ఆయుష్

మాజీ సైనికుల సంక్షేమ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న - ఆయుష్ మంత్రిత్వ శాఖ


భారతదేశ వ్యాప్తంగా 10 పాలీక్లినిక్‌ లలో ఆయుర్వేదాన్ని మాజీ సైనికోద్యోగుల కాంట్రిబ్యూటరీ ఆరోగ్య పథకంలో ఏకీకృతం చేయడానికి - అవగాహన ఒప్పందం

Posted On: 24 MAR 2023 4:53PM by PIB Hyderabad

ఈ.సి.హెచ్.ఎస్. పాలిక్లినిక్స్‌ లో ఆయుర్వేదాన్ని ఐదేళ్ల కాలానికి ఓ.పి.డి. సేవగా ఏకీకృతం చేయడానికి అవగాహన ఒప్పందం పై ఆయుష్ మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ/ఈ.సి.హెచ్.ఎస్., రక్షణ మంత్రిత్వ శాఖ (ఈ.సి.హెచ్.ఎస్./డి.ఓ.ఈ.ఎస్.డబ్ల్యూ) ఈ రోజు సంతకం చేశాయి.   అంబాలా, మైసూర్, రాంచీ, నాగ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, మీరట్, దానాపూర్, అలెప్పి (అలప్పుజా)లలోని 10 పాలీక్లినిక్‌ లలో వీటిని ఏర్పాటు చేస్తారు.  ఆయుర్వేద కేంద్రాలు ఇప్పటికే 37 కంటోన్మెంట్ ఆసుపత్రులు, ఏ.ఎఫ్.ఎం.సి. కి చెందిన 12 మిలిటరీ ఆసుపత్రులలో ఉండగా, ఏ.హెచ్.  ఆర్.&ఆర్., ఏ.ఎఫ్. ఆసుపత్రి, హిందాన్  లతో పాటు, ఐదు ఈ.సి.హెచ్.ఎస్. పాలీక్లినిక్‌ లలో ఆయుర్వేద ఓ.పి.డి. లు ఉన్నాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాథక్, డైరెక్టర్ (మెడికల్) కల్నల్ ఏ.సి. నిశీల్ తో పాటు, ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారుల సమక్షంలో ఈ ఎం.ఓ.యూ. పై ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు (ఆయుర్వేదం) డాక్టర్ మనోజ్ నేసరి, ఈ.సి.హెచ్.ఎస్. కు చెందిన  బ్రిగేడియర్ జితేంద్ర సింగ్, మాజీ సైనికోద్యోగుల కాంట్రిబ్యూటరీ ఆరోగ్య పధకం మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఎన్.ఆర్. ఇందుర్కర్ సంతకం చేశారు. 

ఈ ఎం.ఓ.యూ. ప్రకారం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 10 ఈ.సి.హెచ్.ఎస్. పాలిక్లినిక్ / డిస్పెన్సరీల్లో ఈ.సి.హెచ్.ఎస్. సభ్యులందరికీ స్వచ్ఛందంగా ఆయుర్వేద ఓ.పి.డి. సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.  మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది, వారి అవసరాల మేరకు ఆయుర్వేద వైద్యులు, ఫార్మసిస్ట్‌ ల జాబితాను కూడా అందుబాటులో ఉంచుతుంది.  అదేవిధంగా, అవసరమైన ఆయుర్వేద ఔషధాల జాబితాను, అవసరమైన ఇతర సాంకేతిక మద్దతును కూడా అందజేస్తుంది. 

కాగా, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ శాఖ / ఈ.సి.హెచ్.ఎస్., సంబంధిత పాలిక్లినిక్‌ లలో తగిన ప్రదేశంలో అవసరమైన మౌలిక సదుపాయాలను (గదులు/ఫర్నీచర్/ఇతర సౌకర్యాలు) అందించడంతో పాటు, ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేద జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిలో నియమిస్తుంది. అదేవిధంగా, దైనందిన అవసరాల కోసం అనుబంధ సిబ్బంది (పరిపాలన, క్లరికల్, మల్టీ-టాస్కింగ్ సిబ్బంది) ని కూడా నియమిస్తుంది.

ఎం.ఓ.యూ. ప్రకారం ఓ.పి.డి. ల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమం / ఈ,సి,హెచ్,ఎస్, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో కూడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జె.డబ్ల్యూ.జి) ని ఏర్పాటు చేసేందుకు రెండు మంత్రిత్వ శాఖలు అంగీకరించాయి.

రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ సంస్థల్లో ఆయుష్ ఆరోగ్య సేవలు అందించడంతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తమ అనుబంధాన్ని బలోపేతం చేశాయి.  2019 అవగాహన ఒప్పందం ద్వారా, ఏ.హెచ్. ఆర్.&ఆర్. ఏ.ఎఫ్. ఆసుపత్రి హిందాన్ తో పాటు ఐదు (05) ఈ.సి.హెచ్.ఎస్. పాలిక్లినిక్‌ ల సాయుధ దళాల వైద్య సేవల సౌకర్యాలలో ఆయుర్వేద ఓ.పి.డి. ప్రారంభించడం జరిగింది.  ఆ తరువాత 2022 లో, 37 కంటోన్మెంట్ ఆసుపత్రులతో పాటు, సాయుధ దళాల వైద్య సేవల (ఏ.ఎఫ్.ఎం.ఎస్) కు చెందిన 12 మిలిటరీ ఆసుపత్రుల్లో ఆయుర్వేద కేంద్రాలను ప్రారంభించడం కోసం రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

 

*****



(Release ID: 1910560) Visitor Counter : 144