ఉక్కు మంత్రిత్వ శాఖ
బ్రాండ్ అంబాసిడర్ మరియు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను సత్కరించిన ఎన్ఎండీసీ
Posted On:
06 APR 2023 5:19PM by PIB Hyderabad
2023 ఐబీఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నిఖత్ జరీన్ ను ఎన్ఎండీసీ సంస్థ సత్కరించింది. ఇటీవల ఆమె సాధించిన విజయాన్ని పురస్కరించుకొని బుధవారం ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్ఎండీసీ సీఎండీ (అదనపు ఛార్జ్) శ్రీ అమితవ ముఖర్జీ అధ్యక్షత వహించారు. సంస్థ డైరెక్టర్ (ప్రొడక్షన్) శ్రీ దిలీప్ కుమార్ మొహంతి మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 26 సంవత్సరాల వయస్సులో నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణాలు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్ గా నిలిచింది. తన బ్రాండ్ అంబాసిడర్‌ని ఎన్ఎండీసీ ప్రశంసించింది. బలాన్ని ప్రతిబింబించి బాక్సింగ్ క్రీఢలో దేశానికి గౌరవం తీసుకురావడానికి ఆమె నిబద్ధతను పంచుకునే వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కంపెనీ గర్వపడుతోందని పేర్కొంది. నిఖత్ జరీన్ న్యూ ఇండియా యొక్క ఆశలు మరియు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుంది హాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడలు మరియు పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌కు ఎన్ఎండీసీ ఆమె ప్రయాణానికి కావాల్సిన మద్దతును అందిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ అమితవ ముఖర్జీ, సీఎండీ (Addl. ఛార్జ్) మాట్లాడుతూ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యతను చాటుకోవడం మరియు భారతదేశానికి స్వర్ణం సాధించడం గర్వకారణమని వివరించారు. " రాబోయే మ్యాచ్‌లు మరియు ఒలింపిక్స్ కోసం, అందుకు అవసరమైన శిక్షణ కోసం నేను నిఖత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని శ్రీ ముఖర్జీ అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ సంస్థకు నిఖత్ జరీన్ తన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎండీసీ అందిస్తున్న తిరుగులేని మద్దతు చాలా ప్రశంసనీయం అని ఆమె అన్నారు. తన సామర్థ్యాన్ని విశ్వసించడమే కాకుండా తన కలల సాకారానికి కూడా సంస్థ తన పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తోందని వివరించారు. "వారి ప్రోత్సాహం నా విజయం వెనుక చోదక శక్తిగా ఉంది మరియు నా ప్రయాణంలో వారి సహకారాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తా"ను అని నిఖత్ అన్నారు. ఖేలో ఇండియా మరియు ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ దృష్టికి అనుగుణంగా, ఎన్ఎండీసీ మారథాన్‌లు, గేమిఫైడ్ వాకథాన్‌లు, స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు మరియు యోగాలను నిర్వహిస్తుంది. నిఖత్ జరీన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఎన్ఎండీసీ రూ.6 కోట్లను భారతదేశంలో క్రీడల ప్రోత్సాహం కోసం మరియు దేశంలోని రాబోయే క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం కోసం పెట్టుబడిగా పెట్టింది.
****
(Release ID: 1914612)
Visitor Counter : 150