సహకార మంత్రిత్వ శాఖ

ఉత్తరాఖండ్ లో మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల కంప్యూటరీకరణతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" మంత్రం ద్వారా దేశంలో అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టారు.

ప్రlధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ నాయకత్వంలో, 2021, అక్టోబర్ 30న దేశంలోనే మొదటిసారిగా, ఉత్తరాఖండ్ లో పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ
పనులు మొదలుపెట్టారు. ఈ రోజు రాష్ట్రంలోని 670 పీఏసీఎస్ ల
కంప్యూటరీకరణ పూర్తయింది.

పిఏసీఎస్ ల కంప్యూటరీకరణ వల్ల వ్యవస్థలో పూర్తి పారదర్శకత వస్తుంది; ఆడిట్ కూడా ఆన్ లైన్ లోనే
జరుగుతుంది; ఇది పీఏసీఎస్ ల ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుస్తుంది;
.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, సహకార మంత్రిత్వ శాఖ చొరవతో, సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సంఘాలకు చెందిన సుమారు 10 కోట్ల మంది పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి ఇచ్చేస్తూ సుప్రీంకోర్టు నిన్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ మార్కెటింగ్, రైతుల ఉత్పత్తుల ఎగుమతి కోసం జాతీయ సహకార విశ్వవిద్యాలయం, జాతీయ సహకార విధానం , సహకార డేటాబేస్, మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేస్తోంది.

పీఏసీఎస్ లను బహుళార్ధసా

Posted On: 30 MAR 2023 6:07PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లోని మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు (ఎంపీఏసీఎస్), జాయింట్ కోఆపరేటివ్ ఫార్మింగ్, జన సువిధ కేంద్రాలు, జనౌషధి కేంద్రాల కంప్యూటరీకరణను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు హరిద్వార్ లో ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామితో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Description: C:\Users\HP\Downloads\IMG_3660.jpeg

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2021 అక్టోబర్ 30న దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్ ) కంప్యూటరీకరణ పనులు మొదలయ్యాయని, ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం 670 పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ

పూర్తయిందని శ్రీ అమిత్ షా తమ  ప్రసంగంలో తెలిపారు.

 

ఎంపీఏసీఎస్ కోసం మోడల్ బైలాస్ ను కొంతకాలం క్రితమే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపామని, ఉత్తరాఖండ్ లో 95 ఎంపీఏసీల ఏర్పాటు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. దీనితో పాటు, సహకార సంఘాల కింద 95 జన ఔషధి కేంద్రాలు , జన సువిధ కేంద్రాలను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని శ్రీ షా చెప్పారు.

Description: C:\Users\HP\Downloads\IMG_3760.jpeg

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి " అనే దార్శనికతతో దేశంలో ఒక ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

సహకార మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలోని మొత్తం 65,000 క్రియాశీల పిఎసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రారంభమైంది. 307 జిల్లా సహకార బ్యాంకులతో పాటు పలు సౌకర్యాలను కంప్యూటరీకరణ చేశామన్నారు. ఈ రోజు 307 సహకార బ్యాంకు శాఖలు, 670 ఎంపిఎసిఎస్ ల కంప్యూటరీకరణను పూర్తి చేయడం ద్వారా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహకార రంగంలో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించిందని శ్రీ షా తెలిపారు. కంప్యూటరీకరణ వల్ల వ్యవస్థలో పూర్తి పారదర్శకత వస్తుందని, ఆడిట్ ఆన్ లైన్ లో జరుగుతుందని, దీనివల్ల పీఏసీఎస్ ల ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుందని అన్నారు. 95 జన సువిధ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 300కు పైగా పథకాలను నేరుగా గ్రామాలకు చేరవేస్తామని చెప్పారు. సహకార జన ఔషధి కేంద్రాల ద్వారా 50 నుంచి 90 శాతం చౌక మందులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉత్తరాఖండ్ లోని 95 డెవలప్ మెంట్ బ్లాక్ లలో ఇంటిగ్రేటెడ్ కలెక్టివ్ కోఆపరేటివ్ ఫార్మింగ్ నమూనాను ఈ రోజు ప్రారంభించినట్లు శ్రీ షా తెలిపారు.

 

Description: C:\Users\HP\Downloads\IMG_3741.jpeg

 

సహకార మంత్రిత్వ శాఖ చొరవతో సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సంఘాల్లో తమ డబ్బును డిపాజిట్ చేసిన సుమారు 10 కోట్ల మంది డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించించిన విషయాన్ని శ్రీ అమిత్ షా ప్రస్తావించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో సహారా గ్రూప్ లోని ఇన్వెస్టర్లందరికీ వారి సొమ్ము తిరిగి వస్తుందని ఆయన అన్నారు. సహారా గ్రూప్ ఇన్వెస్టర్లందరూ తమ దరఖాస్తులను సెంట్రల్ రిజిస్ట్రార్ కు పంపవచ్చని, వెరిఫికేషన్ తర్వాత 3-4 నెలల్లో తమ డబ్బును తిరిగి పొందవచ్చని శ్రీ షా తెలిపారు.

 

Description: C:\Users\HP\Downloads\IMG_3767.jpeg

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" మంత్రం ద్వారా అనేక కొత్త చర్యలను తీసుకున్నారని సహకార మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ కో ఆపరేటివ్ యూనివర్సిటీ, నేషనల్ కో-ఆపరేటివ్ పాలసీ, కో-ఆపరేటివ్ డేటాబేస్ ను రూపొందిస్తోందని ఆయన చెప్పారు. వీటితోపాటు విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ మార్కెటింగ్, రైతుల ఉత్పత్తుల ఎగుమతుల కోసం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో నల్ సే జల్ (కుళాయి నుంచి నీరు) పథకాన్ని పీఏసీఎస్ లకు అప్పగిస్తామని, కేంద్ర ప్రభుత్వం పంపిన బహుముఖ పీఏసీఎస్ ల మోడల్ బైలాస్ లో పీఏసీఎస్ లు కూడా గ్రామానికి నీటిని అందించగలుగుతాయని తెలిపారు.

ఇప్పుడు పీఏసీఎస్ లు అనేక రకాల పనులు చేయగలవని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా చిన్న భూ కమతాలు ఉన్న అనేక మంది సన్నకారు రైతులను అనేక రకాల వ్యాపారాలతో అనుసంధానించారని

చెప్పారు. పీఏసీఎస్ లను బహుళార్ధసాధకంగా మార్చడం ద్వారా సహకార సంఘాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలమైన చర్య తీసుకున్నారని తాను  విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను శ్రీ పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేసిందని, ఇది దేవభూమిలోని చిన్న రైతులకు ప్రయోజనం చేకూర్చిందని

అన్నారు.

Description: C:\Users\HP\Downloads\IMG_3818.jpeg

 

*****



(Release ID: 1912363) Visitor Counter : 120