గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్)2.0 కోసం సిఎస్ఆర్
Posted On:
03 APR 2023 12:42PM by PIB Hyderabad
దేశంలో అన్ని పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా (ఒడిఎఫ్) అభివృద్ధి చేసి, శాస్త్రీయ విధానంలో వెలువడుతున్న మొత్తం ఘన వ్యర్థాలను శుద్ధి చేయడం లక్ష్యంగా 2014 అక్టోబర్ నెలలో స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ (ఎస్ బి ఎం -యు) ప్రారంభమయ్యింది. స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ లో సాధించిన ప్రగతిని కొనసాగించడానికి పథకం 2వ దశ స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ 2.0 ప్రారంభమయ్యింది. గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు/ ప్రజా మరుగుదొడ్లు నిర్మాణం, వినియోగించిన నీటిని శుద్ధి చేయడం,విద్యా,సమాచారం ప్రచారం, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, పరికరాల నిర్వహణపై శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం విధులు సమకూరుస్తోంది.
2014లో స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ ప్రారంభమైన నాటి నుంచి 62.81 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు (ఐ హెచ్ హెచ్ ఎల్), 6.36 లక్షల సామాజిక మరుగుదొడ్లు/ ప్రజా మరుగుదొడ్ల (సిటి/పిటి) నిర్మాణం పూర్తయింది. మొత్తం 92,634 వార్డులలో 89,699 వార్డులలో వ్యర్థాలను ఇంటింటి నుంచి సేకరిస్తున్నారు. వెలువడిన ప్రాంతంలోనే వ్యర్థాలను వేరు చేసే కార్యక్రమం 83,487 వార్డులలో అమలులో ఉంది. వెలువడుతున్న వ్యర్థాలలో 75% వ్యర్థాలు శుద్ధి అవుతున్నాయి.
అమృత్ లో సాధించిన ప్రగతిని కొనసాగించడానికి 2021లో అమృత్ 2.0 ప్రారంభమయ్యింది. మౌలిక సదుపాయాల కల్పన , సంస్కరణలు అమలు ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సులభతరం జీవం సౌలభ్యం కల్పించాలన్న లక్ష్యంతో అమృత్ పథకం అమలు జరుగుతోంది. అమృత్ పథకంలో భాగంగా 1,29,636 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో రూపొందిన 6,527 రాష్ట్ర నీటి సరఫరా కార్యాచరణ ప్రణాళికలకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2,996 నీటి సరఫరా ప్రాజెక్టులను 87,896 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడతారు. 37,636 కోట్ల రూపాయల ఖర్చుతో 447 వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రాలను, 439 కోట్ల రూపాయల ఖర్చుతో 982 పార్కులు/ హరిత అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఆమోదించిన ప్రాజెక్టులలో ఇప్పటికే 103.99 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 5634.55 కోట్ల అంచనాలతో చేపట్టిన పనుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది.
దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో 1,41,600 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చేపట్టే విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ 2.0, అమృత్ 2.0 పథకాలు 2021 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమయ్యాయి. 2,77,000 కోట్ల రూపాయలను కేంద్ర తన వాటాగా విడుదల చేస్తుంది. రాష్ట్రాలు, స్థానిక పట్టణ సంస్థలు,ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తారు. ఈ రెండు ప్రాజెక్టుల అమలులో సిఎస్ ఆర్ వాటా ఉండాలని నిబంధన ఏమీ లేదు.
స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ 2.0, అమృత్ 2.0 పథకాలతో సహా అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు విడుదల చేయడానికి సంబంధించి 2021 మార్చి 23న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.దీని ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు లో ఉన్న సింగల్ నోడల్ అకౌంట్ ద్వారా ఒక సింగల్ నోడల్ ఏజెన్సీ నిధుల విడుదల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు విడుదల చేసిన నిధుల వివరాలు తెలియజేస్తూ కార్యక్రమాలను అమలు చేయడానికి ఏర్పటైన సంస్థ జీరో బాలన్స్ విధానంలో సింగల్ నోడల్ అకౌంట్ ద్వారా నిధులు పొంది, నిధుల వినియోగంపై నివేదిక అందిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశాంకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1913335)
Visitor Counter : 224