పర్యటక మంత్రిత్వ శాఖ
రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకోసం సాహసోపేత కార్యక్రమాల పర్యాటకం అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ.
నేల, నీరు, ఆకాశం, గాలి అనే నాలుగు అంశాల ఆధారంగా సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంలో అనేక అవశాలున్నాయి: శ్రీ జి.కె.రెడ్డి
ప్రపంచ సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగ పటంలోని అగ్రగామి దేశాల సరసన భారతదేశాన్ని చేర్చడానికి భారతదేశ కృషి : జి.కె.రెడ్డి
Posted On:
01 APR 2023 8:08PM by PIB Hyderabad
కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న జి20 కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటైన రెండవ పర్యాటక రంగ వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశం సందర్భంగా సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపైన ప్రత్యేక ప్రతినిధులతో చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కీలక ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులకు సంప్రదాయ జానపద కళాకారులు స్వాగతం పలికారు. బ్రిటన్ , మెక్సికో, కెనడా, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌తోపాటు పలు అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతినిధులు అడ్వెంచర్ టూరిజం చర్చలో పాల్గొన్నారు. భారతదేశాన్నించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగాన్ని ఎలా ప్రోత్సహించాలి, దేశ విదేశాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి తదితర అంశాలను ఇందులో చర్చించారు.
ఈ సందర్భంగా కీలక ఉపన్యాస మిచ్చిన కేంద్ర సాంస్కృతి,పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నేల, నీరు, ఆకాశం, గాలి అనే నాలుగు అంశాల ఆధారంగా భారతదేశంలో అనేక సాహసోపేత కార్యక్రమాలను నిర్వహించడానికిగాను పలు అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. హిమాలయాల్లో 70శాతం భారతదేశంలోనే వున్నాయని, 7 వేల కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం భారత్ సొంతమని, 70 వేల కిలోమీటర్ల ఇసుక ఎడారి భారతదేశంలో వుందని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. కుఛ్, లద్దాహ్ లలోని ప్రత్యేక అటవీ ప్రాంతాలతోపాటు ఏడువందల అభయారణ్యాలు, జాతీయ పార్కులు, పులుల సంరక్షణ కేంద్రాలు భారత్ లోవున్నాయని మంత్రి వివరించారు.
భారతదేశంలో అడ్వెంచర్ టూరిజానికి దేశీయంగాను, విదేశీయులనుంచి చక్కటి ఆదరణ లభిస్తోందని కేంద్రమంతి తెలిపారు. వివిధ వయో వర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆయా రకాల సాహసోపేత పర్యాటక కా్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.
వివిధ రకాల సాహసోపేత కార్యక్రమాలను ప్రోత్సహించడానికిగాను, వాటిపట్ల అవగాహన పెంచడానికిగాను కేంద్రప్రభుత్వం పలు రకాల విధానపరమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలను తీసుకొని అమల్లో పెడుతోందని కేంద్రమంత్రి అన్నారు. పర్యాతారోహణ, క్యాంపుల ఏర్పాటు, బంగీ జంపింగ్, ట్రెక్కింగ్, స్కీయింగ్, స్కూబా డైవింగ్, అడవుల్లో సఫారీ యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు.
పర్యావరణ సంరక్షణకోసం సుస్థిరమైన జీవనవిధానంతో కూడిన మిషన్ లైఫ్ లక్ష్యాల సాధనకోసం భారతదేశం కట్టుబడి వుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులను ప్రోత్సహించడానికిగాను యూత్ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీటిద్వారా విద్యార్థుల్లో తగిన చైతన్యం తెస్తున్నామని భారతదేశ పర్యావరణం, సాంస్కృతిక, ఆధ్యాత్మకి వారసత్వం గురించి తెలియజేస్తూ వారిని బాధ్యతాయుతంగా వుండేలా తయారు చేస్తున్నామని అన్నారు. అడ్వెంచర్ టూరిజం విభాగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆయా పర్యాటక ప్రాంతాల నిర్వహణకు ఆర్ధిక సాయం, నైపుణ్య మానవనరుల తయారీ, భద్రత కల్పించడం, పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు, బ్రాండింగ్ మొదలైన అంశాల మీద దృష్టిపెట్టామని అన్నారు.
జాతీయ స్థాయిలో అడ్వెంచర్ పర్యాకరంగంపైనా వ్యూహాత్మక విధానాన్ని తయారు చేశామని దాని ద్వారా ఈ రంగంలోని పలు అంశాలపైన దృష్టి పెట్టామని అన్నారు. ఆయా ప్రాంతాలకు ర్యాంకులివ్వడం, చట్టాల అమలు, భారీ స్థాయిలో కార్యక్రమాలు, మార్గదర్శకాలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రక్షించే బృందాలు, ప్రత్యేకమైన వెబ్ సైట్, సోషల్ మీడియా పేజీల తయారీ మొదైలనవాటిపైన ఆయన మాట్లాడారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంలో ప్రపంచంలోనే భారతదేశం ముందుభాగంలో వుండేలా మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను నెలకొల్పుతున్నామని మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా జి20 ప్రధాన సమన్వయకర్త శ్రీ హర్ష శ్రింగాలా మాట్లాడుతూ ప్రకృతికి దగ్గరగా సుస్థిర పద్ధతుల్లో నివసిస్తున్న ప్రజలను ఈ కార్యక్రమాలద్వారా చూడవచ్చని వారి గురించి తెలుసుకోవచ్చని అన్నారు. దేశంలోని ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించే జి 20 ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోని పర్యాటక సామర్థ్యం గురించి తెలుసుకుంటారని అన్నారు.
భారతదేశ అభివృద్ధికి వాణిజ్యం, సాంకేతికత రంగాలతోపాటు పర్యాటక రంగం దోహదం చేస్తుందని ప్రధాని పదే పదే చెబుతున్నారని శ్రీ హర్ష శ్రింగాలా అన్నారు. వాతావరణ పరంగా తీసుకున్నప్పుడు భారతదేశానికి ఖండానికి వుండాల్సిన లక్షణాలున్నాయని అపారమైన పర్యాటక సామర్థ్యం భారత్ సొత్తని అన్నారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటక పరంగా భారతదేశ విశేషాలను వివరించారు. జి20 అధ్యక్షస్థానంలో వున్న భారతదేశం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదాన్ని వినిపిస్తోందని అన్నారు.
పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో జి20 స్థాయిలో జరుగుతున్న చర్చలు ప్రపంచదేశాలకు ఉపయోగపడతాయని శ్రీ శ్రింగాల అన్నారు.
ముగింపు ప్రసంగం చేసిన పర్యాటక రంగ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అడ్వెంచర్ పర్యాకరంగ చర్చలు దోహదం చేస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న ప్రతినిధులు సాహసోపేత కార్యక్రమాల పర్యాటక రంగ విజయాలు, విధానాలు, అవకాశాల గురించి లోతుగా చర్చించారు.
సిలిగురిలో ఏర్పాటు చేసిన రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో 130మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధులకోసం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాల్ పాటలు, గిరిజన నృత్యాలు, సంప్రదాయా తప్పా నృత్యం, తమాంగ్ జానపద నృత్యం, చాహు నృత్యం, భారత సైనికుల పైప్ బ్యాండ్ మొదలైన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
ఆయుష్ మంత్రిత్వశాఖ సమన్వయంతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
స్థానిక కళల్ని, కళారంగ ఉత్పత్తుల్ని ఈ సమావేశ ప్రతినిధులకు పరిచయం చేయడం జరుగుతుంది. కేంద్ర పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా షాపులు నెలకొల్పుతారు. ప్రతినిదులు స్వయంగా పాల్గొని ఆయా కళాఖండాల తయారీ అనుభవాన్ని పొందుతారు. దీనికోసం డూ ఇట్ యువర్ సెల్ఫ్..మీకై మీరు తయారు చేయండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డార్జలింగ్ లోని హిమాలయా పర్వతారోహణ కేంద్రం తమ సామగ్రిని ప్రదర్శిస్తుంది.
ఈ సమావేశానికి వస్తున్నప్రతినిధులకు ఓడిఓపి జాబితానుంచి ఎంపిక చేసిన జ్ఞాపికలను అందించడం జరుగుతుంది. ఇందులో బుర్ధ్వాన్ జిల్లాకు చెందిన వుడన్ వూల్, బంకూరా జిల్లాకు చెంది డోక్రా జిఐ హక్కు ఫిష్, మాల్డా జిల్లాకు చెందిన బంగ్లాశ్రీ సిల్క్ ప్యాకెట్ స్వ్కేర్ మొదలైనవి వున్నాయి.
ఈ మధ్యకాలంలో సాహసోపేత కార్యక్రమాలకు సంబంధించిన పర్యాటక విభాగానికి ఇంటా బైటా ఆదరణ లభిస్తోంది. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర పర్యాటకశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ రంగానికి సంబంధించిన పలువురు నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారు. అడ్వెంచర్ టూరిజంకు సంబంధించిన అంతర్జాతీయ, దేశీయ అభిప్రాయాలను వెల్లడిస్తారు.
జి20కి భారతదేశం అధ్యక్షస్థానంలో వుంది. దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించడానికిగాను ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 3నుంచి 5వరకు వుంటుంది. అడ్వెంచర్ టూరిజం కింద సుస్థిర అభివృద్ధి విధానాలను వివరిస్తారు. సిలిగురినుంచి ఏప్రిల్ 2న హిమాలయన్ డ్రైవ్ కార్ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
గుజరాత్ లోని రాన్ ఆఫ్ కఛ్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 7నుంచి 9వరకూ టూరిజం వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పర్యావరణ హిత పర్యాటకం, డిజిటలీకరణ, నైపుణ్యాలు, పర్యాటకరంగ ఎంఎస్ ఎం ఈలు, పర్యాటక కేంద్ర నిర్వహణ మొదలైన ఐదు అంశాలను చర్చించారు. వాటికి జి20 సభ్యదేశాల ప్రతినిధులు సంఘీభావం పలికారు. రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఐదు ప్రాధాన్యత అంశాలపైన చర్చలుంటాయి. విస్తృతంగా చర్చిస్తారు. తద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూప్ అవుట్ కమ్ డాక్యుమెంటును రూపొందిస్తారు. పర్యాటక రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన రోడ్డుమ్యాపును కార్యాచరణ విధానాన్ని తయారు చేస్తారు. ఈ సమావేశాల్లో ట్రావెల్ ఫర్ లైఫ్ కార్యక్రమాన్ని పరిచయం చేస్తారు. మానవత కేంద్ర ప్రపంచీకరణ సాధనకోసం గౌరవనీయులైన ప్రధాని దార్శనికత ప్రకారం ఈ రంగంలో నూతన విధానాలకోసం పర్యాటక వర్కింగ్ గ్రూప్ పని చేస్తోంది.
జి20 అధ్యక్షస్థానంలో వున్న భారతదేశం దేశవ్యాప్తంగా 59 నగరాల్లో 200 సమావేశాలను నిర్వహిస్తున్నారు. భారతదేశ భౌగోళిక, అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ నగరాలు చాటుతున్నాయి కాబట్టే వీటిని ఎంపిక చేశారు.
***
(Release ID: 1913088)
Visitor Counter : 208