ఆయుష్
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా శాస్త్రీయ సదస్సును నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
08 APR 2023 2:03PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతీ ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని 10 ఏప్రిల్ 2023న న్యూఢిల్లీలో శాస్త్రీయ సదస్సును నిర్వహిస్తోంది. ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ ఈ శాస్త్రీయ సదస్సును ప్రారంభిస్తుండగా, ఆయుష్, ఒడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఆయుష్ & డబ్ల్యుసిడి సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మనోజ్ రజోరియా, ఆయుష్ వైద్య కార్యదర్శి రాజేష్ కొటేచా కూడా హాజరుకానున్నారు.
ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని హోమియోపతి సంస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ సామ్యూల్ హానెమన్ స్మత్యర్థం జరుపుకుంటారు. ఇది ఆయన 268వ జయంతి ఉత్సవం. ఈ శాస్త్రీయ సదస్సు ఇతివృత్తం - హోమియోపరివార్- సర్వజన స్వాస్థ్యం, ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం (వన్ హెల్త్, వన్ ఫ్యామిలీ).
ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులలో హోమియోపతి పరిశోధకులు, శాస్త్రీవేత్తలు, అంతర్‌శాస్త్ర స్రవంతులకు చెందినవారు, ప్రాక్టిషనర్లు, విద్యార్ధులు, పారిశ్రామికవేత్తలతో పాటుగా వివిధ హోమియోపతి అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సిసిఆర్‌హెచ్ & వివిధ హోమియోపతి కళాశాలల మధ్య, సిసిఆర్‌హెచ్ & కేరళ ప్రభుత్వ డైరెక్టొరేట్ ఆఫ్ హోమియోపతి మధ్య అవగాహనా ఒప్పందాలు కుదర్చుకోనున్నాయి. ఈ సందర్భంగా, ఒక డాక్యుమెంటరీ, ఒక పోర్టల్, సిసిఆర్‌హెచ్ ప్రచురించిన 08 పుస్తకాల విడుదల ఉంటాయి.
సదస్సు సందర్భంగా, విధాన అంశాలు, హోమియోపతిలో పురోగతి, పరిశోధనా ఆధారాలు, హోమియోపతిలో క్లినికల్ అనుభవాల పై వివిధ సెషన్లు జరుగనున్నాయి. సదస్సులో ఆయుష్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ అజిత్ ఎం శరణ్, ఐఎఎస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాహుల్ శర్మ, ఐఎఎస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ (హోమియోపతి) సలహాదారులు డాక్టర్ ఎ. దుగ్గల్, ఢిల్లీ (ఆయుష్) డైరెక్టర్ & సిసిఆర్‌హెచ్ మాజీ డిజి డాక్టర్ రాజ్ కె. మన్‌చందా, ఎన్‌సిహెచ్ చైర్మన్& సిసిఆర్‌హెచ్ మాజీ డీజీ డాక్టర్ అనిల్ ఖురానా, సిసిఆర్‌హెచ్ డిజి డాక్టర్ సుభాష్ కౌశిక్, కింగ్ జార్జ్స్ మెడికల్ యూనివర్సిటీ, లక్నోలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ వైస్ డీన్, ప్రొఫెసర్ & అధిపతి డాక్టర్ శైలేంద్ర సంక్సేనా, కోల్‌కతకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి డైరెక్టర్ డాక్టర్ సుభాష్ సింగ్ ఉపన్యసిస్తారు.
విజ్ఞాన భవన్‌లో కార్యక్రమం ప్రారంభమైన అనంతరం భారత దేశంలో ఐదు ప్రాంతాలలో జోనల్ ప్రపంచ హోమియోపతి దినోత్సవాలు జరుగనున్నాయి. ఈ శాస్త్రీయ సదస్సు వివిధ కీలక వాటాదారులతో చర్చల ద్వారా పరిశోధన, విద్య, సమగ్ర సంరక్షణ, పరిశోధనలో హోమియోపతిని సమగ్రపరచడానికి భవిష్యత్ రోడ్‌మ్యాప్ అంతర్దృష్టులను అందిస్తుంది.
***
(Release ID: 1914852)
Visitor Counter : 195