వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడడం తగ్గింపు
Posted On:
24 MAR 2023 4:52PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం 2018-19 నుంచి వంట నూనెల అందుబాటును పెంచేందుకు, నూనె గింజల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం ద్వారా దిగుమతి భారాన్ని తగ్గించేందుకు జాతీయ ఆహార భద్రత మిషన్ - నూనె గింజలు (ఎన్ఎఫ్ఎస్ఎం- ఒఎస్)ను అమలు చేస్తోంది. దేశంలో వేరుశనగ, సోయాబీన్, ఆవ జాతి గింజలు, ఆవ, పొద్దుతిరుగుడు పువ్వు, కుసుమలు, నువ్వులు, ఆవిసెలు, నిగర్, ఆముదం విత్తనాల ఉత్పాదకతను, పామ్ ఆయిల్, చెట్ల నుంచి వచ్చే నూనె విత్తనాలు (ఆలివ్, మహువా, కోకుమ్, అడవి నేరేడు, వేప, జజోబా, కరంఆ, సిమరోబా, తుంగ్, చెవురా, అవి ఆముదం) పెంపకానికి విస్తీర్ణాన్ని పెంచుతోంది. ఈ పథకంలో మూడు ఉప మిషన్లు ఉన్నాయి, అవి, ఎన్ఎఫ్ఎస్ఎం- నూనెగింజలు, ఎన్ఎఫ్ఎస్ఎం- పామాయిల్, ఎన్ఎఫ్ఎస్ఎం- చెట్ల నుంచి వచ్చే నూనెవిత్తనాలు.
అవేకాకుండా, 2021-22వ సంవత్సరంలో, కేంద్ర ప్రాయోజిత పథకమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ (ఎన్ఎంఇఒ-ఒపి- వంట నూనె- పామాయిల్‌పై జాతీయ మిషన్)ను పామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించింది. తద్వారా, వంట నూనెలలో దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్& నికోబార్‌లలో పామాయిల్ పెంపక విస్తీర్ణాన్ని 2025-26 నాటికి 3.70 లక్షల హెక్టేర్ల నుంచి 10.00 లక్షల హెక్టేర్లకు పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఈ పథకాన్ని 2022-23లో 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.
జాతీయ ఆహార భద్రతా మిషన్- నూనె గింజలు (ఎన్ఎఫ్ఎస్ఎం-ఒఎస్) కింద భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అవి - ఆవజాతి &ఆవాల అధిక దిగుబడి రకాల విత్తనాల పంపిణీకి, హైబ్రిడ్ ఆవ విత్తనాల పంపిణీ కార్యక్రమం, రాపిడ్ సోయాబీన్ సీడ్ మల్టిప్లికేషన్ ప్లాన్ (3ఎస్1వై - వేగంగా వృద్ధి అయ్యే సోయా విత్తనాల ప్రణాళిక), దేశంలో మూడేళ్ళ పాటు 2022-23 నుంచి 2024- 25 వరకు హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తి & ప్రదర్శన ద్వారా పొద్దుతిరుగుడు పువ్వు సాగు ఉత్పత్తిని, విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. అదనంగా, 2022-23లో వరి బీళ్ళలో పొద్దుతిరుగుడు పువ్వుసాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వార్షిక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.
జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)- నూనెగింజలను 2017-18 నుంచి భారత ప్రభుత్వం గుజరాత్ సహా 28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తోంది. కాగా, గుజరాత్‌లోని 33 జిల్లాలకు తోడ్పాటును అందిస్తున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1910546)
Visitor Counter : 163