శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"జనపనార, రేగు, అవిసె లాంటి వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించి నూలు ఉత్పత్తి, వాణిజ్యీకరణ కోసం న్యూఢిల్లీకి చెందిన మెసర్స్ సాహి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు సహకారం అందించనున్న టీబీటీ-డి ఎస్ టి "
"వ్యర్థరహిత నగరాల అభివృద్ధి కోసం పారిశ్రామిక జనపనార నుంచి నూలు ఉత్పత్తి, వాణిజ్యీకరణ కోసం సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి కోసం నిధులు సమకూర్చనున్న టీబీటీ-డి ఎస్ టి "
" బహుళ వినియోగం కోసం పారిశ్రామిక వ్యర్థాలు ఉపయోగించి నూలు ఉత్పత్తి చేయనున్న ఢిల్లీకి చెందిన మరో అంకుర సంస్థకి నిధులు విడుదల చేయనున్న టీబీటీ-డి ఎస్ టి "
Posted On:
29 MAR 2023 10:32AM by PIB Hyderabad
స్వచ్ఛభారత్ మిషన్- అర్బన్ 2.0 కింద వ్యర్థరహిత నగరాల అభివృద్ధి, స్వచ్ఛత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని వ్యర్థాల నిర్వహణ రంగంలో వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి వినూత్న/స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన ప్రతిపాదనలు పంపాలని భారతీయ సంస్థలను కోరింది. దేశంలో నగరాలకు వ్యర్థాల నుంచి విముక్తి కలిగించి వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా చట్టబద్ధ సంస్థగా పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ప్రతిపాదనలు ఆహ్వానించింది.
అందిన ప్రతిపాదనలు పరిశీలించిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఈ రోజు న్యూఢిల్లీకి చెందిన మెసర్స్ సాహి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డుతో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు జనపనార, రేగు, అవిసె లాంటి వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించి నూలు ఉత్పత్తి, వాణిజ్యీకరణ కార్యకలాపాలు చేపడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2.08 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. మొత్తం వ్యయంలో టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 1.38 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది.
పారిశ్రామిక జనపనార (iHemp)లో 0.3% కంటే తక్కువ టెట్రా హైడ్రో కానబినాల్ (THC) కలిగి ఉండే గంజాయి సాటివా కలిగి ఉంటుంది. చిన్న గోధుమ గింజలు (iHemp) ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కలిగి పోషకాహారంగా ఉంటాయి, వీటిలో ఒమేగా-3, ఒమేగా-6 ఉంటాయి. వీటివల్ల అనేక వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అదనంగా, సెల్యులోజ్, హెమి సెల్యులోజ్, పెక్టిన్, లిగ్నిన్ మొదలైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను జనపనార కాండం కలిగి ఉంటుంది. వాటి కూర్పు కారణంగా యూవీ కిరణాల ప్రసారాన్ని అడ్డుకుంటుంది. పత్తితో పోలిస్తే జనపనార సాగులో తక్కువ మొత్తంలో నీటిని వినియోగిస్తారు. పత్తి పాలిస్టర్ నూలుతో పోల్చి చూస్తే జనపనార తక్కువ కార్బన్‌డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. తక్కువ ఇంధనాన్ని మెరుగైన కార్బన్ సీక్వెస్ట్రేషన్‌ను ఉపయోగిస్తుంది. అయితే,స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన ఫైబర్ మరియు బలమైన అత్యంత మన్నికైన సహజ వస్త్ర ఫైబర్‌లలో ఒకటిగా ఉన్నప్పటికీ సరైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో జనపనార వినియోగం ఎక్కువగా లేదు.
వ్యర్థాల నుంచి సంపద సృష్టించడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మూడు దశల్లో వ్యర్థాలను శుద్ధి చేసి నూలు/ నూలు ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారు.
*డెకోర్టికేషన్: జనపనార కాండం నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన డెకార్టికేటర్ యంత్రం ద్వారా కణాలు వేరు చేస్తారు.
*వెట్ ప్రాసెసింగ్: సేకరించిన నూలును అధిక ఉష్ణోగ్రత అధిక పీడన (HTHP) యంత్రాలను ఉపయోగించి ఆల్కలీ / ఎంజైమ్‌లతో శుద్ధి చేస్తారు.
* ఫైబర్ ప్రాసెసింగ్: శుద్ధి చేసిన నూలును కార్డింగ్ ద్వారా వేరు చేసి నీడిల్ పంచింగ్ లాంటి పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తారు.
జనపనార కాండం నుంచి ఉత్పత్తి చేసే నూలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడడమే కాకుండా రైతుల ఆదాయాన్ని ఏడు రెట్ల వరకు పెంచుతుంది.
ఈ సందర్భంగా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు కార్యదర్శి రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ “సామాన్యుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి వినూత్న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సహాయ సహకారం అందించేందుకు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది. అనేక అంకుర సంస్థలు నూతన రంగాలలోకి ప్రవేశిస్తున్నాయి.తమ ప్రయత్నాలు విజయం సాధించడానికి ఆర్థిక సహాయాన్ని కోరుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాల నుంచి నూలు ఉత్పత్తి చేయడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పని చేయడానికి ముందుకు వచ్చింది." అన్నారు.
***
(Release ID: 1911796)