పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీలోని జాతీ జూలాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లోకి తెల్లపులి పిల్లలను విడుదల చేసిన మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్


- ఆడ పులిపిల్లకు “అవని” (అంటే భూమి) అని, మగ పులి పిల్లలకు “వ్యోమ్” (అంటే విశ్వం) అని పేరు పెట్టిన కేంద్ర మంత్రి

Posted On: 20 APR 2023 10:12AM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లోని తెల్లపులి ఎన్‌క్లోజర్‌లోకి జెండా ఊపి తెల్లపులి పిల్లలను విడుదల చేశారు. కేంద్ర మంత్రి ఆడ పులి పిల్లకు “అవని” (అంటే భూమి) అని & మగ పిల్లకు “వ్యోమ్” (అంటే విశ్వం) అని పేరు పెట్టారు. ఈ పులి పిల్లల తల్లిదండ్రుల్లో తండ్రి విజయ్, తల్లి పులి సీత అని పేరు. పులి సీత ఈ పిల్లలకు 24.08.2022న జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ రెండు పిల్లలు, సుమారు 8 నెలల వయస్సు ఉన్నాయి. ఈ పిల్లలను ఇప్పటి వరకు రాత్రి ఆశ్రయం ఇచ్చి మరియు పగటిపూట తల్లితో పాటు పక్క క్రాల్‌లో ఉంచారు. పిల్లల కదలికలకు ఎక్కువ స్థలం అవసరం. కాబట్టి వాటిని పెద్ద ప్రదేశంలో అంటే సందర్శకుల ప్రదర్శనలో ఉన్న అరేనాలోకి విడుదల చేశారు. శ్రీ యాదవ్ కూడా మిషన్ లైఫ్‌ని ప్రోత్సహించడానికి పాఠశాల పిల్లలతో సంభాషించారు. స్థిరమైన జీవన విధానం మరియు సహజ వనరుల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వారితో పంచుకున్నారు. న్యూ ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 100 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. న్యప్రాణుల సంరక్షణను ప్రోత్సహించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తెల్లపులి పిల్లలను విడుదల చేసిన అనంతరం పాఠశాల విద్యార్థులకు జూ వాక్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ & స్పెషల్ సెక్రటరీ, ఎం.ఒ.ఇ.ఎఫ్.సి.సి. శ్రీ చంద్ర ప్రకాష్ గోయల్, ఏడీసీ (ఫారెస్ట్ కన్జర్వేషన్) శ్రీ సత్య ప్రకాష్ యాదవ్, ఏడీజీ (వన్యప్రాణి) ఈ కార్యక్రమంలో సెంట్రల్ జూ అథారిటీ మెంబర్ సెక్రటరీ బివాష్ రంజన్, డాక్టర్ సంజయ్ కుమార్ శుక్లా, వైల్డ్ లైఫ్ ఐజీ శ్రీ రోహిత్ తివారీ మరియు ఎం.ఒ.ఇ.ఎఫ్.సి.సి. అధికారులు పాల్గొన్నారు.

****

 


(Release ID: 1918429)