గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

పది కోట్ల మంది గ్రామీణ మహిళలను స్వయం సహాయక సంఘాల లోకి సమీకరించడానికి "సంఘటన్ సే సమృద్ధి" జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్

Posted On: 18 APR 2023 3:55PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ - డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) అర్హత కలిగిన గ్రామీణ కుటుంబాల నుంచి 10 కోట్ల మంది మహిళలను సమీకరించే లక్ష్యంతో ఆజాదీకా అమృత్మహోత్సవ్

సమవేశి వికాస్ కింద ఏ ఒక్క గ్రామీణ మహిళ వెనుకబడి పోరాదన్న లక్ష్యం తో

 ‘ సంఘటన్ సే సమృద్ధి ‘ పేరుతో జాతీయ  జాతీయ ప్రచారాన్ని (క్యాంపెయిన్)  ప్రారంభించింది. ఈ స్పెషల్ డ్రైవ్ 2023 జూన్ 30 వరకు కొనసాగుతుంది. నిరుపేద, అట్టడుగు గ్రామీణ కుటుంబాలన్నింటినీ స్వయం సహాయక బృందం (ఎస్.హెచ్.జి ) పరిధిలోకి తీసుకువచ్చి వారు ఈ కార్యక్రమం కింద అందించే ప్రయోజనాలను పొందడానికి వీలు కల్పిస్తుంది.

 

డే-ఎన్ఆర్ఎల్ఎం కార్యక్రమం ప్రయోజనాల గురించి తెలియని వెనుకబడిన గ్రామీణ సమాజాలను సమీకరించడం ఈ ప్రచారం ప్రాధమిక లక్ష్యం.

 

గ్రామ సంస్థల సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం, స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు వెనుకబడిన కుటుంబాలను ప్రోత్సహించడం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ డ్రైవ్ లు నిర్వహించడం, పీఎంఏవై-జీ లబ్ధిదారుల కుటుంబాల నుంచి అర్హులైన మహిళలను సమీకరించడం, కొత్త స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యల ద్వారా  పనిచేయని స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించడం, స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలను తెరవడం, ఇతర భాగస్వాములచే ప్రోత్సహించబడిన స్వయం సహాయక సంఘాల ఉమ్మడి డేటాబేస్ సృష్టించడం వంటి జోక్యాల ద్వారా ఈ కాలంలో 1.1 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఈ ప్రచారాన్ని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలో ఇతర మంత్రిత్వ శాఖలు ,ప్రధాన భాగస్వామ్య బ్యాంకులకు చెందిన ప్రముఖులు ,అధికారుల సమక్షంలో ప్రారంభించారు.

 

గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్, గ్రామీణ జీవనోపాధి అదనపు కార్యదర్శి శ్రీ చరణ్ జిత్ సింగ్, మంత్రిత్వ శాఖ , డీఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎం తరఫున గ్రామీణ జీవనోపాధి సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్మృతి శరణ్ పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లకు చెందిన సీఈవోలు, మిషన్ డైరెక్టర్లు, సీనియర్ మిషన్ సిబ్బంది ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సంద ర్భంగా శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశ మొత్తం

జనాభాలో గ్రామీణ జనాభా 65 శాతం మంది ఉన్నారని, అందువల్ల, మన దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో గణనీయమైన సహకారాన్ని అందించడానికి ఈ ప్రాంతాలకు చెందిన మహిళలకు సాధ్యమైన అన్ని అవకాశాలను కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు.  10 కోట్ల మంది స్వయం సహాయక బృంద సభ్యులందరూ లక్షాధికార సోదరీమణులుగా మారినప్పుడు, అది స్వయంచాలకంగా దేశ జిడిపిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి కనీసం ఒక మహిళా సభ్యురాలు స్వయం సహాయక బృందంలో చేరడానికి , తమ జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం కింద అందించే అవకాశాలు ,ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి డే-ఎన్ఆర్ఎల్ఎం ను ప్రారంభించినట్టు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ఉద్యమంలో భాగస్వాములైన 9 కోట్ల మంది మహిళలకు అదనంగా కోటి మంది మహిళలను సమీకరించడానికి ఈ "సంఘటన్ సే సమృద్ధి" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నందుకు  సంతోషిస్తున్నామని ఆయనచెప్పారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళలందరూ స్వయం సహాయక సంఘాల ఉద్యమంలో చేరేలా చేద్దాం. మన స్వయం సహాయక బృంద సభ్యులందరూ వారి వారి గ్రామాల్లోని వెనుకబడిన మహిళలను చేరుకోవాలని, ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాలలో చేరడానికి లేదా వారి స్వంత స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడానికి వారిని ప్రేరేపించాలని నేను కోరుతున్నాను”అన్నారు.

 

వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. బీహార్, త్రిపుర, తెలంగాణ, మహారాష్ట్ర హర్యానాకు చెందిన మహిళలు తమ ఆర్థిక స్వాతంత్ర్యం ,సామాజిక సాధికారతకు దారితీసే జీవనోపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా పేదరికం నుండి బయటపడటానికి డే-ఎన్ఆర్ఎల్ఎం స్వయం సహాయక బృంద ఉద్యమం ఎలా మద్దతు ఇచ్చిందో వారి అనుభవాలను పంచుకున్నారు.

 

*****



(Release ID: 1917787) Visitor Counter : 236