వ్యవసాయ మంత్రిత్వ శాఖ
“తేనె / తేనెటీగల పెంపకం రంగంలో సాంకేతిక జోక్యం, ఆవిష్కరణలు”పై కన్సల్టేటివ్ వర్క్‌షాప్
Posted On:
13 APR 2023 12:38PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ తేనెటీగల పెంపకం & హనీ మిషన్ (ఎన్‌బిహెచ్‌ఎం) కింద “తేనె / తేనెటీగల పెంపకం రంగంలో సాంకేతిక జోక్యం, ఆవిష్కరణలు” పై సంప్రదింపుల వర్క్‌షాప్‌ను నిన్న న్యూఢిల్లీలో నిర్వహించింది. దాదాపు 600 తేనెటీగల పెంపకందారులు హనీ స్టార్టప్‌లు/ ఎఫ్పిఓలు, తేనెటీగల పెంపకంలో వాటాదారులు, వివిధ మంత్రిత్వ శాఖలు/ ప్రభుత్వ సంస్థలు/ సంస్థలు, రాష్ట్ర ఉద్యానవన శాఖలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్ఏయులు)/ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (సిఏయులు) మొదలైన అధికారులు కొందరు భౌతికంగా, కొందరు వర్చ్యువల్ గా పాల్గొన్నారు. .
వర్క్‌షాప్ ప్రారంభ వ్యాఖ్యలలో, హార్టికల్చర్ కమిషనర్ డా. ప్రభాత్ కుమార్ దేశంలో తేనెటీగల పెంపకం స్థితిగతుల గురించి వివరించారు. తేనెటీగల పెంపకంలో సాంకేతిక జోక్యాల ప్రాముఖ్యతను ఆయన ఎత్తిచూపారు. జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (ఎన్‌బిహెచ్‌ఎం) పాత్ర, తేనెటీగల పెంపకం రంగాన్ని బలోపేతం చేయడంలో దాని సహకారం, ఎన్బిహెచ్ఎం ద్వారా హనీ ఎఫ్పిఓ లు, అగ్రి స్టార్టప్‌ల ప్రోత్సాహాన్ని అందించడం గురించి ఆయన వివరించారు. తేనె సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, టెస్టింగ్, బ్రాండింగ్ కేంద్రాల కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఎన్బిహెచ్ఎం పథకం ఉద్దేశించబడింది, ఇది అంతిమంగా దేశంలో తేనె ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. తేనె రంగంలో కల్తీని, దుర్వినియోగాలను అరికట్టడానికి జిఐ ట్యాగింగ్ గొప్ప ఆయుధంగా మారుతుందని కూడా వివరించారు. తేనెటీగల పెంపకందారులు/ వాటాదారులను వారి ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్, జియో రెఫరెన్సింగ్ పొందేలా ప్రోత్సహించారు.
తేనెటీగల పెంపకందారులు/ఇతర వాటాదారులను ఎన్‌బిహెచ్‌ఎం కింద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పొందాలని, తేనె, ఇతర తేనెటీగల ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడానికి శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని అనుసరించాలని ఆయన ఆహ్వానించారు. ఎన్‌బిహెచ్‌ఎం పథకం కింద దేశవ్యాప్తంగా తేనెటీగల పెంపకందారులకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నేషనల్ బీ బోర్డ్ (ఎన్బిబి) అడిషనల్ కమిషనర్ హార్టికల్చర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కె పాట్లే ఎన్‌బిహెచ్‌ఎం విజయాలు, జిఐ ట్యాగింగ్/ దేశంలో తేనె జియో రిఫరెన్సింగ్, ఎన్‌బిహెచ్‌ఎం కింద సహాయం పొందిన లబ్ధిదారుల విజయ గాథలు, అవకాశాలపై క్లుప్త ప్రదర్శనను అందించారు. తేనెటీగల పెంపకందారులు, వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి, తేనెటీగల పెంపకంలో సాంకేతిక జోక్యం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంలో తేనె స్టార్టప్‌లు మరియు ఎఫ్‌పిఓలకు మద్దతు ఇవ్వడంతో సహా దేశంలోని తేనెటీగల పెంపకం పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. తేనెటీగల పెంపకందారులు/ఇతర వాటాదారుల నమోదు ద్వారా తేనెటీగల పెంపకంపై డేటాను సంగ్రహించడానికి ఎన్‌బిహెచ్‌ఎం ఆధ్వర్యంలో మధుక్రాంతి పోర్టల్ దేశంలో తేనె నాణ్యతను నిర్ధారించడానికి 31 మినీ టెస్టింగ్ ల్యాబ్‌లు, 4 ప్రాంతీయ ల్యాబ్‌లు మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
తేనెటీగల పెంపకం/తేనె ఉత్పత్తిలో వారి ప్రమేయం కోసం ఎన్‌బిహెచ్‌ఎం వ్యవసాయ వ్యవస్థాపకులు/ స్టార్టప్‌లకు కూడా మద్దతు ఇస్తోందని ఆయన తెలియజేశారు. కృషిని ఆత్మనిర్భర్ కృషిగా మార్చడానికి ఎఫ్‌పిఓల ప్రోత్సాహం, ఏర్పాటు మొదటి అడుగు అని, దీని కోసం ఎన్‌బిహెచ్‌ఎం పథకం అమలు తేనెటీగల పెంపకం రంగంలో సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని అన్నారు. హనీ ఎఫ్‌పిఓల ఏర్పాటు, ప్రమోషన్ కోసం ఆయన హామీ ఇచ్చారు. హనీ స్టార్టప్‌లు. తమ ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్‌ను పొందేందుకు ముందుకు రావాలని తేనెటీగల పెంపకం వాటాదారులందరినీ ఆయన ఆహ్వానించారు.
రాజస్థాన్, జైపూర్, జాబ్నర్, ఎస్ కె ఎన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ బాల్‌రాజ్ సింగ్ కూడా వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారితో సంభాషించారు. తేనెటీగల పెంపకం రంగాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాత్ర మద్దతు గురించి వివరించారు. తేనెటీగల పెంపకం రంగాన్ని బలోపేతం చేయడానికి శిక్షణలు, నైపుణ్యాభివృద్ధి, తేనెటీగల పెంపకాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి. గీతాలక్ష్మి కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.మేనేజ్ డైరెక్టర్ జనరల్ శ్రీ పి. చంద్ర శేఖర వ్యవ్యసాయ రంగంలో సామర్థ్యాన్ని గురించి వివరించారు. తేనెటీగల పెంపకం రంగంలో స్టార్టప్‌లు, వ్యవసాయం, అనుబంధ రంగాలలో విజయవంతమైన వెంచర్‌లను రూపొందించడానికి మేనేజ్ సింగల్ -స్టాప్ పరిష్కారం అని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంపై పుస్తకాలు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. పథకం మరింత విస్తృతం కావడానికి అది తప్పనిసరిగా వివిధ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండాలి. తేనెటీగల పెంపకం రంగంలో స్టార్టప్‌లు వ్యవస్థాపకులకు మరింత కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, సెటప్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేయాలి సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లోని ఓన్లీ అండ్ ష్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కంపెనీకి చెందిన శ్రీ నిర్మల్ వస్ర్ష్నీ కూడా తేనెటీగల పెంపకంలో వారి అనుభవాలను పంచుకున్నారు. తేనెటీగల పెంపకందారులు/చిన్న వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, సహాయం పొందేందుకు ముందుకు రావడానికి మార్గదర్శకత్వం వహించారు. శ్రీ నూర్ మహ్మద్ భట్, వ్యాలీ అపియరీస్ & ఫుడ్ ప్రొడక్ట్స్, పుల్వామా, జమ్మూ కాశ్మీర్ తేనెటీగల పెంపకందారులకు మద్దతు అందించాలని, తేనెలో కల్తీని నిరోధించాలని సూచించారు.
న్యూ ఢిల్లీలోని కేజ్రీవాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన శ్రీ అమిత్ ధనుకా తేనె ధర స్థిరత్వానికి సంబంధించి సూచనలు చేసారు.
శ్రీ జయకుమార్, డైరెక్టర్ మార్తాండమ్ హనీ ఎఫ్‌పిఓ, కన్నియాకుమారి, తమిళనాడు, తేనెను జిఐ ట్యాగింగ్ చేయడం వల్ల జిఐ ట్యాగ్ ఉత్పత్తిదారులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో డిమాండ్‌ను పెంచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్పారు. తేనెటీగల పెంపకంలో భాగస్వాములందరూ తమ ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్ కోసం ముందుకు రావాలని ఆయన ప్రోత్సహించారు.
నిమిత్ సింగ్ మధుమక్కి వాలా, బారాబ్యాంక్, యూపీ వారి హనీ స్టార్టప్‌ల గురించి పరిచయం చేసారు. మరియు తేనెటీగల పెంపకందారులు/ఇతర వాటాదారులను హనీ-స్టార్టప్‌లు చేయడం ద్వారా, ప్రభుత్వ పథకాల క్రింద సహాయం పొందడం ద్వారా వారి వృత్తిని విస్తరించుకునేలా ప్రోత్సహించారు.
హర్యానా డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డాక్టర్ అర్జున్ సింగ్ సైనీ తేనెటీగల పెంపకం రంగం నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేయడానికి సమగ్ర మార్గాన్ని సూచించారు. ప్రాంతంలో మైనపు-షీట్ తయారీ, నాణ్యమైన తేనె ఉత్పత్తిని జాతీయ సదుపాయంని ఆమోదించినందున ఇది ఒక సంవత్సరంలో పని చేస్తుందని చెబుతూ , ఎగుమతులు, తేనెటీగల పెంపకందారుల మధ్య నమ్మకానికి సంబంధించిన సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు .
భారతీయ హనీ అలయన్స్ (ఐహెచ్ఏ) సెక్రటరీ జనరల్ శ్రీ దీపక్ జాలీ తేనెటీగల పెంపకందారులకు, వినియోగదారులకు, తేనె రంగంలో విలువ గొలుసును అభివృద్ధి చేయడానికి గరిష్ట ప్రయోజనాలను నిర్ధారించడానికి తమ సంస్థ ఒక ఏకీకృత వేదికను అందజేస్తుందని తెలియజేశారు.
జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఎన్ఐఏఎం) డైరెక్టర్ శ్రీ రమేష్ మిట్టల్, తేనె రంగంలో స్టార్టప్‌ల అనుభవాన్ని పంచుకున్నారు. తేనె రంగాన్ని ప్రోత్సహించడానికి తగు చర్యలను సూచించారు. హనీ సెక్టార్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డిడిబి ద్వారా తేనె పరీక్ష ల్యాబ్ ఏర్పాటు గురించి ఆ సంస్థ డాక్టర్ రాజీవ్ చావాలా తెలియజేశారు. తేనె పరీక్ష సమస్యలను పరిష్కరించడానికి వివిధ మార్గాలను ఆయన సూచించారు. అపేడా డీజీఎం డాక్టర్ ఉమేష్ తేనె ఎగుమతిలో తమ సంస్థ పాత్ర, దాని ప్రమోషన్ కోసం భవిష్యత్తు వ్యూహాల గురించి క్లుప్తంగా వివరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మానవ జీవితంపై దాని ప్రభావాన్ని హైలైట్ చేయడం ద్వారా ఆహార ఎగుమతి వాటాదారులలో అవగాహన కల్పించాలని అపేడా యోచిస్తోంది.
డిఏ-ఎఫ్డబ్ల్యూ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి మాట్లాడుతూ అగ్రిస్టార్ట్-అప్‌లు, ఎఫ్పిఓల పెంపకంపై దృష్టి సారించాలని అన్నారు. తేనెటీగల పెంపకాన్ని ఆకర్షణీయమైన వృత్తిగా ఎంచుకోవడానికి వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎన్‌బిహెచ్‌ఎం అమలు వల్ల శాస్త్రీయమైన తేనెటీగల పెంపకంలో నైపుణ్యం పెరుగుతుందని, తేనెను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను, తేనెటీగ మైనపు, పుప్పొడి, రాయల్ జెల్లీ, తేనెటీగ విషం వంటి అనుబంధ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, నాణ్యత నియంత్రణ ప్రయోగశాలల ద్వారా మెరుగుపరచడం, మెరుగైన సరఫరాను సృష్టిస్తుందని ఆయన అన్నారు..
స్ఫటికీకరించిన తేనె స్వచ్ఛమైనది , కల్తీ లేని తేనె అని, స్ఫటికీకరించిన తేనె ఉపయోగాలపై మాస్ మీడియా ద్వారా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. స్థానిక తేనెటీగల జాతులు ప్రాంతాల వారీగా మరింత ప్రజాదరణ కోసం మూల్యాంకనం చేయాలి. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి ద్వారా ఉత్పత్తిదారుల ఆదాయాన్ని మరియు ఉపాధిని పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని అయన అన్నారు.
*****
(Release ID: 1916428)
Visitor Counter : 213