ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ 2వ మీటింగ్ ముగింపు సెషన్‌లో డాక్టర్ మన్సుఖ్ మాండవియా కీలకోపన్యాసం చేశారు. మహమ్మారి పై భయాందోళన, నిర్లక్ష్యం యొక్క చక్రాన్ని మహమ్మారి అలసట అలసత్వాన్ని సమిష్టిగా విచ్ఛిన్నం చేయడం మహమ్మారి సంసిద్ధత, నివారణ మరియు ప్రతిస్పందనపై మన కొనసాగుతున్న ప్రయత్నాలను తగ్గించనివ్వకుండా ఉండటం చాలా అవసరం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
Posted On:
18 APR 2023 2:37PM by PIB Hyderabad
ఈరోజు జరిగిన 2వ జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కీలకోపన్యాసం చేశారు. "జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్‌గా, ప్రపంచ ఆరోగ్య భవిష్యత్ ఆర్కిటెక్చర్ కోసం సంయుక్తంగా సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా మేము సరైన దిశలో పయనిస్తున్నాము", అని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, జీ 20 సభ్య దేశాల నుండి ఆహ్వానించబడిన ప్రతినిధులందరి పట్ల భారతదేశం యొక్క ప్రతిపాదిత ఆరోగ్య ప్రాధాన్యతలతో తమ ప్రాధాన్యతలను సమలేఖనం చేసినందుకు దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలకు తన కృతజ్ఞతను తెలియజేసారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా సభలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని డాక్టర్ మాండవియ నొక్కిచెప్పారు. "మహమ్మారి పై భయాందోళన, నిర్లక్ష్యం యొక్క చక్రాన్ని మహమ్మారి అలసట అలసత్వాన్ని సమిష్టిగా విచ్ఛిన్నం చేయడం మహమ్మారి సంసిద్ధత, నివారణ మరియు ప్రతిస్పందనపై మన కొనసాగుతున్న ప్రయత్నాలను తగ్గించనివ్వకుండా ఉండటం చాలా అవసరం." అని అన్నారు. "ఇటలీ మరియు ఇండోనేషియా ప్రెసిడెన్సీ సమయంలో తెచ్చిన ఊపును కొనసాగించడానికి మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సంసిద్ధత, నివారణ మరియు ప్రతిస్పందన కోసం ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ ప్రణాళికలు వేస్తోంది." అని పేర్కొన్నారు.ఇంకా, డాక్టర్ మాండవ్య వైద్యపరమైన ప్రతిఘటనల కోసం ఒక అధికారిక ప్రపంచ సమన్వయ యంత్రాంగం యొక్క అవసరాన్ని హైలైట్ చేశారు మరియు మెడికల్ కౌంటర్‌మెజర్స్ (MCM) ఎజెండాపై ప్రయత్నాలను ఏకీకృతం చేయడం మరియు సమన్వయం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆరోగ్య సేవల డెలివరీలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విభజనను తగ్గించడం మరియు డిజిటల్ పబ్లిక్ వస్తువులను ప్రోత్సహించడం వంటి ఉద్దేశ్యంతో భారతదేశం డిజిటల్ ఆరోగ్యం మరియు ఆవిష్కరణల అజెండాను ప్రతిపాదించిందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ నినాదం 'వసుధైవ కుటుంబం' మూలాధారం ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో ఉందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పునరుద్ఘాటించారు. సరసమైన ధరలకు సమానమైన వైద్య సేవల ప్రాప్యతను నిర్ధారించే సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను, జాతీయ సరిహద్దుల్లోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సృష్టించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ‘ఏకీకృత వైద్య విధానం' ద్వారా సమీకృత ప్రపంచ వైద్య ఫ్రేమ్‌వర్క్ యొక్క ఆవశ్యకతను మరియు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) సవాలును ఎదుర్కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. అందరికీ 'యూనివర్సల్ హెల్త్ కవరేజ్' అందేలా సమిష్టిగా కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ చర్చలను కొనసాగించాలని ఆయన కోరారు. శ్రీ రాజేష్ కొటేచా, సెక్రటరీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, డాక్టర్ రాజీవ్ బహ్ల్, సెక్రటరీ, హెల్త్ రీసెర్చ్ మరియు డీ జీ, ఐ సీ ఎమ్ ఆర్; శ్రీ లవ్ అగర్వాల్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, జీ 20 సభ్య దేశాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఫోరమ్‌లు మరియు డబ్ల్యూ హెచ్ ఓ, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూ ఈ ఎఫ్ మొదలైన భాగస్వాములు మరియు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

***
(Release ID: 1917674)