రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశంలో జాతీయ రహదారులు నిర్మించేటప్పుడు పర్యావరణ సహనీయత కోసం ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.

Posted On: 23 MAR 2023 3:11PM by PIB Hyderabad

దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేటప్పుడు  పర్యావరణ సహనీయత కోసం  ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.

వాటిలో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి:    


(i)  రోడ్ల పక్కన, మధ్యలో మొక్కలు నాటడం, భూ దృశ్యం రమ్యంగా మార్చడం మరియు మొక్కలను తిరిగినాటడం కోసం  హరిత రహదారుల (మొక్కలు నాటడం, తిరగనాటడం, సుందరీకరణ మరియు నిర్వహణ) విధానం, 2015  అమలు చేయడం;  

(ii)  ప్రత్యామ్నాయ పదార్ధాలను వాడటం మరియు వ్యర్థ పదార్ధాలను తిరిగి వాడటం;  

(iii)  ప్లాస్టిక్ వ్యర్ధాల వినియోగం ;

(iv)  నీటి వనరులు / కొలనులు, వన్యప్రాణులు నివసించే స్థలాలు, చిన్న అడవి

(v)  తరిగిపోతున్న భూగర్భ జలాల భర్తీ కోసం వర్షపునీటి సేకరణ కట్టడాల నిర్మాణం;  

(vi)  రోడ్డుపైన బ్రిడ్జి  (ఆర్ ఓ బి) మొదలైనవి నిర్మాణం కోసం థర్మల్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద వినియోగం;  

(vii) నీటి వనరుల పరిరక్షణ / నిల్వచేయడం కోసం ప్రతి జిల్లాలో 75, దేశవ్యాప్తంగా 50,000 అమృత సరోవర్ ల నిర్మాణం;  

(viii) వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద రక్షిత స్థలం మీదుగా వెళ్లే రహదారులలో వన్యప్రాణుల నివాస స్థలాల పరిరక్షణ కోసం నిర్మాణాత్మక చర్యలు సిద్ధం చేయడం;  

(ix)   ఐ ఆర్ సి ఎస్పి -- 108, 2015 -  2015లో జరిగిన భారత రహదారుల కాంగ్రెస్ లో రూపొందించిన  పర్యావరణ నిర్వహణ ప్రణాళిక తయారీ మరియు అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు

హరిత రహదారుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద  ఎలాంటి స్కీము లేదు.  అయితే రోడ్ల పక్కన, మధ్యలో మొక్కలు నాటడం, భూ దృశ్యం రమ్యంగా మార్చడం మరియు మొక్కలను తిరిగినాటడం కోసం  హరిత రహదారుల (మొక్కలు నాటడం, తిరగనాటడం, సుందరీకరణ మరియు నిర్వహణ) విధానం, 2015  అధికారికంగా ప్రకటించారు.  

     మధ్యప్రదేశ్  ప్రభుత్వం 2021లో చంబల్ ఎక్స్ ప్రెస్ వే పేరును  మార్చి అటల్ ప్రోగ్రెస్ వే అని కొత్త పేరుపెట్టారు. ప్రస్తుతం జాతీయ రహదారుల ప్రాజెక్ట్  ఉత్తరప్రదేశ్ లోని 36.872 కిలోమీటర్ల పొడవైన సెక్షను సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక (డి పి ఆర్) మరియు నిర్మాణానికి ముందు జరిగే పనులతో పురోగమిస్తున్నది.   ఉత్తరప్రదేశ్ సెక్షన్ తాత్కాలిక నిర్మాణ వ్యయం దాదాపు రూ. 1100 కోట్లు ఉంటుందని అంచనా.

       కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందజేశారు.  




 

*****



(Release ID: 1910297) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Tamil