బొగ్గు మంత్రిత్వ శాఖ
మూడు సంవత్సరాల లోనే 87 గనులను విజయవంతంగా వేలం వేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ
సుమారు రూ.33,200 కోట్ల ఆదాయం, మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు
106 బొగ్గు గనుల బ్లాకులకు 7వ రౌండ్ వేలం ప్రక్రియ మార్చ్ 29న ప్రారంభం
Posted On:
28 MAR 2023 4:20PM by PIB Hyderabad
“ఆత్మనిర్భర్ భారత్” స్ఫూర్తితో, వాణిజ్యపరంగా బొగ్గు గనుల వేలం మొదటి విడతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్, 2020లో ప్రారంభించారు. ప్రజలకు ఒక స్థాయిని అందించడానికి బొగ్గు రంగాన్ని తెరవడానికి ఖనిజ చట్టాలను సవరించారు. ప్రైవేట్ రంగ సంస్థలు, అంతిమ వినియోగంపై ఎటువంటి పరిమితి లేకుండా బొగ్గు గనుల వేలాన్ని అనుమతించేందుకు - ఈ గనుల నుండి బొగ్గును సొంత వినియోగం, అమ్మకం లేదా మరేదైనా ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు.
వాణిజ్య బొగ్గు గనుల వేలం ,ముఖ్య అంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
* బొగ్గు అమ్మకం మరియు/లేదా వినియోగంపై పరిమితి లేదు.
* ముందస్తు మొత్తం, బిడ్ సెక్యూరిటీ మొత్తంలో తగ్గింపు.
* విస్తృత భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి సాంకేతిక లేదా ఆర్థిక అర్హత ప్రమాణాలు ఏవీ లేవు.
* పాక్షికంగా అన్వేషణలు జరిపే బొగ్గు గనుల విషయంలో కొంత భాగాన్ని వదులుకోవడానికి అనుమతి.
* నేషనల్ కోల్ ఇండెక్స్, నేషనల్ లిగ్నైట్ ఇండెక్స్ పరిచయం.
* టన్నుకి ఇన్ని రూపాయలకు వేలం అనే విధానం నుండి ఇండెక్స్ రాబడి భాగస్వామ్య యంత్రాంగానికి వలస
* ప్రారంభ బొగ్గు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలను స్వీకరించడానికి ప్రోత్సాహకాలు.
* ఆటోమేటిక్ పద్ధతిలో 100% ఎఫ్డిఐ
* అధిక ఆదాయం సమకూరడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరగడం
* బొగ్గు గనుల పరిసర ప్రాంతాల అభివృద్ధి
మూడేళ్లలోపు ఆరు విడతల వేలం పాటలు విజయవంతంగా ముగియగా, 87 బొగ్గు గనులు వేలం వేయడం జరిగింది. ఈ గనుల ద్వారా దాదాపు రూ. 33,200 కోట్లు రెవెన్యూ పెంచామే కాకుండా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా.
Projections from Commercial Mining
Cumulative figures across the tranches:
సులభంగా వ్యాపారం చేయడం కోసం, బొగ్గు మంత్రిత్వ శాఖ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ (ఎస్డబ్ల్యూసిఎస్) పోర్టల్‌ను రూపొందించింది. ఎస్డబ్ల్యూసిఎస్ అనేది బొగ్గు గనుల ప్రారంభ కార్యాచరణ కోసం వివిధ అనుమతులను పొందేందుకు ఒక వేదికను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ వినూత్న ప్రయత్నం, ఇది చివరికి ఒకే గేట్‌వే ద్వారా దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి దారితీస్తుంది. బొగ్గు గనిని ప్రారంభించడానికి అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతులను (కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు/ఏజెన్సీలను కవర్ చేస్తుంది) మ్యాప్ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. పోర్టల్ సంబంధిత అప్లికేషన్ ఫార్మాట్‌లను అలాగే ఆమోదం/క్లియరెన్స్‌ల మంజూరు కోసం ప్రాసెస్ ఫ్లోలను మ్యాప్ చేస్తుంది.
మార్చి 29, 2023న, బొగ్గు మంత్రిత్వ శాఖ మొత్తం 106 బొగ్గు బ్లాకుల కోసం 7వ రౌండ్ వేలం ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఆఫర్‌లో ఉన్న బొగ్గు గనులను పెట్టుబడిదారుల విభిన్న డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, ఆర్థికాభివృద్ధి మరియు దేశాభివృద్ధికి కట్టుబడి ఉంది.
****
(Release ID: 1911714)
Visitor Counter : 183