యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఖేలో ఇండియా దస్ కా దమ్'లో పాల్గొన్న ఒక లక్ష మంది మహిళా అథ్లెట్లు, మధ్యప్రదేశ్‌ నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారిణులు

Posted On: 13 APR 2023 3:32PM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా, మార్చి 10 నుంచి 31 వరకు దేశంలో జరిగిన 'ఖేలో ఇండియా దస్ కా దమ్'లో 1500కు పైగా క్రీడాంశాల్లో దేశం నలుమూలల నుంచి ఒక లక్ష మందికి పైగా బాలికలు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 580 క్రీడా కార్యక్రమాల్లో 30,975 మంది క్రీడాకారిణులు పాల్గొని, సంఖ్యాపరంగా తొలి స్థానంలో నిలిచారు.

'ఖేలో ఇండియా దస్ కా దమ్'ను మార్చి 10న జేఎల్‌ఎన్‌ స్టేడియంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.

 

మధ్యప్రదేశ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 17,011 మంది మహిళా అథ్లెట్లు 150 క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రీడలను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు/జిల్లాల్లో, విశ్వవిద్యాలయాల వ్యాప్తంగా ఉన్న ప్రాంగణాలు/కళాశాలల్లో, శాయ్‌ ప్రాంతీయ కేంద్రాల్లో, శాయ్‌ శిక్షణ కేంద్రాల్లో, అనుబంధ కేంద్రాలు, ఖేలో ఇండియా కేంద్రాలు, ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీల్లో నిర్వహించారు. భారత క్రీడల ప్రాధికార సంస్థ (శాయ్‌) సహా ఇతర వర్గాల మద్దతుతో, రాష్ట్ర/జిల్లా యూనిట్ల ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా దీనిలో చేతులు కలిపాయి.

 

 

ఖేలో ఇండియా కార్యక్రమంలోని 'స్పోర్ట్స్ ఫర్ ఉమెన్' విభాగం కింద, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏకీకృతం చేసిన కేంద్ర క్రీడల విభాగం, దేశవ్యాప్తంగా వివిధ వయస్సుల మహిళల కోసం క్రీడా పోటీలు నిర్వహించింది. జమ్మూలోని శ్రీనగర్‌ నుంచి కేరళలోని త్రిసూర్‌ వరకు, అసోంలోని కోక్రాఝర్‌ నుంచి మహారాష్ట్రలోని అమరావతి వరకు, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ వరకు దస్‌కా దమ్‌ కార్యక్రమం జరిగింది. ఖో-ఖో, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వుషు, ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, యోగాసన వంటి క్రీడా విభాగాల్లో పోటీలు జరిగాయి.

'ఖేలో ఇండియా దస్ కా దమ్' సామాజిక మాధ్యమాల ద్వారా భారీ స్థాయిలో ప్రజలకు చేరువైంది. మొత్తం రీచ్ 140 మిలియన్లకు చేరగా, క్రీడల సమయంలో మొత్తం సంభాషణల సంఖ్య 1.4 మిలియన్లకు చేరుకుంది.

గత ఏడాది కాలంగా జరిగిన అనేక ఖేలో ఇండియా మహిళల క్రీడాపోటీలకు కొనసాగింపుగా దస్ కా దమ్ కార్యక్రమం జరిగింది. 240కి పైగా మహిళల క్రీడా పోటీలు జరిగాయి, వివిధ వయసుల్లోని 23,000 పైగా మహిళా అథ్లెట్లు పాల్గొన్నారు. 27 రాష్ట్రాలు/యూటీల్లోని 50కి పైగా నగరాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లోని వివిధ దశలలో అనేక కొత్త జాతీయ రికార్డులు సాధ్యమయ్యాయి.

క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశ్యం దేశీయ పోటీలను ధృడపరచడం, ప్రతిభను గుర్తించడం మాత్రమే కాదు, పోటీపడేలా బాలికలను శక్తిమంతం చేయడం, పాదాలను తమ కెరీర్‌గా గుర్తించేలా చేయడం.

******


(Release ID: 1916374) Visitor Counter : 172