మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పిఎం పబ్లిక్ డవలప్మెంట్ ప్రోగ్రాం
Posted On:
29 MAR 2023 5:07PM by PIB Hyderabad
సమాజంలోని వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేకించి మైనారిటీలు, బలహీనవర్గాలు,సమాజంలోని పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కేంద్ర నైపుణ్యాభివృద్ధి,
ఎంటర్ప్రెన్యుయర్షిప్ మంత్రిత్వశాఖ , టెక్స్టైల్స్, సాంస్కృతిక మంత్రిత్వశాఖ, మహిళ,శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నది.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ , కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన 6 మైనారిటీ కమ్యూనిటీల అభ్యున్నతికి , వారి సామాజిక, ఆర్ధిక ప్రగతి, సామాజిక సాధికారత కోసం కృషిచేస్తోంది.
ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె) .ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఇది ఆయా ప్రాంతాల అభివృధ్ధి కార్యక్రమం. దీని ద్వారా కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు, ఎంపిక చేసిన ప్రాంతాలలో
మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల ద్వారా నిధుల దామాషాలో దీనిని అమలు చేస్తారు. దీనిని సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
అమలు చేసి, నిర్వహిస్తాయి. ఈ పథకం కింద చేపట్టిన మౌలిక సదుపాయాలను ఆ ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలందరికోసం ఉపయోగిస్తారు. ఈ పథకాన్ని 2022–23 ఆర్ధిక సంవత్సరం నుంచి సవరించిన మార్గదర్శకాలతో ఆమోదించారు.
దేశంలోని అన్ని జిల్లాలలో 15 వ ఆర్ధిక సంఘం కాలంలో దీనిని అమలు చేస్తారు.పి.ఎం.జె.వి.కె కి సంబంధించి సంవత్సరాల వారీగా, రాష్ట్రాల వారీగా నిధుల విడుదల గురించి న వివరాలు www.minorityaffairs.gov.in వెబ్ సైట్ లో ఉన్నాయి.
ఈ పథకం, కార్యక్రమాన్ని మంత్రిత్వశాఖ ఈ కింది విధంగా అమలు చేస్తుంది.
ఎ) విద్య సాధికారత పథకాలు
1) ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
2) పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
3) మెరిట్ కమ్ మీన్స్ ఆధారిత స్కాలర్షిప్ పథకం
బి) ఉపాధి, ఆర్దిక సాధికారత పథకాలు
4)ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పిఎం వికాస్)
5) మైనారిటీలకు రాయితీలపై రుణాల మంజూరుకు మైనారిటీల అభివృద్ధి , ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ఎండిఎఫ్సి)కి ఈక్విటీ
సి) స్పెషల్ పథకాలు
6) జియో పార్సి: ఇండియాలో పారసీల జనాభా తగ్గుముఖం పట్టకుండా చర్యలు
7) క్వామి వక్ఫ్ బోర్డ్ తరాకియాతి పథకం (QWBTS) అలాగే సహారి వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన (SWSVY).
8)అభివృద్ధి పథకాలకు సంబంధించి పరిశోధన, అధ్యయనాలు, ప్రచారం, పర్యవేక్షణ, విశ్లేషణ , పబ్లిసిటీ
డి. మౌలిక సదుపాయాల అభివృద్ది పథకాలు
9) ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె)
పైన పేర్కొన్న అన్ని పథకాలు ప్రభుత్వ వెబ్ సైట్ www.minorityaffairs.gov.in లో ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాని, రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1912140)