విద్యుత్తు మంత్రిత్వ శాఖ
మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు ‘కేపీఎస్1 ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్’ను అప్పగించిన ఆర్‌ఈసీ అనుబంధ సంస్థ ఆర్‌ఈసీపీడీసీఎల్
Posted On:
21 APR 2023 12:51PM by PIB Hyderabad
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'ఆర్‌ఈసీ'కి అనుబంధ సంస్థ అయిన 'ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్' (ఆర్‌ఈసీపీడీసీఎల్), విద్యుత్ పంపిణీ కోసం రూపొందించిన ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ‘కేపీఎస్1 ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్’ను మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అప్పగించింది. 20 ఏప్రిల్ 2023న ఈ అప్పగింత జరిగింది. ఈ ఎస్‌పీవీతో కలిపి, ఆర్‌ఈసీపీడీసీఎల్ ఇప్పటి వరకు52 ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అందజేసింది. వాటి విలువ దాదాపు రూ. 70,974 కోట్లు.
నిన్న సాయంత్రం గురుగావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ప్రవీణ్ శరద్ దీక్షిత్‌కు ఆర్‌ఈసీపీడీసీఎల్ సీఈవో శ్రీ రాహుల్ ద్వివేది ఎస్‌పీవీని అందజేశారు. ఆర్‌ఈసీపీడీసీఎల్ సీజీఎం శ్రీ పి.ఎస్.హరిహరన్ సమక్షంలో ఇది జరిగింది. రెండ సంస్థల సీనియర్ అధికారులు హాజరయ్యారు.

విద్యుత్ మంత్రిత్వ శాఖ చేపట్టిన అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులో విజయవంతమైన బిడ్డర్‌గా మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిలిచింది. బిడ్ ప్రక్రియ సమన్వయకర్తగా ఆర్‌ఈసీపీడీసీఎల్ ఉంది.
విద్యుత్ పంపిణీ సేవల సంస్థ ఎంపిక కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రామాణిక బిడ్డింగ్ పత్రాలు & మార్గదర్శకాలకు అనుగుణంగా, ధర ఆధారిత పోటీ బిడ్డింగ్ (టీబీసీబీ) ద్వారా మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎంపిక జరిగింది.
‘కేపీఎస్1-కవ్ద పీఎస్ జీఐఎస్ (‘కేపీఎస్2) 765 కి.వా. రెండు సర్క్యూట్ లైన్లు & కవ్ద పీఎస్1 విస్తరణ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టును 21 నెలల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
*****
(Release ID: 1918550)