విద్యుత్తు మంత్రిత్వ శాఖ

గాంధీనగర్ లో రెండవ జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్  సమావేశం


గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత వంటి తక్షణ, తీవ్రమైన సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడమే భారత జీ20 ప్రెసిడెన్సీ లక్ష్యం: డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ కలూభాయ్

స్వచ్ఛమైన ఇంధన మార్పు సాధించడానికి జి 20 సభ్య దేశాలు సహకరించాల్సిన,  నమ్మకం భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది: శ్రీఅలోక్ కుమార్, విద్యుత్ శాఖ కార్యదర్శి

Posted On: 02 APR 2023 6:35PM by PIB Hyderabad

గాంధీనగర్ జీ20 అధ్యక్షతన రెండవ ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ (ఇటీడబ్ల్యూజీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. కేంద్ర ఆయుష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ కాలూభాయ్ తన ప్రారంభోపన్యాసంలో, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ,ఇంధన భద్రతకు తక్షణ ,అత్యవసర పరిష్కారాలను కనుగొనడానికి భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ నిబద్ధతను ఉద్ఘాటించారు. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ,తక్కువ ఖర్చుతో నమ్మదగినదిగా మార్చడానికి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి అవసరాన్ని మంత్రి ప్రముఖంగా వివరించారు.

 

జీ20 సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ

(ఐ ఇఏ), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ది ఆసియా అండ్ పసిఫిక్ (యుఎన్ఇఎస్ సిఎపి ), యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆసియాన్ అండ్ ఈస్ట్ ఆసియా (ఇఆర్ఐఏ), ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్ మెంట్ క్యాంపెయిన్' ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. వనరులను విచక్షణతో, ఉద్దేశపూర్వకంగా వినియోగించుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, సంరక్షించడం దిశగా అంతర్జాతీయ ప్రజా ఉద్యమంగా దీనిని నిర్మించాలని ఆయన వ్యక్తులు, సమాజాలను కోరారు.

 

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ మాట్లాడుతూ, జి 20 సభ్యదేశాల మధ్య సమానమైన, భాగస్వామ్య ,సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి చర్య తప్పనిసరి అని స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ మార్పు సాధించడానికి సభ్య దేశాలు సహకరించాలని, నమ్మకం భావనను పెంపొందించుకోవాలని ఆయన కోరారు.

గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు, రెన్యూవబుల్ ఎనర్జీ ఎవాక్యుయేషన్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, పీఎం-ప్రాణం, గోబర్ధన్ స్కీమ్, భారతీయ ప్రకృతిక్ ఖేతి బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్, మిష్టీ, అమృత్ ధరోహర్, కోస్టల్ షిప్పింగ్, వెహికల్ రీప్లేస్మెంట్ వంటి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రధాన పథకాలను ఆయన వివరించారు.

 

సాంకేతిక అంతరాలను పరిష్కరించడం ద్వారా ఇంధన మార్పు కోసం తక్కువ ఖర్చుతో కూడిన ఫైనాన్సింగ్, ఇంధన భద్రత, వైవిధ్యమైన సరఫరా గొలుసులు, ఇంధన సామర్థ్యం, పారిశ్రామిక తక్కువ కార్బన్ పరివర్తనలు ,బాధ్యతాయుతమైన వినియోగం, భవిష్యత్తు కోసం ఇంధనాలు, స్వచ్ఛమైన ఇంధనం, న్యాయమైన, సరసమైన ,సమ్మిళిత ఇంధన మార్పు సార్వత్రిక ప్రాప్యతతో సహా ఆరు ప్రాధాన్యతా రంగాల పై ఈ సమావేశం దృష్టి సారించింది.

 

ఈ సమావేశాలలో భాగంగా గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ -ఎనేబుల్ నెట్ జీరో పాత్ వేస్ అనే అంశంపై సదస్సు సెమినార్ నిర్వహించారు. రెండవ ఇ టి డబ్ల్యూ జి సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధులు గాంధీనగర్ లోని గిఫ్ట్ సిటీని సందర్శించారు.

 

క్లీన్ ఎనర్జీ మార్పు లో ప్రపంచ సహకారాన్ని పెంపొందించడానికి , సుస్థిర ఆర్థిక అభివృద్ధి ఎజెండాలో కేంద్ర బిందువుగా చేయడానికి భారతదేశం అధ్యక్షతన నాలుగు ఇటిడబ్ల్యుజి సమావేశాలు, వివిధ సైడ్ ఈవెంట్లు ,ఒక మంత్రిత్వ సమావేశం నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు.

 

********



(Release ID: 1913250) Visitor Counter : 144