రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళం కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీస్ గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఎవిఎస్ఎం, విఎస్ఎం
Posted On:
18 APR 2023 2:49PM by PIB Hyderabad
కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ (మానవ వనరుల నిర్వహణాధికారి)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 17 ఏప్రిల్ 23న బాధ్యతలు స్వీకరించారు. ఎలక్ట్రానిక్ యుద్ధం, కమ్యానికేషన్ల నిపుణుడిగా 01 జులై 87న భారతీయ నావికాదళంలోకి ఈ ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఆయన ప్రవేశించారు. ఆయన ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, యునైటెడ్ కింగ్డమ్‌లోని శ్రీవెనామ్‌లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరాంజాలోని కాలేజ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్, యుఎస్ఎలోని రోడ్ ఐలాండ్, న్యూపోర్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ నావల్ వార్ కాలేజ్ ల పూర్వ విద్యార్ధి.
అతి విశిష్ఠ సేవా పతకం, విశిష్ఠ సేవా పతక గ్రహీత అయిన అడ్మిరల్ తన నావికాదళ ఉద్యోగ జీవితంలో క్షిపణి నౌకలైన ఐఎన్ఎస్ విద్యుత్, ఐఎన్ వినాష్; క్షిపణులు, ఫిరంగులు కలిగిన ఐఎన్ఎస్ కులిష్, గైడెడ్ మిస్సైల్ (మార్గదర్శక క్షిపణి) ఐఎన్ఎస్ మైసూర్, విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో పలు కీలక కార్యనిర్వహక, సిబ్బంది, శిక్షణా బాధ్యతలను నిర్వహించారు.
ఫ్లాగ్ ర్యాంక్‌కు పదోన్నతి అయిన తర్వాత ఆయన కొచ్చిలోని దక్షిణ నావికాదళ కమాండ్‌లో ప్రధాన స్టాఫ్ అధికారి (శిక్షణ)గా సేవలను అందించడమే కాకుండా భారతీయ నావికాదళానికి శిక్షణను అందించడంలో కీలక పాత్ర పోషించారు. నావికాదళంలోని అన్ని స్థాయిల వ్యాప్తంగా కార్యనిర్వహక భద్రతను పర్యవేక్షించే భారతీయ నావికాదళ భద్రతా బృందాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆయన నావికాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్ (సముద్ర శిక్షణ) గా అంచలంచెలుగా ఎదిగారు. తర్వాత ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మక నియామకమైన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్టర్న్ ఫ్లీట్ కు ఆయన ఎంపిక అయ్యారు. ప్రస్తుత బాధ్యతలను స్వీకరించే వరకూ ఆయన స్వోర్డ్ ఆర్మ్ విభాగానికి నాయకత్వం వహించిన అనంతరం, అతను భారత ప్రభుత్వానికి ఫ్లాగ్ ఆఫీసర్ ఆఫ్ షోర్ డిఫెన్స్ గ్రూప్, అడ్వైజర్ ఆఫ్ షోర్ సెక్యూరిటీ, డిఫెన్స్ గా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించారు.
అడ్మిరల్ స్వామినాథన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ బిఎస్సీ డిగ్రీని, కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ లో టెలికమ్యూనికేషన్స్‌లో ఎమ్మెస్సీ, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎమ్మె పట్టాను, ముంబై యూనివర్సిటీ నుంచి స్ట్రాటజిక్ స్టడీస్ లో ఎంఫిల్, ముంబై యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్ లో పిహెచ్ డిని పూర్తి చేశారు.
***
(Release ID: 1917788)