బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య, కాప్టివ్ బొగ్గు గనుల కేటాయింపుదారులతో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
10 APR 2023 1:08PM by PIB Hyderabad
ఇంధన అవసరాలను నెరవేర్చడంలో భారత్‌కు తోడ్పడాలన్న తన నిబద్ధతలో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్‌ను చురుకుగా అనుసరిస్తోంది. బొగ్గు మంత్రిత్వశాఖ సిఎం(ఎస్‌పి) చట్టం, 2015- ఎంఎండిఆర్ చట్టం 1957 కింద తొలి విడతలో 38 బొగ్గు గనులతో 18 జూన్ 2020న వాణిజ్య వేలాన్ని ప్రారంభించింది. నేటివరకు ఆరు విడతల వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని పూర్తి చేయగా, ఏడాదికి 220.52 మిఇయన్ టన్నుల (ఎంటిపిఎ) సంచిత పిఆర్‌సి కలిగి, మొత్తం అత్యధిక రేటు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 33,231 కోట్ల ఆదాయాన్ని వార్షికంగా ఉత్పత్తి చేయగల 87 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేయడం జరిగింది. ఆర్థిక సంవత్సరం 2022-23కు కాప్టివ్ & వాణిజ్య బొగ్గు గనుల నుంచి 115.77 ఎంటిల బొగ్గు ఉత్పత్తిని బొగ్గు మంత్రిత్వ శాఖ సాధించింది. అంతేకాక, భారత దేశ ఇంధన అవసరాలను నిర్ధారించి, హామీ ఇచ్చేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ 12 ఏప్రిల్ 2023న న్యూఢిల్లీలో క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుదారులతో ముఖాముఖి చర్చను నిర్వహించనుంది.
బొగ్గు రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేసిన ముఖ్యమైన సంస్కరణలను సెషన్ లో పట్టి చూపడమే కాక, దేశీయ బొగ్గు ఉత్పత్తిని విస్తరించేందుకు, దిగుమతి చేసుకున్న బొగ్గు అవసరాన్ని తగ్గించడం, దేశంలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయానకి సంబంధిత అందరు వాటాదారుల సూచనలను, అభిప్రాయాలను కోరనుంది.
ఆర్థిక సంవత్సరం 2022-23కి వాస్తవ బొగ్గు ఉత్పత్తితో పాటుగా 2023-24కు ఉత్పత్తి లక్ష్యాలను బొగ్గు మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది.
ఈ కార్యక్రమానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా అధ్యక్షత వహిస్తుండగా, అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ శ్రీ ఎం. నాగరాజు కూడా ఇందులో పాల్గొననున్నారు.
***
(रिलीज़ आईडी: 1915384)
आगंतुक पटल : 176