హోం మంత్రిత్వ శాఖ

శాంతియుత మరియు సుసంపన్నమైన ఈశాన్య ప్రాంత లక్ష్యసాధన కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై నేడు న్యూఢిల్లీలో కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో సంతకం చేయబడింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య ఈశాన్య సరిహద్దు వివాదానికి ఈరోజు మనమందరం చారిత్రక ఘట్టాన్ని చూశామని కేంద్ర హోంమంత్రి అన్నారు.


రెండు రాష్ట్రాల మధ్య 700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుకు సంబంధించి ఇది తుది ఒప్పందం అవుతుంది. ఏ ప్రాంతం లేదా గ్రామానికి సంబంధించి భవిష్యత్తులో ఏ రాష్ట్రాలు కొత్త దావా వేయవు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల అయిన అభివృద్ధి చెందిన శాంతియుతమైన మరియు సంఘర్షణ రహిత ఈశాన్య ప్రాంతాన్ని సాకారం చేసే దిశలో నేటి ఒప్పందం ఒక మైలురాయిగా నిలిచింది.

మోదీ ప్రభుత్వ కృషి వల్ల ఈరోజు మొత్తం ఈశాన్యంలో సర్వతోముఖాభివృద్ధి కనిపిస్తోంది. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాలతో సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు శుభప్రదంగా మారడంతో పాటు అభివృద్ధికి కొత్త తలుపులు తెరుస్తుంది.

ప్రధాని మోదీ కృషితో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఈ ముఖ్యమైన ఒప్పందం ఇతర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి రోడ్‌మ్యాప్‌ను అందించే సహకార సమాఖ్య విధానానికి విజయవంతమైన ఉదాహరణ.

ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాలకు 50 సార్లు పైగా పర్యటించారు మరియు ఎల్లప్పుడూ భాష, సంస్కృతి, సాహిత్యం, దుస్తులు, వంటకాలను ప్రోత్సహించారు, ప్రధాని మోడీ ఇటీవల అస్సాంలో బిహు పండుగ సందర్భంగా స్థానిక బిహు నృత్యాన్ని వీక్షించారు, ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది.

Posted On: 20 APR 2023 7:24PM by PIB Hyderabad

శాంతియుత మరియు సుసంపన్నమైన ఈశాన్యం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక చారిత్రాత్మక ఒప్పందంపై కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో నేడు న్యూఢిల్లీలో సంతకం చేయబడింది.ఈశాన్య ప్రాంతంలో సంపూర్ణ శాంతి నెలకొల్పేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన మరో ముఖ్యమైన చర్యలో భాగంగా ఈ ముఖ్యమైన ఒప్పందంపై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి మరియు కేంద్రం మరియు రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
 

image.png

 

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ ఈశాన్య మరియు భారతదేశంలో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాదం పరిష్కారమైన చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు మనందరం చూశాము. ఈ వివాదంపై లోకల్ కమిషన్ నివేదిక దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంది. దానిని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఆమోదించాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన, శాంతియుతమైన మరియు సంఘర్షణ రహిత ఈశాన్య రాష్ట్రాన్ని సాధించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలలను సాకారం చేసే దిశలో నేటి ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని శ్రీ అమిత్‌ షా అన్నారు.

2018 నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం..ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి మరియు హింసను అంతం చేయడానికి బిఆర్‌యు,ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, కర్బీ అంగ్లాంగ్, గిరిజన శాంతి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకాలు చేసిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా మొత్తం ఈశాన్యంలో శాంతి నెలకొందని, ఇప్పటివరకు 8000 మందికి పైగా సాయుధ యువత హింసను విడనాడి ప్రధాన స్రవంతిలో చేరారని ఆయన అన్నారు. 2014తో పోలిస్తే హింసాత్మక సంఘటనలు 67 శాతం తగ్గాయని, భద్రతా బలగాల మరణాల సంఖ్య 60 శాతం తగ్గిందని, ఈశాన్య ప్రాంతంలో పౌర మరణాల సంఖ్య 83 శాతం తగ్గిందని, ఇది చాలా పెద్ద విషయమని శ్రీ షా చెప్పారు. ఇది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం సాధించిన విజయమని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎఎఫ్‌ఎస్‌పిఏని ఉపసంహరించుకుందని అన్నారు. అస్సాంలోని 70% పోలీస్ స్టేషన్‌లు, మణిపూర్‌లోని 6 జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్‌లోని 3 జిల్లాలు, నాగాలాండ్‌లోని 7 జిల్లాలు మరియు మొత్తం త్రిపుర మరియు మేఘాలయాలు ఇప్పుడు ఎఎఫ్‌ఎస్‌పిఏ నుండి విముక్తి పొందాయి.

 

image.png

 

మోదీ ప్రభుత్వ కృషి వల్ల నేడు ఈశాన్యప్రాంతమంతా సర్వతోముఖాభివృద్ధి కనిపిస్తోందని, ఈ ప్రాంతమంతా ప్రగతి పథంలో పయనిస్తోందని కేంద్ర హోంమంత్రి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాంతంలో 50 సార్లు పైగా పర్యటించారని, ఇక్కడి భాష, సంస్కృతి, సాహిత్యం, వేషధారణలు, ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో బిహూ పండుగ సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించిన స్థానిక బిహు నృత్యాన్ని ప్రధాని వీక్షించారని, దాని ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తరపున రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ షా..నేటి ఒప్పందం రెండు రాష్ట్రాలకు మరియు ఈశాన్య రాష్ట్రాలకు శుభప్రదంగా ఉంటుందని మరియు అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుందని అన్నారు.

 

image.png

 

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ కృషిని శ్రీ అమిత్ షా అభినందించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలు ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశాయని, సామాన్య ప్రజలతో మాట్లాడి ఈ ప్రయత్నంలో అందరినీ కలుపుకుపోయేలా కృషి చేశామని చెప్పారు.

చారిత్రక దృక్పథం, జనాభా ప్రొఫైల్, పరిపాలనా సౌలభ్యం, సరిహద్దుకు సామీప్యత మరియు నివాసితుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాలకు సంబంధించిన వివాదానికి ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందంతో ముగిసింది. ఒప్పందం ప్రకారం ఈ 123 వివాదాస్పద గ్రామాలకు సంబంధించి ఈ ఒప్పందం అంతిమంగా ఉంటుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి మరియు భవిష్యత్తులో ఏ ప్రాంతం లేదా గ్రామానికి సంబంధించి ఏ రాష్ట్రాలు కొత్త దావా వేయవని అంగీకరించాయి. ఒప్పందం తర్వాత, రెండు రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సమగ్ర సర్వే నిర్వహించబడుతుంది.

 

image.png

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల సహకారంతో అంతర్-రాష్ట్ర సరిహద్దు వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఎల్లప్పుడూ ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. మోదీ ప్రభుత్వ ప్రయత్నాలతో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య నేటి ముఖ్యమైన ఒప్పందం సహకార సమాఖ్య విధానానికి విజయవంతమైన ఉదాహరణ మరియు ఇతర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.

 

……



(Release ID: 1918436) Visitor Counter : 153