శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత 9 ఏళ్లలో స్టార్టప్‌లు 300 రెట్లు పెరిగాయని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 APR 2023 2:40PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత);కేంద్ర ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ భారతదేశంలో స్టార్టప్‌లు గత 9 సంవత్సరాలలో 300 రెట్లు పెరిగాయని అన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు” కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము “గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్స్”ను ప్రదానం చేశారు.

 

image.png

 

2014కి ముందు దేశంలో దాదాపు 350 స్టార్టప్‌లు ఉండేవని అయితే 2016లో ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట నుండి స్పష్టమైన పిలుపునిచ్చి 2016లో ప్రత్యేక స్టార్టప్ స్కీమ్‌ను ప్రారంభించిన తర్వాత వాటి సంఖ్య గణనీయంగా 90,000కు పైగా పెరిగిందని మంత్రి చెప్పారు.ఈ స్టార్టప్‌లలో 100 కంటే ఎక్కువ యునికార్న్‌ సంస్థలున్నాయి.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఏకకాలంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని ప్రారంభించారని ఆ చర్య కేవలం మూడేళ్లలో అంతరిక్ష రంగంలో 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు దారితీసిందని అన్నారు. అదేవిధంగా బయోటెక్ స్టార్టప్‌లు దాదాపు 50 నుండి సుమారు 6,000 వరకు పెరిగాయని ఆయన చెప్పారు.

 

image.png

 

 

భారత్‌ యువతలో ప్రతిభ, సామర్థ్యం, ఆవిష్కరణలు, సృజనాత్మకతలకు కొదవ లేదని అయితే వారికి అనుకూలమైన వాతావరణం, సరైన ప్రోత్సాహం లభించ లేదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మన గ్రామీణ యువతలో కూడా అపారమైన ప్రతిభ ఉంది. అధికారిక విద్య డిగ్రీ మరియు ఆవిష్కరణ సామర్థ్యాల మధ్య ఎటువంటి సంబంధం లేదు.అది ఈ రోజు ఇచ్చిన అవార్డుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అకడమిక్ డిగ్రీలకే కాకుండా నైపుణ్యానికి ప్రాధాన్యతనిచ్చే జాతీయ విద్యా విధానం 2020ని తీసుకురావడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీ  కోరినట్లు ఆయన తెలిపారు.

ఈ రోజు ఇవ్వబడిన అవార్డుల స్వభావం మరియు అవార్డు గ్రహీతల ప్రొఫైల్ పరిశీలిస్తే భారతదేశంలో పెద్ద సంఖ్యలో “గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్లు” అందుబాటులో ఉన్నారని రుజువు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వారు  అధికారిక ఉన్నత విద్యను కలిగి ఉండకపోవచ్చు..కానీ విజయవంతమైన కథలను సృష్టించడం వారి జీవనోపాధికి ఆకర్షణీయమైన మార్గాలను రూపొందించుకోవడం వంటి సామర్థ్యాలు వారికి ఉన్నాయి.

 

image.png

 

"ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్" (ఫైన్) నిర్వహణ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) చేస్తున్న కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లను కూడా ప్రోత్సహించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం అని పేర్కొన్నారు. అధికారిక కోణంలో ఉన్నత విద్యను అభ్యసించని వారు లేదా సైన్స్ విద్యార్థులు కానివారు కూడా స్వాభావికమైన ప్రతిభను మరియు ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత కోసం సహజమైన అభిరుచిని కలిగి ఉంటారు. ఇది వారి జీవనోపాధికి మూలం కూడా కావచ్చు.

జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, విద్యార్థి విభాగంలో వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈరోజు అవార్డు గ్రహీతలలో ఇద్దరు ఇప్పటికే తమ ఆవిష్కరణలకు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.


 

*****


(Release ID: 1915386) Visitor Counter : 228