బొగ్గు మంత్రిత్వ శాఖ
భారత ఆర్థిక వృద్ధిలో బొగ్గు రంగం సహకారం కీలకం- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
బొగ్గు ఉత్పత్తి ఈసారి 14% వృద్ధితో 880 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది-మంత్రి ప్రహ్లాద్ జోషి
7వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన బొగ్గు మంత్రిత్వ శాఖ; ఆఫర్‌లో 106 బొగ్గు బ్లాక్‌లు
Posted On:
29 MAR 2023 4:57PM by PIB Hyderabad
వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి భారతదేశ ఇంధన భద్రతను మరింతగా నిర్ధారించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ దేశంలోని బొగ్గు రంగాన్ని కోరారు. బొగ్గు మంత్రిత్వ శాఖ 7వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభోత్సవం మరియు 6వ రౌండ్ వేలంలో విజయవంతమైన బిడ్డర్‌లతో ఒప్పందాలపై సంతకాలు చేయడం కోసం ఈరోజు ఇక్కడ బొగ్గు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ విజయవంతమైన కృషిని అభినందించారు. దేశంలో బొగ్గు బ్లాకుల ఆన్‌లైన్ వేలం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టే గమ్యస్థానంగా మార్చాయని ఆయన తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బొగ్గు, గనులు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. 14% పెరుగుదలతో ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 880 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని మరియు ఆఫ్ టేక్ 900 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విభిన్న సంస్కరణలను స్పృశిస్తూ.. ప్రత్యేకంగా క్యాప్టివ్/వాణిజ్య గనుల నుండి బొగ్గు ఉత్పత్తి మొదటిసారిగా 100 మిలియన్ టన్నులు దాటిందని శ్రీ జోషి వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు రంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని మంత్రి తెలిపారు. 2025-2026 నాటికి థర్మల్ బొగ్గు ఉత్పత్తి మరియు ఎగుమతిని మరింత పెంచేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బొగ్గు గనుల వేలంలో మరింత చురుగ్గా పాల్గొనాలని ప్రైవేట్ రంగానికి పిలుపునిస్తూ, బొగ్గును ముందస్తుగా ఉత్పత్తి చేయడానికి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోత్సాహకాలను శ్రీ జోషి హైలైట్ చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన బొగ్గు, గనులు & రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దాన్వే..విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోందని, ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు బొగ్గు రంగం పనితీరు చాలా కీలకమని సూచించారు.
ఈ కార్యక్రమంలో బొగ్గు కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా మరియు అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ శ్రీ ఎం నాగరాజు ప్రసంగిస్తూ స్థిరమైన బొగ్గు ఉత్పత్తిని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన విభిన్న కార్యక్రమాలను హైలైట్ చేశారు. వాణిజ్య వేలం పోటీ, మూలధన పెట్టుబడి, అత్యాధునిక సాంకేతికత వినియోగం మరియు మెరుగైన భాగస్వామ్యం చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు 7వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 106 బొగ్గు బ్లాకులు ఆఫర్‌లో ఉన్నాయి.ఇవి సిఎంఎస్‌పి చట్టం మరియు ఎంఎండీఆర్ చట్టం ప్రకారం బొగ్గు గనుల మిశ్రమం అందించబడిన గనులు. ఈ 106 బొగ్గు గనులలో 101 గనులు సిఎంఎస్‌పి/ఎంఎండీఆర్ చట్టం కింద 17/7వ విడత కింద వేలం వేయబడుతున్నాయి. సిఎంఎస్‌పి/ఎంఎండీఆర్ చట్టం ప్రకారం 16వ/6వ విడతలో 2వ ప్రయత్నం కింద 5 బొగ్గు గనులు అందించబడుతున్నాయి. 17వ/7వ విడత కింద అందించబడుతున్న 101 బొగ్గు గనులలో 32 కొత్త బొగ్గు గనులు మరియు 69 గనులు మునుపటి విడతల నుండి రోల్ ఓవర్ చేయబడుతున్నాయి.వీటితో పాటు సిఎంఎస్‌పి/ఎంఎండీఆర్ చట్టం కింద 16వ/6వ విడతలో 2వ ప్రయత్నంలో ఐదు బొగ్గు గనులు కూడా ప్రారంభించబడుతున్నాయి. ఇక్కడ మొదటి ప్రయత్నంలో ఒకే బిడ్లు వచ్చాయి.
వేలం వేయబడుతున్న గనులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు మరియు బీహార్ వంటి బొగ్గు/లిగ్నైట్ బేరింగ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి.
6వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలం కింద వేలం వేయబడిన 29 బొగ్గు గనులకు మంత్రిత్వ శాఖ ఒప్పందాలపై సంతకం చేసింది. 29 బొగ్గు గనుల సంచిత పిఆర్‌సి 74 ఎంటిపిఏ. ఈ గనుల కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఈ బొగ్గు గనుల పిఆర్‌సి ప్రకారం వార్షిక ఆదాయం రూ.14,497 కోట్లుగా లెక్కించబడ్డాయి. అలాగే సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది.
టెండర్ డాక్యుమెంట్ అమ్మకం ప్రారంభం ఈరోజు అనగా మార్చి 29, 2023 నుండి ప్రారంభమవుతుంది. గనుల వివరాలు, వేలం నిబంధనలు, టైమ్‌లైన్‌లు మొదలైనవాటిని ఎంఎస్‌టిసీ వేలం ప్లాట్‌ఫారమ్‌లో పొందవచ్చు. వేలం శాతాన్ని రెవెన్యూ వాటా ఆధారంగా పారదర్శకంగా రెండు దశల ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
వాణిజ్య బొగ్గు గనుల వేలం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏకైక లావాదేవీ సలహాదారు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వేలం ప్రక్రియను నిర్వహించడంలో మంత్రిత్వ శాఖకు సహకరిస్తోంది.
****
(Release ID: 1912039)
Visitor Counter : 176