ఉక్కు మంత్రిత్వ శాఖ

ఆర్ధిక సంవ‌త్స‌రం 2022-23లో మునుపెన్న‌డూ లేనంత అత్యుత్త‌మ వార్షిక ఉత్ప‌త్తిని సాధించిన సెయిల్

Posted On: 01 APR 2023 5:06PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐఎల్ - సెయిల్‌) 31 మార్చి 2023తో అంత‌మ‌య్యే ఆర్థిక సంవ‌త్స‌రం 2022-23లో అత్యుత్తమ వార్షిక ఉత్ప‌త్తిని సాధించింది. 
ఈ కాలంలో కంపెనీ 19.409 మిలియ‌న్ ట‌న్నుల (ఎంటి)ల  ద్ర‌వీభూత లోహం (హాట్ మెట‌ల్‌)ను, 18.289 ఎంటీల ముడి ఉక్కు ఉత్ప‌త్తిని సాధించింది. ఇది గ‌తంలో సాధించిన ఉత్త‌మ ఉత్ప‌త్తిక‌న్నా వ‌రుస‌గా 3.6%, 5.3% ఎక్కువ  గ‌త కొన్ని ఏళ్ళుగా మ‌రింత విలువ‌ను జోడించ‌డం, ప్ర‌త్యేక ఉక్కు ర‌కాల‌ను ఉత్ప‌త్తిపై దృష్టిని పెట్టి త‌న ఉత్ప‌త్తిని నిరంత‌రం పెంచుతూ వ‌స్తోంది.

 

***



(Release ID: 1913080) Visitor Counter : 159