ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2022-23లో 58% నికర లాభ వృద్ధిని సాధించిన హెచ్ఐటిఇఎస్
Posted On:
06 APR 2023 1:41PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ (హెచ్ఐటిఇఎస్) మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ 19 శాతం పెరిగి రూ. 361.38 కోట్ల నికరలాభంతో 58శాతం వృద్ధిని సాధించింది.
హెచ్ఐటిఇఎస్ గత ఏడాది రూ. 17.60 కోట్లతో పోలిస్తే 2022-23లో పన్ను చెల్లింపు తర్వాత లాభాన్ని రూ. 27.76 కోట్లుగా నివేదించింది. కేవలం తొమ్మిదేళ్ళ కింద విలీనం అయిన రూ. 2 కోట్ల విలువైన మినీరత్న అనుబంధ సంస్థకు ఇది ఒక గొప్ప విజయం, ఘనత. ఆర్థిక సంవత్సరం 2021-22లో సాధించిన రూ. 303.40 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే ప్రస్తుత మొత్తం టర్నోవర్ రూ. 361.38 కోట్లుగా నమోదైంది.
భటిండా, గోరఖ్‌పూర్, గువాహతిలో కొత్త ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికెల్ సైన్సెస్ (ఎఐఎంఎస్) నిర్మాణ పూర్తి, గత ఆర్తిక సంవత్సరంలో అనేక ప్రాజెక్టులను అప్‌గ్రేడ్ చేయడం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యాపారం కారణంగా ఈ గణనీయ సానుకూల ఫలితాలు సాధించడం సాధ్యమైంది.
భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న 50 ఏళ్ళ భారత ప్రభుత్వ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్). ఆరోగ్య సంక్షేమ రంగంలో నిర్మాణం, సేకరణ వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో 03 ఏప్రిల్ 2014లో హెచ్ఐటిఇఎస్- హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రా సర్వీసెస్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు, సేకరణ కన్సల్టెన్సీని, సౌకర్యాల నిర్వహణ, బయోమెడికల్ ఇంజినీరింగ్ సౌకర్యాలను అందించడం కోసం పని చేస్తుంది.
హెచ్ఐటిఇఎస్ మౌలికసదుపాయాల అభివృద్ధి విభాగం, భవన నిర్మాణం, వ్యవస్థీకృత, ఎంఇపి నమూనా, మదింపు, బిడ్ ప్రక్రియ నిర్వహణ, నిర్మాణ ప్రాంత పర్యవేక్షణ, కాంట్రాక్ట్ నిర్వహణ, ఫెసిలిటీ నిర్వహణ తదితరాలు సహా ప్రాజెక్టు & నిర్మాణ రంగ నిర్వహణలో సేవలును అందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సంస్థ సంస్థాగత, వాణిజ్య, నివాస, పర్యాటక సంబంధ ప్రాజెక్టులను చేపట్టే దిశగా విస్తరించి, కల్పన నుంచి ప్రారంభం వరకూ సమగ్ర సేవలను అందిస్తుంది.
***
(Release ID: 1914641)
Visitor Counter : 144