శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్వాంటం సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైన సముద్ర కమ్యూనికేషన్లను అభివృద్ధి చేయడంలో భారత నావికాదళాన్ని భాగస్వామిగా చేసుకున్న - డి.ఎస్.టి. ఇన్‌స్టిట్యూట్
Posted On:
12 APR 2023 11:53AM by PIB Hyderabad
సురక్షితమైన సముద్ర కమ్యూనికేషన్లను అభివృద్ధి చేయడానికి రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్.ఆర్.ఐ) తో, భారత నావికాదళం కలిసి సంయుక్తంగా క్వాంటం సాంకేతికతను త్వరలో వినియోగించుకోనున్నాయి.
శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి) కి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ-ఆర్.ఆర్.ఐ., ఇటీవల న్యూఢిల్లీ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత నావికాదళానికి చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డబ్ల్యూ.ఈ.ఈ.ఈ.ఈ.ఈ) తో ఒక అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యూ) కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలానికి సంబంధించిన ఈ అవగాహన ఒప్పందం పై ఆర్.ఆర్.ఐ. డైరెక్టర్ ప్రొఫెసర్ తరుణ్ సౌరదీప్, భారత నావికాదళానికి చెందిన మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతానీ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, ఉదార స్పేస్ కమ్యూనికేషన్లను భద్రపరిచే దిశగా దేశం చేసే ప్రయత్నాలను ప్రభావితం చేయగల కీలక క్వాంటం పంపిణీ మెళకువలను అభివృద్ధి చేసి, పరిశోధనలకు దారి తీసే విధంగా, ఆర్.ఆర్.ఐ. కి చెందిన క్వాంటం ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ (క్యూ.యు.ఐ.సి) ల్యాబ్, భారత నౌకాదళానికి నేతృత్వం వహిస్తుంది.
ఎం.ఓ.యు. పై న్యూ ఢిల్లీలో సంతకాలు చేయడం జరిగింది. (ఫోటో సౌజన్యం: భారత నావికాదళం)
ప్రొఫెసర్ సౌరదీప్ మాట్లాడుతూ, “భారతీయ శాస్త్ర, సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో విస్తరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఇది విద్యా, పరిశోధనా సంస్థల్లోని ప్రతిభావంతులైన, ప్రపంచ స్థాయి పరిశోధకులను జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక రంగాల్లో శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాల పెరుగుదలకు దోహదపడేలా చేస్తుంది. ప్రాథమిక, అనుబంధ శాస్త్రాలతో పాటు, శాస్త్ర, సాంకేతికతల మధ్య గుర్తించబడిన సరిహద్దు సచ్ఛిద్రత రాబోయే దశాబ్దాలలో బాగానే ఉంటుంది. అత్యాధునిక శాస్త్ర, సాంకేతికతతో డబ్ల్యూ.ఈ.ఎస్.ఈ.ఈ. తో భాగస్వామి అయినందుకు ఆర్.ఆర్.ఐ. కి గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు.
క్యూ.యు.ఐ.సి. ల్యాబ్ గ్రూప్ అధిపతి ప్రొఫెసర్ ఉర్బాసి సిన్హా మాట్లాడుతూ, “దేశీయంగా అభివృద్ధి చేసిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశ సేవలో ఉపయోగించడం ఒక గొప్ప అవకాశం. సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ల విధానంలో మా నైపుణ్యంతో, ఈ భాగస్వామ్యానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. భారతీయ నౌకాదళానికి అవసరమైన సముద్ర వినియోగ-కేసులను గుర్తించే దిశగా అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడంలో మేము సహాయం చేయగలము." అని హామీ ఇచ్చారు.
సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో దేశ పరిశోధనలకు ఈ ల్యాబ్ నాయకత్వం వహిస్తోంది. ఈ ల్యాబ్ ప్రధాన విజయాలలో "క్యూ.కె.డి.ఎస్.ఐ.ఎం" పేరుతో ఎండ్-టు-ఎండ్ సిమ్యులేషన్ టూల్ కిట్‌ను అభివృద్ధి చేయడం, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ లలో భద్రతను నిర్ధారించడం, రెండు భవనాల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అదేవిధంగా, ఇటీవల, స్థిరమైన ఒక వ్యవస్థ తో పాటు మొబైల్ రిసీవర్ మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం మొదలైనవి ఉన్నాయి. ఒకే ఒక్క మరియు చిక్కుబడ్డ ఫోటాన్‌లను ఉపయోగించి విస్తృత శ్రేణి అప్లికేషన్‌లను ప్రతిపాదించి, అమలు చేయడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్, రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వ్యూహాత్మక రంగాలలో సురక్షితమైన కమ్యూనికేషన్‌లను ఏర్పాటు చేయడం కోసం, భారతదేశపు మొట్టమొదటి ప్రయోగశాలగా కూడా క్యూ.యు.ఐ.సి. ల్యాబ్ గుర్తింపు పొందింది.
మరిన్ని వివరాల కోసం ప్రొఫెసర్ ఉర్బాసి సిన్హా ని usinha@rri.res.in
సంప్రదించవచ్చు
<><><><>
(Release ID: 1916060)
Visitor Counter : 245