హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాగాలాండ్లో వివిధ సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందాలు పొడిగింపు


- నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/ఎన్.కె, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/ రిఫార్మేషన్ మరియు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/కె-ఖాంగో మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు పొడిగింపు

Posted On: 06 APR 2023 7:05PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం మరియు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/ఎన్.కె (ఎన్.ఎస్.సి.ఎన్/ఎన్.కె), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/ రిఫార్మేషన్ (ఎన్.ఎస్.సి.ఎన్/ఆర్) మరియు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్/కె-ఖాంగో (ఎన్.ఎస్.సి.ఎన్/కె ఖంగో)- మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు అమలులో ఉన్నాయి. వీటి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్.ఎస్.సి.ఎన్/ఎన్.కె మరియు ఎన్.ఎస్.సి.ఎన్/ఆర్ లతో 28 ఏప్రిల్, 2023 నుండి 27 ఏప్రిల్, 2024 వరకు మరియు ఎన్.ఎస్.సి.ఎన్/కె ఖంగో తో ఏప్రిల్ 18, 2023 నుండి ఏప్రిల్ 17, 2024 వరకు కాల్పుల విరమణ ఒప్పందాలను ఒక సంవత్సరం పాటు పొడిగించాలని నిర్ణయించబడింది. ఈ ఒప్పందాలు 6 ఏప్రిల్, 2023న సంతకం చేయబడ్డాయి.

 

*****


(Release ID: 1914609) Visitor Counter : 172