సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఈ సారి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నవారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాలనాయుగానికి చెందిన యువతని అదే తమకు బాగా కలిసివచ్చే అంశమని పేర్కొన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఉత్తర్ ప్రదేశ్, హాసన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మొదటిసారి ఓటర్లనుద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగం
నేడు మొదటిసారి ఓటు వేస్తున్నవారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయ్యే సమయానికి అంటే పాతిక సంవత్సరాలతర్వాత, కీలకమైన ఓటర్లుగా గుర్తింపు పొందుతారు. భారతదేశం ప్రగతిలో వారి పాత్ర వుంటుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
02 APR 2023 4:45PM by PIB Hyderabad
18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువతీ యువకులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాలనాయుగానికి చెందిన యువత అని, అదే తమకు బాగా కలిసి వచ్చే అంశమని, ప్రజల ఆశీస్సులో ముఖ్యమైన విషయమని శాస్త్ర సాంకేతిక వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లా హాసన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోబోతున్నవారితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ యువత మొదటిసారి తమ ఓటు వేయబోతున్నారని వారు శ్రీ మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఆశీస్సులందిస్తారని, తమ ప్రభుత్వం సంపూర్ణమైన ఆశావహ దృక్పథంతో, ప్రగతిశీలక పాలన అందిస్తోందని ఆయన అన్నారు. ఈ తరానికి గత రెండు తరాలకు మధ్యన పూర్తిగా తేడా వుందని గత రెండు తరాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిరాశ నిస్పృహల్లో జీవించారని ఆయన అన్నారు. గత రెండు తరాల యువతలో అనేక మంది విదేశాలకు వెళ్లిపోయారని, ఇండియాలో వుంటే భవిష్యత్తు వుండదని వారు భావించేవారని కేంద్ర మంత్రి అన్నారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. నేటి ఆత్మవిశ్వాసంతో వుందని, గతంలో విదేశాలకు వెళ్లిపోయినవారు సైతం ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నారని, ఇక్కడ అవకాశాలు వెతుక్కోవాలని చూస్తున్నారని ఆయన వివరించారు.
నేడు మొదటిసారి ఓటు వేస్తున్నవారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయ్యే సమయానికి అంటే పాతిక సంవత్సరాలతర్వాత, కీలకమైన ఓటర్లుగా గుర్తింపు పొందుతారని, భారతదేశం ప్రగతిలో వారి పాత్ర ప్రధానంగా వుంటుందని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
గతంలో యువతను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్న మాటల్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తు చేశారు. మొత్తం ప్రపంచమంతా భారతదేశ యువతవైపు చూస్తోందని, దేశ అభివృద్ధిలో యువత కీలకమని, ప్రపంచ అభివృద్ధిలో భారతదేశం కీలకంగా వుందని గతంలో ప్రధాని చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. భారతదేశం పారదర్శకంగా వుందని, ప్రగతిశీల భావాలను కలిగి వుందని, దేశ అభివృద్ధి నేటి యువత భుజస్కంధాలపై వుందని ఆయన అన్నారు.
గత 8 సంవత్సరాల్లో తమ ప్రబుత్వం చేపట్టిన పథకాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొననారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు యువతను కేంద్రంగా చేసుకున్నవని అన్నారు. యువత తమ ముందున్న అవకాశాలను దక్కించుకునేలా వున్నాయని అన్నారు. గెజిటెడ్ అధికారులు కాకుండా ఎవరికివారు స్వంతంగా ధృవీకరణ పత్రాన్ని ఇచ్చుకునేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అన్నారు.అంతే కాదు ఇంటర్వ్యూలను రద్దు చేయడం జరిగిందని తద్వారా ఉద్యోగాల నియామకంలో అక్రమాలు జరగకుండా చూస్తున్నామని అన్నారు.
2015 నాటి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సమయంలో ఎర్రకోట వేదిక మీదనుంచి మాట్లాడిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా నినాదమిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన కేంద్ర మంత్రి ప్రధాని దార్శనికతను కొనియాడారు. ఆయన ఇచ్చిన పిలుపుతో 2014లో 350 మాత్రమే వున్న స్టార్టప్ కంపెనీలు 2022 నాటికి 80 వేలు అయ్యాయయని అన్నారు. 85 యూనికార్న్ కంపెనీలు ( 1 బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీలు) తయారయ్యాయని అన్నారు. దాంతో నేటి యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి దేశ భవిష్యత్తుపట్ల ప్రత్యేక దార్శనికత వుందని, అందుకే ఆయన నూతన తరంపై ప్రత్యేక దృష్టి పెట్టి పాలన అందిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
*****
(Release ID: 1913249)
Visitor Counter : 161