార్కెట్లను తెరవగలరు.

 

జిఈఎమ్ వినియోగం వల్ల  కొనుగోళ్లకు జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జిఎఫ్ఆర్) వర్తిస్తాయి కనుక  ఆడిట్ అభ్యంతరాలను తగ్గించ వచ్చు

 

ఏకపక్షంగా కాంట్రాక్టులు ఇవ్వడం నిలిపివేయబడుతుంది, కాంప్లియంట్ వెండర్లు సకాలంలో చెల్లింపులు అందుకుంటారు,

 

ప్రామాణిక , పోటీ ధరలపై నాణ్యమైన హామీ వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి పంచాయతీలు అందుబాటులో ఉంటాయి..

 

ఎంఒపిఆర్ ద్వారా మేజర్ కెపాసిటీ బిల్డింగ్ చేపట్టబడుతోంది, ఇక్కడ రెండింటిలోనూ అనేక సార్లు ట్రైనింగ్ లు నిర్వహించబడ్డాయి.

 

కేంద్ర, రాష్ట్ర స్థాయిలో.. పంచాయితీ వినియోగదారులకు చేయూతనిచ్చేందుకు జిఈఎమ్ అన్ని రాష్ట్రాలలో బిజినెస్ ఫెసిలిటేటర్లకు శిక్షణ ఇచ్చింది . నియమించింది.

 

స్వమిత్వ పథకం

 

స్వమిత్వా (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ విత్ విలేజ్ ఇన్ రూరల్ ఏరియాస్) అనేది జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24న ప్రధాన మంత్రి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. స్వమిత్వా పథకం గ్రామంలోని నివాస ప్రాంతంలోని గ్రామీణ గృహ యజమానులకు "రికార్డ్స్ ఆఫ్ రైట్స్" / ప్రాపర్టీ కార్డులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పథకంలో ఆస్తులను మానిటైజేషన్ చేయడం , బ్యాంకు రుణాలను ప్రారంభించడం, ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గించడం; సమగ్ర గ్రామస్థాయి ప్రణాళిక వంటి బహుళ అంశాలు ఉన్నాయి; ఇది పంచాయతీల సామాజిక-ఆర్థిక ప్రొఫైల్ ను మరింత మెరుగుపరుస్తుంది, వాటిని స్వయం సమృద్ధిగా చేస్తుంది.

 

ఈ పథకం కింద జనరేట్ చేయబడిన ప్రాపర్టీ కార్డ్ గ్రామీణ ప్రాంతంలోని కుటుంబానికి ఆస్తి హక్కును అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనారిటీలు, మహిళలు, ఇతర బలహీన వర్గాలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికి ఈ పథకం వర్తిస్తుంది.

 

మార్చి 31, 2023 నాటికి, 2.39 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ఎగురవేత పూర్తయింది, ఇది మొత్తం లక్ష్యం 3.72 లక్షల గ్రామాలలో 63%, మధ్యప్రదేశ్ రాష్ట్రం, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ,  డామన్ అండ్  డయ్యూలో డ్రోన్ సర్వే పూర్తయింది. హర్యానా, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, గోవాలోని అన్ని జనావాస గ్రామాల ప్రాపర్టీ కార్డులను సిద్ధం చేశారు.

 

రాష్ట్రాలు ,సర్వే ఆఫ్ ఇండియా మధ్య సన్నిహిత సమన్వయంతో, దాదాపు 74,000 గ్రామాలకు 1.24 కోట్లకు పైగా ప్రాపర్టీ కార్డుల తయారీ మైలురాయిని సాధించింది.

 

2023, ఏప్రిల్ 24న ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - సమవేశి వికాస్ - సమ్మిళిత అభివృద్ధి థీమ్ కింద స్వమిత్వా – మేరీ సంపతి, మేరా హక్ క్యాంపెయిన్ కవర్ చేయబడింది.

 

****



(Release ID: 1919009) Visitor Counter : 521