రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ముగిసిన భారత్-ఆఫ్రికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘అఫిండెక్స్-23’


- పూణేలోని ఔంధ్ ప్రాంతంలో గత ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో ముగిసిన కార్యక్రమం

Posted On: 29 MAR 2023 3:35PM by PIB Hyderabad

భారత్-ఆఫ్రికా రెండో విడత సంయుక్త సైనిక  విన్యాసం  “ఆఫ్రికా-ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ (‘అఫిండెక్స్-23’)”  ఈరోజు పూణేలోని ఔంద్‌లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో ముగిసింది. ‘అఫిండెక్స్-23’ 2023 మార్చి 16 నుండి 29 వరకు జరిగింది. 124 మంది ఇందులో పాల్గొన్నారు. ఆఫ్రికా ఖండంలోని మొత్తం 25 దేశాలు మరియు సిఖ్, మరాఠా మరియు మహర్ రెజిమెంట్‌లకు చెందిన భారతీయ దళాలు బహుళజాతి సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఆఫ్రికన్ ఆర్మీల చీఫ్‌లు మరియు ప్రతినిధులతో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ విన్యాసపు కాన్క్యేవ్ ముగింపు  కారక్యక్రమంలో పాల్గొన్నారు.  యుఎన్ ఆదేశం ప్రకారం హ్యుమానిటేరియన్ మైన్ యాక్షన్ మరియు పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌ను అమలు చేస్తున్నప్పుడు సానుకూల సైనిక సంబంధాలను నిర్మించడం, ఒకరికొకరు ఉత్తమ పద్ధతులను గ్రహించడం మరియు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ సైనిక విన్యాసం లక్ష్యం. ఈ జాయింట్ ఎక్సర్ సైజ్ సైన్యాలు వివిధ ప్రజా భద్రత సంక్షేమ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చేపట్టే పద్ధతులు మరియు వ్యూహాలను నేర్చుకునేందుకు మరియు అవలంబించడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా ఈ వ్యాయామం శాంతి భద్రతల కార్యకలాపాలను చేపట్టేటప్పుడు ఎంగేజ్‌మెంట్‌ల నియమాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో బలగాలకు దోహదం చేస్తుంది. ఈ విన్యాస సమయంలో ఏర్పడిన బోన్‌హోమీ, ఎస్పిరిట్-డి-కార్ప్స్ మరియు సద్భావనలు పరస్పరం సంస్థ మరియు వివిధ కార్యకలాపాలను నిర్వహించే పద్ధతిని అర్థం చేసుకోవడం ద్వారా సైన్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడంలో దోహదం చేస్తాయి. ఈ వ్యాయామం భవిష్యత్తులో భారత & ఆఫ్రికన్ సైన్యాల మధ్య మరింత సహకారానికి దూతగా నిలుస్తుంది.  ఈ సైనిక విన్యాసంలో భాగంగా 'మేక్ ఇన్ ఇండియా' కింద తయారు చేసిన 32 పరిశ్రమల నుండి 75 స్వదేశీ ఉత్పత్తులతో చేపట్టిన 'పరికరాల ప్రదర్శన' నిర్వహించబడింది. ఆఫ్రికన్ ఆర్మీ చీఫ్‌లు, చీఫ్‌ల ప్రతినిధులు మరియు ఆఫ్రికన్ దేశాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1912048) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Marathi