వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2023 -24 సీజన్‌కు సంబంధించి ముడి జూట్‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
प्रविष्टि तिथि:
24 MAR 2023 9:17PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ..2023-24 సీజన్‌లో ముడి జూట్‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ (సిఏసిపి) సిఫార్సుల ఆధారంగా ఆమోదం పొందింది.
2023-24 సీజన్‌లో ముడి జూట్ ఎంఎస్‌పి (టిడి-3 మునుపటి టీడీ-5 గ్రేడ్‌కి సమానం) క్వింటాల్‌కు రూ.5050/-గా నిర్ణయించబడింది. ఇది మొత్తం భారతదేశ సగటు ఉత్పత్తి వ్యయం కంటే 63.20 శాతం రాబడిని నిర్ధారిస్తుంది. 2023-24 సీజన్ కోసం ప్రకటించిన ముడి జూట్ యొక్క ఎంఎస్‌పి 2018-19 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించినట్లుగా, మొత్తం భారతదేశం వెయిటెడ్ సగటు ఉత్పత్తి వ్యయం కనీసం 1.5 రెట్లు ఎంఎస్‌పిని నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా ఉంది.
ఇది లాభానికి సంబంధించిన మార్జిన్‌గా కనీసం 50 శాతం హామీ ఇస్తుంది. జనపనార ఉత్పత్తిదారులకు మెరుగైన ప్రతిఫలాన్ని అందించడానికి మరియు నాణ్యమైన జనపనార ఫైబర్‌ను ప్రోత్సహించడానికి ఇది ముఖ్యమైన మరియు ప్రగతిశీల దశలలో ఒకటి.
ప్రైస్ సపోర్టు కార్యకలాపాలను చేపట్టడానికి జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసిఐ) కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది మరియు అటువంటి కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది.
*****
(रिलीज़ आईडी: 1910567)
आगंतुक पटल : 235