అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

ఉపగ్రహాల నిర్మాణం & సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వ మార్గంలో మాత్రమే ప్రస్తుతం 100% ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నాం - కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్

Posted On: 06 APR 2023 3:06PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో, ఉపగ్రహాల నిర్మాణం & సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వ మార్గంలో మాత్రమే ప్రస్తుతం 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తున్నట్లు కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (సంతంత్ర హోదా) డా.జితేంద్ర సింగ్ చెప్పారు.

అంతరిక్ష కార్యకలాపాల నియంత్రణ, ప్రోత్సాహక సంస్థ అయిన 'ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్' (ఇన్-స్పేస్), ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఎఫ్‌డీఐ విధానం సవరణలో పాలుపంచుకుంటున్నట్లు రాజ్యసభలో చేసిన ప్రకటనలో కేంద్ర మంత్రి తెలిపారు.

సవరించిన ఎఫ్‌డీఐ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సరైన మార్గంలో ఆకర్షించడంలో ఇన్-స్పేస్ పాత్ర పెరుగుతుంది.

***


(Release ID: 1914504) Visitor Counter : 272


Read this release in: English , Urdu , Marathi , Tamil