వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సమాచార ఆధారిత గుర్తింపు, పారదర్శకత విధానంతో భారతదేశ రవాణా రంగాన్ని సులభతరం చేస్తున్న యులిప్
ప్రారంభించిన 6 నెలల్లోనే యూలిప్ పోర్టల్ లో నమోదైన 400 సంస్థలు కంపెనీల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన 6 నెలల్లోనే యూలిప్ అవసరాలకు అనుగుణంగా 30కి పైగా యాప్ లను అభివృద్ధి చేసిన పరిశ్రమ
Posted On:
24 MAR 2023 2:24PM by PIB Hyderabad
జాతీయ రవాణా విధానం (ఎన్ ఎల్ పి)లో భాగంగా యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ ఫామ్ (యులిప్)ను 2022 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.సమాచార ఆధారిత గుర్తింపు, పారదర్శకత విధానంతో పనిచేసే యూలిప్ సమాచారాన్ని వేగవంతంగా, సులభతరంగా పారదర్శక విధానంలో అందించడానికి ఒక ప్రత్యేక పోర్టల్ ను కలిగి ఉంది. దీనివల్ల భారత రవాణా రంగానికి ప్రయోజనం కలుగుతుంది. "https://www.goulip.in" ద్వారా పోర్టల్ ని వినియోగించవచ్చు. ప్రారంభించిన నాటి నుంచి యూలిప్ కు పరిశ్రమ వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రారంభించిన 6 నెలల్లోనే 400కు పైగా సంస్థలు యూలిప్ లో నమోదు అయ్యాయి. సమాచార వివరాలు పొందడానికి ఇప్పటికే 68 సంస్థలు యూలిప్ తో నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్స్ (ఎన్డిఎ) కుదుర్చుకున్నాయి. యూలిప్, ఏపీఐ ల మధ్య అనుసంధానం చేసి తమ తుది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పరిశ్రమ వర్గాలు 30 కి పైగా యాప్ లను అభివృద్ధి చేశాయి. ఆరు నెలల తక్కువ వ్యవధిలో 6.5 కోట్ల ఏపీఐ అంశాలను యూలిప్ పరిశీలించి నిర్ణయం తీసుకుంది. యూలిప్ తో కలిసి పనిచేయడానికి సేవారంగంలో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థలతో పాటు అంకుర సంస్థలు ముందుకు వస్తున్నాయి.
డీపీఐఐటీ లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శి, ఎన్ఐసీడీసీ సీఈవో, ఎండీ, ఎన్ఎల్ డీఎస్ఎల్ చైర్మన్ సుమితా దావ్రా యూలిప్ సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళిక వివరించారు. ' పారదర్శకంగా సమర్ధంగా పనిచేస్తున్న యులిప్ వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. భారత రవాణా రంగం అభివృద్ధికి వినూత్న నూతన విధానాల ద్వారా సహకారం అందిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన గతిశక్తి లక్ష్యాలను సాధించడానికి జాతీయ రవాణా విధానం సహకరిస్తుంది' అని సుమితా దావ్రా అన్నారు. బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఆహారధాన్యాల లాంటి రంగాల అవసరాలపై యూలిప్ దృష్టి సారిస్తుందన్నారు.
మారుతీ సుజుకీ, డీహెచ్ ఎల్, సేఫ్ ఎక్స్ ప్రెస్, అల్ట్రాటెక్, టీసీఐఎల్, జిందాల్ స్టెయిన్ లెస్, టాటా స్టీల్, యస్ బ్యాంక్, బాష్, టోటల్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు యూలిప్ తో కలిసి పనిచేస్తున్నాయని సుమితా దావ్రా వివరించారు.
నిర్వహణపరంగా వివిధ కార్యకలాపాలు, ప్రక్రియల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న పరిశ్రమలు యూలిప్ అందిస్తున్న సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరింత పెరిగేందుకు సహకరించే పరిష్కార మార్గాలు/ యాప్ లను అభివృద్ధి చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రముఖ సిమెంట్ ఉత్పత్తిదారు అయిన అల్ట్రాటెక్ సిమెంట్ తన ఉత్పత్తులను భారతదేశం అంతటా సరఫరా చేయడానికి ప్రతిరోజు పదుల సంఖ్యలో రవాణా వాహనాలు ఉపయోగిస్తుంది. ఈ వాహనాలను ఇతర రవాణా సంస్థలు సమకూరుస్తున్నాయి. యూలిప్ సేవలు ఉపయోగిస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్ అన్ని రవాణా వాహనాల వాస్తవ పరిస్థితిని సులువుగా గుర్తించడానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా రవాణా సంబంధిత టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇంటుజిన్ జిపిఎస్ పరికరం లేదా సమ్మతి అందుబాటులో లేని చోట రోడ్డు రవాణా కోసం యులిప్ అభివృద్ధి చేసిన ఫాస్టాగ్ ఎపిఐని సాధనంగా ఉపయోగిస్తోంది.యులిప్ అభివృద్ధి చేసిన రైల్వేస్ కార్గో ట్రాకింగ్ ఎపిఐని ఉపయోగించడం ద్వారా రైళ్లల్లో రవాణా అవుతున్న సరుకుల వివరాలను రవాణా ప్రారంభమై గమ్య స్థానం చేరేవరకు గుర్తించడానికి ప్రణాళిక సాధనాన్ని కూడా అభివృద్ధి చేసింది.
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన యెస్ బ్యాంక్ ఐఈసీ కోడ్ ధ్రువీకరణ, కార్గో వాస్తవ కదలికల ధృవీకరణ వంటి బ్యాక్ ఎండ్ రిస్క్ మేనేజ్మెంట్ కార్యకలాపాల కోసం యూలిప్ ఏపీఐ సేవలు ఉపయోగిస్తోంది.లింకిట్ అనే స్టార్టప్ తయారీ సంస్థల గేట్, యార్డ్ ఆటోమేషన్ కోసం సమాచారాన్ని వినూత్నంగా ఉపయోగిస్తోంది. డిజిలాకర్ వ్యవస్థ సహకారంతో యులిప్ రూపొందించిన ఇకెవైసి ద్వారా ఖాతాదారుల అధికారిక పత్రాలను టిసిఐఎల్ ఎలక్ట్రానిక్ విధానంలో పరిశీలిస్తోంది. ఈ విధానం వల్ల మానవ వనరుల వినియోగం తో పాటు సమయం, ఖర్చు తగ్గుతాయి.
రవాణా రంగంలో బీమా సంబంధిత అంశాలు పరిస్కరిస్తున్న కార్గో శక్తి క్లెయిమ్ ల పరిష్కారానికి యులిప్ అందిస్తున్న సమాచారాన్ని డిజిటల్ సాక్ష్యంగా ఉపయోగిస్తోంది. దీనివల్ల సంస్థ అనేక పత్రాలను రూపొందించే శ్రమ నుంచి బయటపడింది.
వివిధ మంత్రిత్వ శాఖల వద్ద లభ్యమయ్యే రవాణా, ఇతర వనరులకు సంబంధించిన సమాచారాన్ని పరిశ్రమలకు యూలిప్ సురక్షితంగా అందిస్తోంది. సంబంధిత వర్గాల వినియోగం కోసం ప్రస్తుతం ఏడు మంత్రిత్వ శాఖలకు చెందిన 33 వ్యవస్థలు 106 ఎపిఐల ద్వారా 1600 కి పైగా డేటా ఫీల్డ్ లను భాగస్వాముల ఉపయోగం కోసం అనుసంధానం చేశాయి. . పోర్టల్ లో నమోదు అయ్యేలా పరిశ్రమ వర్గాలకు సహకరించడానికి ప్రత్యేక సహాయక బృందం 24 గంటలు పనిచేస్తోంది. రిజిస్ట్రేషన్ తరువాత వినియోగదారులు తమ అవసరాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థించిన సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అన్న అంశాన్ని పరిశీలించిన తర్వాత యూలిప్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఏపీఐ ఆధారిత ఇంటిగ్రేషన్ కలిగి ఉన్న యూలిప్ వినియోగదారులు మల్టీ మోడల్ ట్రాక్ అండ్ ట్రేస్, పీపుల్ అండ్ వెహికల్ అథెంటికేషన్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్, యార్డులు మరియు గేట్ల వద్ద ప్రాసెస్ ఆటోమేషన్, డిస్కవరీ సర్వీసెస్ వంటి వివిధ కార్యకలాపాలు మరియు సేవల కోసం డేటాను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల రవాణా రంగంలో నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి సహకరిస్తుంది.
***
(Release ID: 1910401)
Visitor Counter : 189