శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్న భారతదేశ స్టార్టప్‌లు
Posted On:
31 MAR 2023 2:20PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెన్స్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత);ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఈ రోజు భారతదేశ స్టార్టప్‌లు మరియు ఆర్ అండ్ డి ఫలితాలు ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని అలాగే ప్రపంచంతో సమానంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచంలోనే # గ్లోబల్ ర్యాంకింగ్‌ను సాధించిందని తెలిపారు.
న్యూఢిల్లీలో శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీరామకృష్ణ పరమహంస గ్రాంట్స్ అవార్డు వేడుకలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.
సమిష్టి ప్రయత్నాల ప్రయోజనాలను పొందేందుకు అకాడెమియా, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు మరియు పరిశ్రమల వంటి అన్ని వాటాదారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధిలో భారతదేశం ముందుండాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం 2025 నాటికి టీబీ రహిత భారత్ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బయోటెక్నాలజీ విభాగం ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసింది.
గత మూడు నుండి ఐదు దశాబ్దాలలో భారతదేశం అంటువ్యాధి నుండి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు మారిందని అన్నారు. "గర్భధారణ సమయంలో మధుమేహం నిర్వహణ డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు ఒక సమూహంచే రూపొందించబడ్డాయి"అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
వర్ధమాన శాస్త్రవేత్తలకు గుర్తింపు ఇచ్చినందుకు శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను అభినందిస్తూ పాశ్చాత్య దేశాలకు భిన్నంగా దాతృత్వ సంస్కృతి భారతదేశంలో ఇంకా పుంజుకోలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఆర్ అండ్ డిలో మరింత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ఆయన సూచించారు.
విశిష్ట వృత్తిదారులు సమాజానికి తిరిగి అందించడం సమాజానికి కొంత ప్రయోజనం చేకూర్చడానికి మించిన గొప్ప పని లేదని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ బయోమెడికల్ సైన్సెస్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లో పరమహంస గ్రాంట్స్ అవార్డులను ప్రదానం చేశారు.
*****
(Release ID: 1912563)
Visitor Counter : 223