జల శక్తి మంత్రిత్వ శాఖ

నమామి గంగే : రూ. 638 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు ఆమోదం


రూ. 407. 39 కోట్ల విలువైన 4 హిందాన్ నది పునర్యవ్వన ప్రాజెక్టులకు ఆమోదం

Posted On: 18 APR 2023 4:02PM by PIB Hyderabad

     జాతీయ గంగ పరిశుభ్రత మిషన్ (ఎన్ ఎం సి జి) కార్యవర్గం 48వ సమావేశం మంగళవారం ఎన్ ఎం సి జి డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగింది.  దాదాపు రూ. 638 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు సమావేశంలో ఆమోదం తెలిపారు.  అదే విధంగా యమునా నదికి ఉపనదిగా ఉన్న  హిందాన్ నదిని శుభ్రం చేసి  షామ్లీ జిల్లాలో  కాలుష్యాన్ని అరికట్టడానికి రూ. 407. 39 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.  ఈ ప్రాజెక్టులు సమగ్ర హిందాన్ నది పునర్యవ్వన ప్రణాళికలో భాగం.  హిందాన్ నదిని మొదటి ప్రాధాన్యత కాలుష్య నదీ విస్తీర్ణంగా గుర్తించడం జరిగింది.   ఇప్పుడు మంజూరైన ప్రాజెక్టులు కాలుష్య జలాలు కృష్ణి నదిలోకి ప్రవహించకుండా నిరోధించడానికి.    హిందాన్  ఉపనదులలో ప్రధానమైన వాటిలో కృష్ణి ఒకటి.  షామ్లీ జిల్లా నుంచి వెలువడే కాలుష్యం  కృష్ణి  నుంచి హిందాన్ నదిలో కలుస్తుంది.   షామ్లీ జిల్లాలో చేపట్టబోయే నాలుగు ప్రాజెక్టులు :  i)   బాబ్రీ మరియు బాంటిఖేరా గ్రామాల్లో  రోజుకు 50 లక్షల మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంటు (నిర్మల్ జల్ కేంద్ర)  మరియు ఇతర పనులు  ii)  బాణాత్ పట్టణంలో రోజుకు 50 లక్షల మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంటు,  వ్యర్ధాలు దారి మళింపు మరియు ఇతర పనులు  iii)  షామ్లీ పట్టణంలో రోజుకు 4 కోట్ల లీటర్ల సామర్ధ్యం గల నీరు శుద్ధి చేసే ప్లాంటు, వ్యర్ధాలు దారి మళింపు మరియు ఇతర పనులు   iv) తానాభవన్  పట్టణంలో రోజుకు 1 కోటి లీటర్ల సామర్ధ్యం గల నీరు శుద్ధి చేసే ప్లాంటు, వ్యర్ధాలు దారి మళింపు మరియు ఇతర పనులు ఉన్నాయి.  

              ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 2025లో జరుగనున్న మహాకుంభ్ కోసం జరిగే ఏర్పాట్లలో భాగంగా ప్రయాగ్ రాజ్ లో 7 ఘాట్ల నిర్మాణానికి ఒక ప్రాజెక్టును కార్యవర్గం  ఆమోదించడం జరిగింది.   ఈ ప్రాజెక్టులో నిర్మించే ఘాట్లు దశాశ్మేద ఘాట్, క్విలా ఘాట్, నౌకాయాన్ ఘాట్, జ్ఞాన గంగ ఆశ్రమ్ ఘాట్, సరస్వతి ఘాట్, మహేవా ఘాట్ మరియు రసూలాబాద్ ఘాట్.  ఈ ఘాట్లు అన్నింటిలో స్నానాలు చేసేందుకు చోటు, బట్టలు మార్చుకునే గదులు, రాంప్,  మంచి నీటి కుళాయిలు,  రాత్రిపూట ఫ్లడ్ లైట్లు , బడ్డీ కొట్లు (కియోస్క్), ప్రకృతి దృశ్యం మొదలగునవి ఉంటాయి.  
             48వ కార్యవర్గ సమావేశంలో మరో రెండు మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులను ఆమోదించారు.  వాటిలో ఒకటి బీహార్ లో మరొకటి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు.  బీహార్ లో మరో మూడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు ప్రాజెక్టును కూడా ఆమోదించారు.  దాని అంచనా వ్యయం రూ. 77.39 కోట్లు.   ఈ ప్రాజెక్టులు గంగా నది ఉపనది  కియుల్ నదిలోకి కాలుష్య జలాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి.  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 2 కోట్ల 20 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును,  రోజుకు దాదాపు 24 లక్షల లీటర్ల  బయటకు ప్రవహించే నీటిని శుద్ధి చేసే ప్లాంటు మరియు ఇతర పనులను కార్యవర్గం ఆమోదించింది. వాటి అంచనా వ్యయం రూ. 92.78 కోట్లు.  ఈ ప్రాజెక్టు యమునా ఉపనది  క్షిప్ర నదిలోకి కాలుష్య జలాలు ప్రవహించకుండా  నిరోధిస్తుంది.

               సమావేశంలో  ఎన్ ఎం సి జి డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ జల కేంద్రాలను నడపడానికి సౌర శక్తిని ఉపయోగించాలని సంబంధిత రాష్ట్రాల అధికారులకు విజ్ఞప్తి చేశారు.   నదులలోకి ఘన వ్యర్ధాలు వెళ్లకుండా గ్రిల్స్ బిగించి వేరు చేయాలని కూడా ఆయన కోరారు.  ఘనవ్యర్ధాలను వేరుచేసి పారవేయాలని కూడా ఆయన కోరారు.  నమామి గంగే కార్యక్రమం కింద సృష్టించిన ఆస్తులను నిర్వహించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని ఆయన బోధపరిచారు.    ఇదివరకే ఉన్న ఘాట్లను శుభ్రం చేయడానికి స్థానిక సంస్థలు ఉపయోగిస్తున్న పద్ధతులను గురించి ఎన్ ఎం సి జికి తెలియజేయాలని ఆయన కోరారు.
               
               ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని  హరిద్వార్ లో ఘాట్ అభివృద్ధికి మరో ప్రాజెక్టును కూడా ఆమోదించారు.   అక్కడ రూ. 2.12 కోట్ల ఖర్చుతో అఖండ్ పరం ధామ్ ఘాట్ నిర్మిస్తారు.  ఈ ప్రాజెక్టులో దుకాణాలు /బడ్డీ కొట్లు (ఘాట్ పే హాట్ కోసం) , యోగ /ధ్యానం పచ్చిక బయలు,  వికలాంగుల ర్యాంప్ , విహార స్థలం,  సాంస్కృతిక మరియు మత కార్యకలాపాల కోసం వేదిక  మొదలగునవి ఉన్నాయి.

    సమావేశంలో ఎన్ ఎం సి జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పరిపాలన) శ్రీ ఎస్. పి. వశిష్ఠ,  ఎన్ ఎం సి జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్)  శ్రీ భాస్కర్  దాస్ గుప్తా ,  ఎన్ ఎం సి జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  (టెక్నీకల్) శ్రీ డి.పి. మథురియా ,  జల వనరుల శాఖ,  జాయింట్ సెక్రెటరీ మరియు ఆర్ధిక సలహాదారు, రిచా మిశ్ర,  జల శక్తి మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్రాల  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


 

****



(Release ID: 1917791) Visitor Counter : 187


Read this release in: English , Urdu , Hindi