సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగు గ్లోబల్ థీమాటిక్ వెబ్‌నార్‌లను నిర్వహించనున్న భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలోని సంస్కృతిక వర్కింగ్ గ్రూప్

Posted On: 22 MAR 2023 5:26PM by PIB Hyderabad

 

భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలోని కల్చర్ వర్కింగ్ గ్రూప్ (సిడబ్ల్యూజీ) మార్చి 2023 మరియు ఏప్రిల్‌ నెలల్లో నాలుగు గ్లోబల్ థీమాటిక్ వెబ్‌నార్‌లను నిర్వహించనుంది. సమగ్ర చర్చలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నాలుగు ప్రాధాన్యతా రంగాలపై నిపుణులతో లోతైన చర్చను ఇది సులభతరం చేస్తుంది. కల్చర్ వర్కింగ్ గ్రూప్ (సిడబ్ల్యూజీ) కల్చరల్ ప్రాపర్టీ రక్షణ మరియు పునరుద్ధరణ; స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం; సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమలు మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; మరియు సంస్కృతికి రక్షణ మరియు ప్రమోషన్ కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ వెబ్‌నార్లు చర్చలను ప్రోత్సహిస్తాయి. నాలుగు కీలక ప్రాధాన్యతా రంగాలలో ప్రత్యక్ష ఫలితాలను రూపొందించడంలో సహాయపడతాయి.

సిడబ్ల్యూజీ నాలెడ్జ్ పార్టనర్‌గా యూనెస్కో(పారిస్) చే నిర్వహించబడే వెబ్‌నార్‌లను భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది మరియు సులభతరం చేస్తుంది.

ఈ గ్లోబల్ థీమాటిక్ వెబ్‌నార్‌లో మొదటిది సిడబ్ల్యూజీ ప్రాధాన్యతలో ఒకటైన "సాంస్కృతిక ఆస్తుల రక్షణ మరియు పునరుద్ధరణ"ని సూచిస్తుంది.  28 మార్చి 2023న మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం) షెడ్యూల్ చేయబడింది. జీ20 సభ్య దేశాలు మరియు అతిథి దేశాలు అలాగే ఎనిమిది అంతర్జాతీయ సంస్థలతో సహా 29 దేశాల నిపుణులను ఒకచోట చేర్చి అక్రమ రవాణా మరియు సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణకు సంబంధించిన దీర్ఘకాల సమస్యను ఈ వెబ్‌నార్ పరిష్కరిస్తుంది.

సాంస్కృతిక కళాఖండాలను అనైతికంగా సేకరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు, కళా సంస్థలు మరియు ప్రైవేట్ సేకరణలలో ప్రదర్శించబడే సాంస్కృతిక వస్తువులు మాత్రమే కాకుండా, ప్రజలు మరియు సమాజాల  గుర్తింపును అవి కోల్పోతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో చట్టవిరుద్ధంగా పొందిన సాంస్కృతిక ఆస్తిని తిరిగి ఇవ్వడం మరియు పునరుద్ధరించడం అనే అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చాలా దేశాలు ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లో ఉన్న దేశాలు పురాతన వస్తువులను మూలం ఉన్న దేశాలకు తిరిగి రావాలని పిలుపునిచ్చాయి.

అంతర్జాతీయ ప్రయత్నాలు ఉన్నప్పటికీ అక్రమ రవాణా మరియు దొంగిలించబడిన సాంస్కృతిక కళాఖండాలను స్వదేశానికి తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మిగిలిపోయింది. 1970 యూనెస్కో రియు 1995 యూనిడ్రోట్‌ కీలక సమావేశాలు తిరోగమనం లేనివి మరియు సార్వత్రిక ఆమోదం లేనివి. నియంత్రణ లేని ఆన్‌లైన్ మార్కెట్‌షేవ్ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. సరిపోని డేటాబేస్‌లు దొంగిలించబడిన వస్తువులను గుర్తించడం మరియు ట్రాక్ చేయడం కష్టతరం చేస్తాయి. పరిమిత ప్రజల అవగాహన మరియు ఆధారాల పరిశోధన కోసం సామర్థ్యం కూడా అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను అడ్డుకుంటుంది.

ఈ వెబ్‌నార్  లక్ష్యం సాంస్కృతిక ఆస్తుల రక్షణ మరియు పునరుద్ధరణపై  భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం; ఉత్తమ అభ్యాసాలు మరియు అనుభవాలను క్యాపిటలైజ్ చేయడం; అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు పునరుద్ధరణను ప్రోత్సహించడానికి ఖాళీలు, అవసరాలు మరియు ప్రాధాన్యతలను గుర్తించడం వంటివి ఉన్నాయి. ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు సోషల్ మీడియాపై నియంత్రణను బలోపేతం చేయడం ద్వారా సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జీ20 సభ్యత్వ ప్రతిబింబాన్ని వెబ్‌నార్ తెలియజేస్తుంది.

వెబ్‌నార్‌లో మూడు విభాగాలు ఉంటాయి. నిపుణులు వారి సంబంధిత టైమ్ జోన్ ఆధారంగా ఈ విభాగాలలో పాల్గొంటారు. ఈ అంశంపై నైపుణ్యం కలిగిన యూనెస్కో,ఇంటర్‌పోల్‌ మరియు యూనిడ్రోయిట్ ప్రతినిధులతో వెబ్‌నార్ మోడరేట్ చేయబడుతుంది. ఇది యూనెస్కో మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్‌ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ క్రింది గ్లోబల్ థీమాటిక్ వెబ్‌నార్లు వరుసగా ఏప్రిల్ 13, 19 మరియు 20వ తేదీలలో ప్రాధాన్యతా రెండు, మూడు మరియు నాలుగు షెడ్యూల్ చేయబడ్డాయి.


 

****


(Release ID: 1910992) Visitor Counter : 120


Read this release in: English , Urdu , Hindi , Punjabi