ఆర్థిక మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో సోదా, స్వాధీనం/ జప్తు చర్యలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
11 APR 2023 5:44PM by PIB Hyderabad
కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని సహకార బ్యాంకులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ 31.03.2023న సోదా & స్వాధీనం/ జప్తు (సెర్చ్ & సీజర్) ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ సహకార బ్యాంకులు తమ ఖాతాదారులకు చెందిన వివిధ సంస్థలకు చెందిన నిధులను వారు పన్ను ఎగవేసే అవకాశమిచ్చే కార్యకలాపాలలో నిమగ్నమైనట్టు వెల్లడైంది. ఈ సోదా చర్యలను మొత్తం 16 స్థలాలలో నిర్వహించారు.
ఈ సోదా చర్యలో నేరారోపణను రుజువు చేసే హార్డ్ కాపీ పత్రాలు, సాఫ్ట్ కాపీ డేటాను పెద్ద ఎత్తున కనుగొని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సహకార బ్యాంకులు వివిధ వ్యాపార సంస్థలు వివిధ నకిలీ, ఉనికిలో లేని సంస్థల పేరుతో జారీ చేసిన బేరర్ చెక్కులకు భారీగా వేరొక ఖాతాకు (డిస్కౌంటింగ్) పంపడంలో నిమగ్నమైనట్టుగా స్వాధీనం చేసుకున్న ఆధారాలు వెల్లడించాయి. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు తదితరాలు సహా ఈ వ్యాపార సంస్థలలో ఉన్నాయి. అటువంటి బేరర్ చెక్కులను మరొక ఖాతాకు పంపేటప్పుడు ఎటువంటి కెవైసి నియమాలను పాటించలేదు. ఈడిస్కౌంటింగ్ చేసిన అనంతరం మొత్తాలను ఈ సహకార బ్యాంకులు నిర్వహించే కొన్ని సహకార సంఘాల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. తదనంతరం కొన్ని సహకార సంఘాలు తమ ఖాతాల నుంచి ఈ నిధులను ఉపసంహరించి, ఈ నగదు మొత్తాన్ని వ్యాపార సంస్థలకు తిరిగి ఇచ్చినట్టు గుర్తించారు. ఇంత భారీ సంఖ్యలో చెక్కులకు మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న లక్ష్యం, ఆ నగదు ఉపసంహరణ వాస్తవ మూలాన్ని మరుగుపరిచి, వ్యాపార సంస్థలు బోగస్ ఖర్చులను చూపేందుకు తోడ్పడడం. ఈ కార్యనిర్వహణ పద్ధతిలో, సహకార సంస్థలను వాహకంగా ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా, ఈ కార్యనిర్వహణ పద్ధతిని ఉపయోగించుకొని, ఈ వ్యాపార సంస్థలు అకౌంట్ పేయి చెక్ ద్వారా కాకుండా చేసే వ్యాపార వ్యయ పరిమితిని విధించే ఆదాయపు పన్ను చట్టం, 1961లో కొన్ని నియమాలను తప్పించుకొంటున్నారు. ఈ లబ్ధిదారు వ్యాపార సంస్థలు ఈ రకంగా నమోదు చేసిన బోగస్ వ్యయం రూ. 1,000 కోట్ల వరకు ఉండవచ్చు.
సోదాల సందర్భంగా, సహకార బ్యాంకులు తగిన శ్రద్ధ, పరిశీలన లేకుండా నగదు డిపాజిట్లను ఉపయోగించి ఎఫ్‌డిఆర్‌లను తెరవడానికి అనుమతించడమే కాకుండా తదనంతరం వాటినే అదనపు భద్రతగా ఉపయోగించి రుణాలను మంజూరు చేసినట్టుగా కూడా కనుగొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు రూ. 15 కోట్లకు పైగా లెక్కలోకి రాని నగదు రుణాలను కొందరు వ్యక్తులు/ ఖాతాదారులకు ఇచ్చినట్టు వెల్లడైంది.
సహకార బ్యాంకుల యాజమాన్యం తమ రియల్ ఎస్టేట్ & ఇతర వ్యాపారాల ద్వారా లెక్కలోకి రాని డబ్బును సృష్టించడానికి పాల్పడినట్టు ఈ సోదాలలో వెలుగులోకి వచ్చింది. లెక్కలోకి రాని ఈ డబ్బును, ఈ బ్యాంకుల ద్వారా బహుళ స్తరాలలో తమ అకౌంట్ పుస్తకాలలో ఎక్కించడం ద్వారా తిరిగి వెనక్కి తీసుకువచ్చారు. అంతేకాకుండా, ఈ బ్యాంకు నిధులను తగిన పరిశీలన లేకుండా యాజమాన్య వ్యక్తులే ఏర్పాటు చేసుకున్న వివిధ సంస్థలు, ఫర్మ్‌ల ద్వారా వారి వ్యక్తిగత వినియోగం కోసం ఈ నిధులను దారిమళ్ళించారు.
ఈ సోదాల ఫలితంగా లెక్కల్లోకి రాని రూ. 3.3 కోట్ల నగదును, లెక్కల్లో చూపని రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
****
(Release ID: 1915846)
Visitor Counter : 171