గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“స్వచ్ఛోత్సవ్ 2023- అక్టోబర్ 2024 నాటికి 1000 నగరాలను 3-స్టార్ చెత్త రహిత నగరాలుగా మార్చాలన్నది లక్ష్యం” ~హర్దీప్ ఎస్. పూరి
స్వచ్ఛోత్సవ్: పట్టణ పరిశుభ్రతలో నాయకత్వం వహిస్తున్న 4,00,000 మంది
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రచారం
పట్టణ భారత్ బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్)గా మారింది
Posted On:
30 MAR 2023 10:47AM by PIB Hyderabad
అక్టోబర్ 2024 నాటికి 1000 నగరాలను చెత్త రహిత 3-స్టార్ నగరాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి చెప్పారు. న్యూ ఢిల్లీలో అంతర్జాతీయ జీరో వేస్ట్ డే 2023 సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యుఎల్‌బిల మధ్య పోటీతత్వం, మిషన్-మోడ్ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి జనవరి 2018లో ప్రారంభించిన జిఎఫ్‌సి-స్టార్ రేటింగ్ ప్రోటోకాల్‌లో పురోగతిని వివరించారు. సర్టిఫికేషన్... ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిందన్నారు. దేశం నలుమూలల ఉన్న 'స్వచ్ఛతా దూత్స్' తో అయన సంభాషించారు. సమాజంలో పరివర్తన కలిగించే నాయకులుగానే కాకుండా సవాళ్ళను కూడా జీవనోపాధి అవకాశాలుగా మార్చుకున్నారని మంత్రి వారిని అభినందించారు.
మిషన్ విజయాల గురించి మంత్రి మాట్లాడుతూ, పట్టణ భారతదేశం బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడిఎఫ్) మారిందని, మొత్తం 4,715 పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్‌బిలు) పూర్తిగా ఓడిఎఫ్‌గా ఉన్నాయని తెలిపారు. 3,547 యుఎల్‌బిలు... క్రియాశీలకంగా, పరిసరాలు పరిశుభ్రంగానూ, 1,191 యుఎల్‌బిలు ఓడిఎఫ్+గా ఉన్నాయని తెలియజేశారు. ఇంకా, భారతదేశంలో వ్యర్థాల ప్రాసెసింగ్ 2014లో 17% నుండి 75%కి నాలుగు రెట్లు పెరిగింది. 97% వార్డులలో 100% ఇంటింటికీ చెత్త సేకరణ, దేశంలోని అన్ని యుఎల్‌బిలలోని దాదాపు 90% వార్డులలో పౌరులు వ్యర్థాలను తొలి స్థాయిలోనే వేరు చేయడం ద్వారా ఇది సహాయపడింది.
ఎస్బిఎంయు-యు లక్ష్యాలను సాధించడంలో చూపిన సంకల్పం, రెండవ దశ మిషన్ ( ఎస్బిఎంయు-యు 2.0)లో అనేక రెట్లు విస్తరిస్తున్నామని శ్రీ పూరి విశ్వాసం వ్యక్తం చేశారు, ఇక్కడ భారతదేశం చెత్త రహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగ విధానాలలో మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వ్యర్థాల ఉత్పత్తిని పెంచుతున్నందున, దేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించడంలో 'చెత్త రహిత నగరాలు' ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
స్వచ్ఛత ఇప్పుడు జన ఆందోళన్, పౌరుల నుండి అద్భుతమైన మద్దతును అందుకుంటుంది. మిషన్ దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పౌరులను పరిశుభ్రంగా, పచ్చగా, చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో సమీకరించింది. పట్టణ స్వచ్ఛత దిశగా సానుకూల అడుగులు వేసిన యువకులు, మహిళా నాయకులు పెద్దఎత్తున సమీకరించడానికి ఈ ప్రచారాలు దోహదం చేసాయి. నగరాలను చెత్త రహితంగా మార్చే ప్రయత్నాలు మార్చి 7వ తేదీన కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి స్వచ్ఛోత్సవ్ 2023 ప్రారంభించడంతో కొత్త ఊపును అందుకున్నాయి.'చెత్త రహిత నగరాలు 2023' లక్ష్యాన్ని సాధించేందుకు మహిళల భాగస్వామ్యం, నాయకత్వాన్ని పెంచడం ఈ ప్రచారం లక్ష్యం. 'చెత్త రహిత నగరాల' నిర్మాణం దిశగా 8 మార్చి, 2023 నుండి నగరాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛోత్సవ్ ప్రచారం 4,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు పట్టణ పరిశుభ్రతలో నాయకత్వ పాత్ర పోషించడానికి ఒక వేదిక..
గౌరవనీయులైన ప్రధాన మంత్రి స్వచ్ఛ్ భారత్ మిషన్- అర్బన్ 2.0ని ప్రారంభించారు, "చెత్త రహిత నగరాలు" (జిఎఫ్ సి)గా మార్చాలనే దృష్టితో, సంపూర్ణ పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ పర్యావరణ వ్యవస్థ వైపు భారతదేశాన్ని అభివృద్ధి పథంలోతీసుకెళ్తోంది. డోర్-టు-డోర్ కలెక్షన్ సాధించడం, సోర్స్ సెగ్రిగేషన్, వేస్ట్ ప్రాసెసింగ్, డంప్‌సైట్ రెమెడియేషన్, కెపాసిటీ బిల్డింగ్, డిజిటల్ ట్రాకింగ్ మొదలైనవి జిఎఫ్ సి ని రూపొందించడంలో భాగాలు. భారతదేశం కూడా బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం, జీరో-వేస్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. క్లోజ్డ్, సర్క్యులర్ సిస్టమ్‌లో ఉత్పత్తులను విసర్జించడం ప్రధానంగా చేపట్టింది. 'చెత్త రహిత నగరాల కోసం ర్యాలీ'ని జన్ ఆందోళన్‌కు మహిళలు నాయకత్వం వహించారని మంత్రి ప్రశంసించారు, ఇందులో లక్షలాది మంది పౌరులు తమ వీధులు, పరిసరాలు, పార్కులను శుభ్రపరిచే బాధ్యతను తీసుకున్నారు.
ఎంఓహెచ్యుఏ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, వ్యర్థాల నిర్వహణలో సర్క్యులారిటీని నిర్ధారించడంలో, వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే జీరో-వేస్ట్ విధానాన్ని అమలు చేయడంలో మహిళా నాయకత్వం పాత్రను ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాలను వృత్తిపరమైన స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు, తద్వారా ఈ సమూహాలకు అధిక ఆదాయాన్ని అందించవచ్చు. ఇంకా, ‘విమెన్-ఇన్ గార్బేజ్ మేనేజ్‌మెంట్’ నుండి ‘మహిళల నేతృత్వంలోని చెత్త రహిత నగరాలు’ వరకు మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణంగా ఆశించిన ఫలితాలను చూపుతున్నాయి.
కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్లు, కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు, వారు చెత్త రహిత నగరాల్లో సర్క్యులారిటీ, మహిళలు, యువత, భాగస్వామ్యం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీహార్, జార్ఖండ్, యుపి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు తమ ఉత్తమ అభ్యాసాలను, విజయగాథలను పంచుకున్నారు.
****
(Release ID: 1912247)
Visitor Counter : 204