ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుడాన్ లో భద్రత స్థితి ని సమీక్షించిన ప్రధాన మంత్రి

Posted On: 21 APR 2023 3:52PM by PIB Hyderabad

సుడాన్ లో భద్రత స్థితి ని సమీక్షించడం కోసం ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు, సుడాన్ లో భారతదేశాని కి రాయబారి మరియు అనేక మంది ఇతర సీనియర్ అధికారులు పాలుపంచుకొన్నారు.

 

సమావేశం సాగిన క్రమం లో, సుడాన్ లో తాజా పరిణామాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థితిగతుల పై ఒక ప్రత్యక్ష నివేదిక ను కూడా ఆయన కు సమర్పించడం జరిగింది. అందులో మరీ ముఖ్యం గా ఆ దేశం లో వివిధ ప్రాంతాల లో ఉంటున్న 3,000 మంది కి పైగా భారతదేశ పౌరుల యొక్క సురక్షత విషయం లో ప్రత్యేకం గా తీసుకొంటున్న శ్రద్ధ ను వివరించడమైంది.

 

క్రిందటి వారం లో గురి తప్పి దూసుకు వచ్చినటువంటి ఓ తుపాకి గుండు తగిలి భారత జాతీయుడు ఒకరు ప్రాణాల ను కోల్పోయిన ఘటన పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

 

సుడాన్ లో సంబంధిత అధికారులు అందరు జాగరూకత తో ఉండాలని, పరిణామాల ను నిశితం గా పర్యవేక్షించాలని అక్కడి భారతదేశ ప్రవాసుల సురక్ష ను గురించి ఎప్పటికప్పుడు పరిశీలన మదింపు చేసుకోవాలని మరియు వారికి సాధ్యమైన అన్ని విధాలు గాను సాయాన్ని అందజేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల ను ఇచ్చారు. ప్రాసంగిక తరలింపు ప్రణాళికల ను సిద్ధం చేయాలని, శరవేగం గా మార్పుల కు లోనవుతున్న భద్రత పరమైన వాతావరణాన్ని గమనిస్తూ మరి వివిధ ఐచ్ఛికాల లభ్యత పై దృష్టి సారించాలని కూడా ప్రధాన మంత్రి ఆజ్ఞాపించారు.

 

ఆ ప్రాంతం లోని ఇరుగు పొరుగు దేశాల తో, అలాగే సుడాన్ లో చెప్పుకోదగిన సంఖ్య లో నివసిస్తున్న పౌరుల తో సన్నిహిత సమాచారాన్ని రాబట్టుకొంటూ ఉండేందుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

 

***


(Release ID: 1918597) Visitor Counter : 200