రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను సాధ్యం చేసిన ఎన్‌హెచ్ఐఎ
Posted On:
14 APR 2023 4:39PM by PIB Hyderabad
అటవీ ప్రాంతంలోకి వాహనాలు సాఫీగా, సమర్ధవంతంగా ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేసేందుకుఎన్‌హెచ్ఎఐ విలీనం చేసిన కంపెనీ అయిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యాపించి ఉన్న నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ (పులుల అభయారణ్యం)తో ఎలక్ట్రానిక్ టోలింగ్‌ను నిర్వహించేందుకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ చొరవ అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ (FASTag ) ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందించడంతో పాటుగా టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా పర్యావరణ వ్యవస్థ నిర్వహణ రుసుము వసూలు చేసే లబ్ధిని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థ అన్ని టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ పేమెంట్స్ (యాంత్రిక దారి సుంకం వసూలు)ను సాధ్యం చేసేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి - రేడియో పౌనపున్య గుర్తింపు) సాంకేతిక అన్ని టోల్ ప్లాజాల వద్ద యాంత్రిక దారి సుంకం చెల్లింపులను సాధ్యం చేస్తుంది. భారతదేశవ్యాప్తంగా అన్ని 4- చక్రాలు & ఆ పై వాహనాలన్నింటికీ ఫాస్ట్‌ట్యాగ్ కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. అటవీ ప్రవేశ కేంద్రాలన్నింటి వద్దా ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను సాధ్యం చేయడం వల్ల, సందర్శకులు పొడవైన క్యూలను, ఆలస్యాన్ని నివారించడం ద్వారా ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఈ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని, వన్యప్రాణులను వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది.
ఐహెచ్ఎంసిఎల్, అటవీ విభాగం మధ్య ఈ భాగస్వామ్యం సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద వాహనాల ఉద్గారాలను అరికట్టడం ద్వారా సహజ వనరులను సంరక్షించడంలో ఒక ముఖ్యమైన అడుగు.
****
(Release ID: 1916822)
Visitor Counter : 161